Nindu Noorella Savasam December 2nd Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: భర్త దాచిన నిజాన్ని తెలుసుకున్న మంగళ - అరుంధతిని హెచ్చరిస్తున్న చిత్రగుప్తుడు!
Nindu Noorella Savasam Today Episode: నీ కుటుంబానికి నీవే ప్రమాదం అంటూ అరుంధతిని చిత్రగుప్తుడు హెచ్చరించడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Nindu Noorella saavasam Telugu Serial : ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో నేను వడ్డిస్తాను అంటూ మనోహరి రావటంతో నువ్వు వడ్డించడం ఏమిటి మిస్సమ్మ ఏది అని అడుగుతారు అమర్, అతని తండ్రి.
మనోహరి: ఇప్పటివరకు ఇక్కడే ఉంది.. బయటికి వెళ్లిందేమో అంటూ వడ్డీంచడం ప్రారంభిస్తుంది.
పిల్లలు: మేము వడ్డిస్తాం అంటూ రామ్మూర్తికి పిల్లలే భోజనం వడ్డీస్తారు. ఇవన్నీ మీకోసమే మిస్సమ్మ చేసింది అంటారు.
రామ్మూర్తి: ఇవన్నీ నాకు ఇష్టమైనవి.
అమర్ తల్లి : మీ ఇష్టాలు తెలియకుండా చేసాము నచ్చుతాయో లేదో అనుకున్నాము అంటుంది.
అమర్ తండ్రి: పిల్లలు మిమ్మల్ని తాతయ్య తాతయ్య అంటుంటే ఏమో అనుకున్నాను కానీ మీతో వాళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తండ్రి తరపున తాతని నేనైతే తల్లి తరుపున తాత మీరు ఇది ఫిక్స్.
రామ్మూర్తి : భోజనానికి పిలిచి బంధాన్ని బాధ్యతని ఇస్తున్నారు అంటూ బాగా ఎమోషనల్ అవుతాడు.
మరోవైపు రాథోడ్ అటువైపుగా వస్తుంటే అమర్ రూమ్ లోంచి సౌండ్ రావడం చూసి ఆ డోర్ ఓపెన్ చేస్తాడు. అందులోంచి మిస్సమ్మ రావటం చూసి నువ్విక్కడున్నావ్ ఏంటి అని అడుగుతాడు.
జరిగిందంతా చెప్తుంది మిస్సమ్మ.
రాథోడ్: నువ్వు లోపల ఉన్నావని చూసుకొని ఉండరు. అందరూ కింద ఉన్నారు పదా అనటంతో కిందికి పరిగెడుతుంది.
మరోవైపు భోజనం పూర్తయిన రామ్మూర్తి ఇంటికి బయలుదేరుతాను అనడంతో కారిచ్చి పంపిస్తాను అంటాడు అమర్.
రామ్మూర్తి: వద్దండి ఇల్లు పక్కనే కదా నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి పిల్లలకి సెండాఫ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు
అప్పుడే అక్కడికి వచ్చిన మిస్సమ్మని ఇప్పటివరకు ఏమైపోయావు ముందు వస్తే తాతయ్యని పరిచయం చేసేవాళ్ళం కదా అంటారు పిల్లలు. అతనిని చూడలేనందుకు ఫీలవుతుంది మిస్సమ్మ.
మరోవైపు మంగళ బట్టలు ఉతుకుతుంటే తన బట్టలు కూడా ఉతకమంటాడు ఆమె తమ్ముడు.
మంగళ: మీ బావ పనులు ఏమి చేయటం లేదని ఏడుస్తున్నాడు అతని షర్ట్లు రెండు తీసుకునిరా అనటంతో రామ్మూర్తి బట్టలు తీసుకురావడానికి వెళ్తాడు ఆమె తమ్ముడు.
బ్యాగ్ తో సహా వచ్చిన తమ్ముడిని చూసి ఏమిటి బ్యాగ్ అని అడుగుతుంది మంగళ.
మంగళ తమ్ముడు: ఇది బావ రోజూ డ్యూటీకి వెళ్ళినప్పుడు తీసుకెళ్లే బ్యాగ్.
మంగళ: అవునా అందులో ఏమున్నాయో బయటకు తీయు అంటుంది.
మంగళ తమ్ముడు బ్యాగులోంచి వాచ్మెన్ యూనిఫామ్ బయటికి తీస్తాడు.
మంగళ: అయితే మీ బావ వాచ్మెన్ గా పని చేస్తున్నట్లు ఉన్నాడు. రేపు ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసుకో అవసరమైతే వాడుకుందాం.
అప్పుడే వచ్చిన రామ్మూర్తితో బాగా భోజనం చేసినట్లు ఉన్నావు అంటుంది.
రామ్మూర్తి: నోటికి రుచిగా భోజనం చేసి చాలా రోజులైంది అందుకే కడుపునిండా తిన్నాను.
మంగళ : ఇంతకీ నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు
రామ్మూర్తి: ఎక్కడ పని చేస్తే ఎందుకు నెల అయ్యేసరికి నీకు డబ్బులు ఇస్తున్నాను కదా.
మంగళ: రేపొద్దున నీకు ఏమైనా అయితే పరిగెట్టుకొని రావాలి కదా అందుకే అడుగుతున్నాను.
రామ్మూర్తి: నోటికి మంచి మాటలు రావా అంటూ భార్యని తిట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు.
మరోవైపు రామ్మూర్తి పిల్లలతో కలిసి ఉండటం అరుంధతికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
చిత్రగుప్తుడు : ఏమిటి అలా ఆలోచిస్తున్నావు నీ చిన్న పిచ్చుకకి ఆరోగ్యం కుదుటపడిందా అంటాడు.
అరుంధతి: ఇంకా లేదు నీరసంగా ఉందని పడుకుంది. అయినా నేను అమావాస్య రోజు కనిపించకుండా పోవడం ఏమిటి, అలా అయితే పౌర్ణమి రోజు నాకు కొత్త శక్తులు వస్తాయా అని అడుగుతుంది.
చిత్రగుప్తుడు :వస్తాయో లేదో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఇక్కడ ఉండాలి కదా, ఘోరా అనే పెను ప్రమాదం నిన్ను వెంటాడుతుంది. అది నిన్ను పట్టి బంధించి చేయకూడని పనులన్నీ చేయిస్తుంది ఆ పాపం నీ కుటుంబానికి తగులుతుంది. అందుకే చెప్తున్నాను ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళటం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే అని అరుంధతిని హెచ్చరిస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply