Nindu Noorella Saavasam Today January 4th: అమరేంద్ర మాటలకి కన్నీళ్లు పెట్టిన రామ్మూర్తి.. అమ్ముని మోటివేట్ చేసిన మిస్సమ్మ!
Nindu Noorella Saavasam Today Episode: డిప్రెషన్ లో ఉన్న అమ్ము ని మిస్సమ్మ మోటివేట్ చేయడం వలన తను అడుగు ముందుకు వేస్తుందా లేకుంటే ఎన్నికల బరినుంచి తప్పుకుంటుందా అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో స్కూల్ కి బయలుదేరుతున్న మిస్సమ్మని నేను డ్రాప్ చేస్తాను అంటాడు అమర్. వద్దు నడుచుకొని వెళ్తాను అంటూ మొండికేస్తున్న మిస్సమ్మని ఒక చూపు చూస్తాడు అమర్. దాంతో వెంటనే వెహికల్ లో కూర్చుంటుంది మిస్సమ్మ.
మరోవైపు ప్రిన్సిపల్ మనోహరి ని కూర్చోబెట్టుకొని అంజు గురించి ఏకధాటిగా కంప్లైంట్లన్నీ ఇస్తుంది. ఆ కంప్లైంట్లు వినలేక చస్తుంది మనోహరి. ఘోర కిటికీ దగ్గరికి వచ్చి తనని రమ్మని పిలవడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తుంది మనోహరి.
ప్రిన్సిపల్: ఎక్కడికి వెళ్తున్నారు ఇంకా చాలా కంప్లైంట్ లు ఉన్నాయి.
మనోహరి : ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నారు ఇంకా కంప్లైంట్ లు ఉన్నాయా అని విసుక్కుంటుంది.
అక్కడే ఉన్నా అరుంధతి ప్రిన్సిపల్ ఓవరాక్షన్ చేస్తుంది అని ఆమెని తిట్టుకుంటుంది ఇంతలో లంచ్ బెల్ కావడంతో పిల్లలు ఎలా తింటున్నారో ఏమో అనుకొని అక్కడ నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత మనోహరి కూడా బయటికి వచ్చేసి ఘోర ని ఆత్మ ఎక్కడ ఉంది అని అడుగుతుంది.
ఘోర: ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది.
మనోహరి: లంచ్ బెల్ కదా పిల్లల దగ్గరికి వెళ్లి ఉంటుంది.
ఘోర : రోజురోజుకీ ఆమెని బంధించడం కష్టమైపోతుంది.
మనోహరి : బ్రతికున్నప్పుడు పుణ్యాలు ఎక్కువ చేసింది. ఆ పుణ్యమే ఇప్పుడు కాపాడుతుంది అయినప్పటికీ తనని వదిలిపెట్టేది లేదు ఉంటుంది. నేను కూడా అంటూ వంత పాడుతాడు ఘోర.
మరోవైపు మిస్సమ్మ వాళ్ళు స్కూల్ కి వస్తారు. మిస్సమ్మ డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు తండ్రిని చూడదు కానీ ఆయన దగ్గు విని కిందికి దిగి చుట్టూ చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు.
అమర్: ఏం జరిగింది? ఎవరిని చూస్తున్నావు.
మిస్సమ్మ: ఏమీ లేదు ఎవరో తెలిసిన వాళ్ళలా కనిపిస్తేను అంటూ పిల్లలకి లంచ్ టైం అయిపోతుంది ఇచ్చి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే రామ్మూర్తి దగ్గుకుంటూ మంచినీళ్లు తాగి బయటికి వస్తాడు.
అమర్: అంతలా దగ్గుతున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు. రామ్మూర్తి ఏమీ లేదు అని చెప్తాడు.
అమర్ : వయసు పైబడిన తర్వాత వచ్చే జబ్బులను తేలికగా తీసుకోకూడదు అని చెప్తాడు.
రామ్మూర్తి: జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసు. దానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. నాకు మందులు కొనడానికి మా అమ్మాయి చాలా కష్టపడుతుంది అలాగే ట్రీట్మెంట్ కోసం కూడా ఏదో దారి ఉందట దానికోసం ప్రయత్నిస్తుంది.
అమర్: మీకు మీ అమ్మాయి తప్ప ఎవరూ లేరా అని అడుగుతాడు.
రామ్మూర్తి : ఒక బంధం ఉండేది కానీ నాకు తెలియకుండానే నేను పోగొట్టుకున్నాను అంటాడు.
అమర్: మీకు ఎవరూ లేరు అనే భావన పక్కన పెట్టండి మీ కోసం మేము ఉన్నాము ఈ వయసులో ఇంత కష్టపడకండి కనీసం అప్పుడప్పుడు కూర్చొని అని చెప్పి అతనిని పక్కన కూర్చోబెడతాడు. మీ ట్రీట్మెంట్ బాధ్యత కూడా నాదే అని చెప్పి వెళ్ళిపోతాడు.
రామ్మూర్తి అమర్ మాటలకి అమర్ ప్రవర్తనకి బాగా ఎమోషనల్ అవుతాడు.
మరోవైపు లంచ్ కి వచ్చిన అమ్ము వాళ్ళని లూజర్స్ అంటూ ఆట పట్టిస్తారు మిగిలిన పిల్లలు. ఆ మాటలకి అమ్ము బాగా డిస్టర్బ్ అవుతుంది కానీ అంజు వాళ్ళతో ఫైటింగ్ కి దిగుతుంది. తన అన్నలు ఇద్దరు ఆమెని లాక్కొని వచ్చేస్తారు. తర్వాత టైం అయిపోతుంది అక్క లంచ్ చేద్దాం అని అమ్ముతో చెప్తారు.
అమ్ము : నాకు ఆకలిగా లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మ కి జరిగిందంతా చెప్తారు పిల్లలు. పిల్లలతో మాట్లాడుతూ ఉంటుండగానే అరుంధతిని చూస్తుంది మిస్సమ్మ.
నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతుంది.
మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు కదా అని ఎవరో అమ్మాయిని చూపిస్తుంది.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే మిస్సమ్మ వైపు అయోమయంగా చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు పిల్లలు.
మిస్సమ్మ : మన పక్కింటి ఆంటీ అని అరుంధతిని చూపిస్తుంది. అదే సమయంలో వేరే ఆవిడ అక్కడ కూర్చోవడంతో ఆవిడ మన పక్కింటి ఆవిడ కాదు మన పక్క వీధి ఆవిడ అని చెప్తారు పిల్లలు.
మిస్సమ్మ: ఎవరైతే ఏముంది గాని ముందు నువ్వు ఓడిపోతాను అనే భయాన్ని పక్కన పెట్టు. ఎవరైతే నిన్ను ఆటపట్టిస్తున్నారో వాళ్ళ దగ్గరే నువ్వు గెలిచి చూపిస్తేనే కిక్కు అంటూ అమ్ముని మోటివేట్ చేస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.