Nindu Noorella Saavasam January 3 Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అంజలి చేసిన పనికి కన్నీరు పెట్టుకున్న అమ్ము, అరుంధతి వెంటపడ్డ ఘోర ఆమెను బంధిస్తాడా!
Nindu Noorella Saavasam Today Episode: అరుంధతిని బంధించడానికి ఘోర ఆమె వెంట పడటంతో అరుంధతిని బంధించేస్తాడేమో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Nindu Noorella Saavasam Telugu Serial Today Episode: రామ్మూర్తి సరస్వతి మేడం గురించి మాట్లాడడం విన్న అరుంధతి షాక్ అవుతుంది.
అరుంధతి : సరస్వతి మేడం అంటే మా వార్డెనే,ఆవిడ హైదరాబాదులోనే ఉంది ఆవిడ కోసమే మీరు వెతుకుతున్నారా.. మీ అమ్మాయి అనాధాశ్రమంలో పెరిగిందా అంటూ చాలా ప్రశ్నలు వేస్తుంది.
అయితే అవేవీ రామ్మూర్తికి వినిపించవు.
మనోహరి: ఈ మాటలు అన్నీ అరుంధతి విందంటే రామ్మూర్తి తన తండ్రి, భాగమతి తన చెల్లి అని తెలిసిపోతుంది. తను అనాధ కాదు అన్న విషయం తన ఆత్మకి కూడా తెలియకూడదు తన ఆత్మ శాంతించకూడదు అని కసిగా అనుకుంటుంది.
మరోవైపు అంజలి వాళ్ళు ఎలక్షన్స్ లో గెలవకూడదు అనుకుంటుంది ప్రిన్సిపాల్ బంటిని తన రూమ్ కి పిలిపించుకుంటుంది.
ప్రిన్సిపల్: ఈ ఎలక్షన్స్ లో నువ్వే గెలుస్తావా అని అడుగుతుంది.
బంటి : నేనే గెలుస్తాను మేడం అని కాన్ఫిడెంట్గా చెప్తాడు.
ప్రిన్సిపల్: ఎలా? చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చా.. ఆ తెలివితేటలు పక్కన పెట్టు ఎలక్షన్స్ లో గెలిచే ఉపాయం ఆలోచించు. నువ్వే గెలుస్తావని నాకు నిన్నటి వరకు నమ్మకం ఉండేది కానీ ఆ అమృత వాళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్స్ కి పేరు ఇచ్చారో అప్పుడే నాకు నమ్మకం పోయింది.
బంటి : ఆ చిన్న పిల్ల గురించి భయపడొద్దు తను స్కూల్లో ఎవరికి తెలియదు అంటాడు.
ప్రిన్సిపల్: ఆ చిన్న పిల్లని తక్కువ అంచనా వేయొద్దు తను ఏదైనా అనుకుందంటే చేసి తీరుతుంది. అమృత గెలిచిందంటే ఇంక ఆ అంజలి ఆటలకి తిరుగుండదు. అందుకే నువ్వు వెళ్లి స్టూడెంట్స్ తో మాట్లాడు, మీరు ఏమైనా తప్పు చేస్తే ప్రిన్సిపల్ పనిష్మెంట్ ఇవ్వకుండా చూసుకుంటాను ప్రిన్సిపాల్ నాకు క్లోజ్ అని చెప్పు అని బంటిని ట్రైన్ చేసి పంపిస్తుంది.
ఆ తర్వాత చెట్టు కింద కూర్చున్న రామ్మూర్తితో గేటు దగ్గర కూర్చోవడం మానేసి ఇక్కడ ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు అని కోప్పడుతుంది ప్రిన్సిపల్.
రామ్మూర్తి: అక్కడ ఎండగా ఉందని ఇక్కడ కూర్చున్నాను మేడం అయినా నేను ఒంటరిగా లేను నా పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది అంటాడు.
ప్రిన్సిపల్ మందలించడంతో అక్కడినుంచి గేటు దగ్గరికి వెళ్ళిపోతాడు. నేను కనిపించకపోయినా ఆయన పక్కన నేను ఉన్నట్టు ఆయన మనసుకి ఎలా తెలిసింది. ఇంతకీ ఎవరాయన అని అనుకుంటుంది. ఇంతలో మనోహరీ కనిపించడంతో తనేందుకు ఇక్కడికి వచ్చింది అనుకొని ఆమె దగ్గరికి వెళుతుంది. ఆత్మ నీ పక్కనే ఉంది స్కూల్ వెనక్కి తీసుకురా అన్నట్లు సైగ చేస్తాడు ఘోర. కంగారుపడిన మనోహరి కంగారుగా అక్కడినుంచి స్కూల్ వెనక్కి వెళ్తుంది. ఆమెని ఫాలో అవుతుంది అరుంధతి. అరుంధతిని ఫాలో అవుతాడు ఘోర.
