![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nindu Noorella Saavasam January 2 Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఘోరకి లైన్ క్లియర్ చేస్తున్న మనోహరి, అరుంధతికి ఆ నిజం తెలిసిపోతుందా?
Nindu Noorella Saavasam Today Episode: రామ్మూర్తి మాటలు విన్న అరుంధతి కి రామ్మూర్తి తన తండ్రి అని తెలుస్తుందేమో అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
![Nindu Noorella Saavasam January 2 Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఘోరకి లైన్ క్లియర్ చేస్తున్న మనోహరి, అరుంధతికి ఆ నిజం తెలిసిపోతుందా? Nindu Noorella Saavasam telugu serial January 2nd episode written update Nindu Noorella Saavasam January 2 Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఘోరకి లైన్ క్లియర్ చేస్తున్న మనోహరి, అరుంధతికి ఆ నిజం తెలిసిపోతుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/02/9d808cbeb271cce7f41260731a07f98c1704162239834891_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నేను కూడా పనిలోకి పోవడానికి నాలుగిళ్లు మాట్లాడుకొని ఉంచుకున్నాను అంటుంది మంగళ.
మిస్సమ్మ: ఇప్పుడు మీరు పనిలోకి వెళ్లవలసిన అవసరం ఏముంది నేను డబ్బులు పంపిస్తున్నాను కదా.
మంగళ: ఎన్నాళ్ళని పంపిస్తావు రేపు పెళ్లయితే మీ ఆయన ఒప్పుకోడు కదా.
మిస్సమ్మ: ఇప్పుడు నాకు పెళ్లి ఆలోచన లేదు, ముందు నాన్న ఆరోగ్యం కుదుటపడాలి.
మంగళ: నీకు లేకపోయినా తల్లిదండ్రులుగా మాకు బాధ్యత ఉంది కదా అంటూ తమ్ముడు వైపు తిరిగి నిన్ను బయటికి పొమ్మన్నాను కదా అని కసురుకుంటుంది.
మిస్సమ్మ : ఏం జరిగింది అని అడగటంతో తమ్ముడు చెయ్యి చూపిస్తుంది మంగళ.
మంగళ: మీ నాన్నకి ఇప్పుడు అన్ని దగ్గరుండి వాడే చూసుకుంటున్నాడు రేపు పెళ్లి అయిపోతే ఇవన్నీ వాడి పెళ్ళాం జరుగనివ్వదు కదా అని సెంటిమెంట్ డైలాగులు వేస్తుంది.
బాధతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది మిస్సమ్మ. తమ ప్లాన్ వర్క్ అవుట్ అయినందుకు సంతోషపడతారు అక్క తమ్ముళ్లు.
మరోవైపు అమర్ పిల్లలని స్కూల్ లో డ్రాప్ చేస్తాడు.
అమర్: ఎలక్షన్స్ కోసం ఎవరితోనీ గొడవ పడకండి నాకు స్కూల్ నుంచి ఎలాంటి కంప్లైంట్ రాకూడదు అంటాడు.
ఇంతలో రామ్మూర్తి వచ్చి వాళ్ళని పలకరిస్తాడు పిల్లలు ఎవరూ అతనితో మాట్లాడకపోవడంతో ఏం జరిగింది అంటాడు అమర్.
పిల్లలు: నిన్నటి నుంచి తాతయ్య మూడీగా ఉన్నారు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పటం లేదు.
అమర్: ఏం జరిగిందో చెప్పండి అనటంతో తన జబ్బు సంగతి కూతురు పెళ్లి సంగతి చెప్తాడు రామ్మూర్తి.
అమర్: మీ అమ్మాయి గురించి మీరు ఎలాంటి బెంగ పడకండి మీకు ఎలాంటి అవసరం వచ్చినా నేను సాయం చేస్తాను అని మాట ఇస్తాడు.
బాగా ఎమోషనల్ అవుతాడు రామ్మూర్తి.
మీ అమ్మాయి ఎక్కడ పని చేస్తుంది? మీ అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతాడు అమర్. రామ్మూర్తి చెప్పేలోపు అమర్ కి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అరుంధతి: మీరు వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడ ఉంటే పిల్లలు గెలుస్తారంట అంటుంది.
ఆ తర్వాత ఘోర తో అరుంధతిని బంధించమని చెప్తుంది మనోహరి.
ఘోర : రామ్మూర్తిని చూసి ఆత్మని బంధించడం అసాధ్యం. అతను ఉండగా బంధించలేను క్రితంసారి కూడా అతని వల్లే ఆత్మను బంధించలేకపోయాను. రక్తసంబంధికులు అడ్డుపడ్డారు అంటే అర్థం ఉంది కానీ ఇతని వల్ల కూడా ఎందుకు నేను ఆత్మను బంధించలేకపోతున్నానో అర్థం కావడం లేదు.
మనోహరి: ఇతనే అరుంధతి తండ్రి అని చెప్పటంతో షాక్ అవుతాడు.
మనోహరి: నువ్వు స్కూల్ వెనకవైపు నుంచి రా నేను అరుంధతి అక్కడికి వచ్చేలాగా చేస్తాను అని చెప్పి స్కూల్ లోపలికి వెళుతుంది.
ఘోర స్కూల్ వెనుక వైపు నుంచి వచ్చి అరుంధతి ఆత్మ రామ్మూర్తి పక్కనే ఉండటం చూస్తాడు. అదే విషయం మనోహరి కి చెప్తాడు.
మనోహరి: తండ్రీ కూతుర్ల ని తెలియకపోయినా పక్క పక్కనే కూర్చున్నారు అంటే రక్తసంబంధానికి అంత బలం ఉందా అనుకుంటుంది.
రామ్మూర్తికి తన పక్కన ఎవరో కూర్చున్నారు అనిపిస్తుంది తదేకంగా అటువైపే చూస్తూ ఉంటాడు. తనని చూస్తున్నాడు అనుకుంటుంది అరుంధతి. నేను మీకు కనిపిస్తున్నానా అంటుంది. కానీ ఆ మాటలు అతనికి వినిపించవు. ఇంతలో రామ్మూర్తికి అనాధాశ్రమం నుంచి ఫోన్ వస్తుంది మీ అమ్మాయికి సంబంధించిన ఏ విషయం తెలియలేదు అని చెప్తుంది.
మనోహరి : రామ్మూర్తి మాటలు వింటున్న మనోహరి అతని మాట్లాడిన మాటలు ఇప్పుడు అరుంధతి విన్నది అంటే వాళ్ళిద్దరూ తండ్రి కూతుర్లన్న సంగతి తెలిసిపోతుంది. ఆ మాటలు తను వినకూడదు అని కంగారు పడిపోతూ ఉంటుంది.
రామ్మూర్తి : నా కూతురి మొఖం నేను ఎప్పుడు చూడలేదు, ఇక మీదటైనా మీకు ఎలాంటి సమాచారం అందినా నాకు తెలియజేయండి అంటూ మీ అనాధాశ్రమంలో పనిచేసే సరస్వతి మేడంకి మా అమ్మాయి సంగతి తెలుసంట అంటాడు రామ్మూర్తి.
అరుంధతి: సరస్వతి మేడం అంటే మా వార్డెనే అని అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ఇంకొకసారి నా జోలికి రావద్దు, ఇదే రిపీట్ అయితే మాత్రం.. - బూతులతో అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)