ప్రిన్సిపల్: అప్పుడే అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ మీరు అంజలి తాలూకా కదా స్కూల్ వెనకవైపు ఎందుకు వెళ్తున్నారు అని అనుమానం గా అడుగుతుంది. అప్పటికే ఆమెను చూసి ఘోర పక్కన దాక్కుంటాడు.
మనోహరి: మీతో మాట్లాడటానికే అని తడబడుతూ చెప్తుంది.
ప్రిన్సిపల్ : నా రూమ్ అటు కాదు ఇటువైపు అనటంతో ఆమెని ఫాలో అవుతుంది మనోహరి.
ప్రిన్సిపాల్ తో మాట్లాడుతుంది అంటే అంజు గురించి ఏమైనా కంప్లైంట్ ఇస్తుందేమో అనుకొని వాళ్ళని అరుంధతి ఫాలో అవుతుంది అరుంధతిని ఘోర ఫాలో అవుతాడు.
మరోవైపు అంజు వాళ్ళు తమకి ఓటేయమని పిల్లలందరినీ అడుగుతుంటే మాకు బంటి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నాడు మేము వాడికే ఓటేస్తాము అంటారు. దాంతో అమ్ము బాధపడుతుంది.
అమ్ము : ఆరోజు వద్దంటే నా పేరు ఇచ్చేసావు నేను వెళ్లి ఇప్పుడు క్యాన్సిల్ చేసేస్తాను ఓడిపోయాను అనేకన్నా మధ్యలో డ్రాప్ అయిపోయాను అనిపించుకోవడం బెటర్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మంజు అన్నలు ఇద్దరు కూడా నువ్వు తప్పు చేశావు అక్కని అనవసరంగా ఏడిపిస్తున్నావు అని అంజు ని తప్పుపట్టి అమ్ము కోసం వెళ్ళిపోతారు.
అంజు: అందర్నీ కలుపుకొని ఎలాగైనా అమ్ము ని గెలిపించాలి అంటే వీళ్లే డ్రాప్ అయిపోతున్నారు. ఎలాగైనా అమ్ము గెలిచేలాగా చేయాలి అనుకుంటుంది.
మరోవైపు పిల్లల కారేజ్ బ్యాగ్ లో స్వీట్ పెట్టడం మర్చిపోతుంది నీల. అది గమనిస్తుంది మిస్సమ్మ.
మిస్సమ్మ: ఈ బాక్సులు క్యారేజీ బ్యాగ్ లో పెట్టలేదా వేరే బ్యాగ్ ఇవ్వు నేను వెళ్లి ఈ బాక్సులు ఇచ్చి వస్తాను అంటుంది.
నీల: కంగారు పడిపోతూ ఈరోజు ఆత్మ ని బంధిస్తారు ఈమె వెళితే ప్లాన్ మొత్తం పాడైపోతుంది అని మనసులో అనుకొని వద్దమ్మ గారు ఈ పూట తినకపోతే ఏమి కాదు అంటుంది.
మిస్సమ్మ: నేను వెళ్తానంటే నీకేంటి ప్రాబ్లం అని మందలిస్తుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన రాథోడ్ ఏం జరిగింది అని అడుగుతాడు జరిగిందంతా చెప్తుంది మిస్సమ్మ.
రాథోడ్: ఎందుకు ఆమెని స్కూల్ కి వెళ్లొద్దంటున్నావు, అయినా మనోహరి మేడం వచ్చిన దగ్గరనుంచి నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది అంటాడు. ఆ తర్వాత మిస్సమ్మని స్కూల్లో డ్రాప్ చేస్తాను అని చెప్తాడు.
మిస్సమ్మ : నేను రాను నడుచుకొని వెళ్తాను అని బయటికి వచ్చేసరికి ఎదురుగా అమర్ కనిపిస్తాడు. స్కూల్ కి వెళ్తుందని తెలుసుకొని నేను డ్రాప్ చేస్తాను అంటాడు. మిస్సమ్మ వద్దు నేను నడుచుకొని వెళ్తాను అంటే నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడాలి అందుకే వస్తానంటున్నాను అనటంతో మరి ఏమి మాట్లాడలేక పోతుంది మిస్సమ్మ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Read Also: ‘హనుమాన్’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