Nindu Noorella Saavasam December 22nd Episode - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఆనందంలో కాళీ, చిత్రగుప్తుడిని నిజం చెప్పమంటూ నిలదీసిన అమర్!
Nindu Noorella Saavasam Today Episode: నువ్వు ఈ లోకంలో ఉంటే చాలా ప్రమాదం అని చిత్రగుప్తుడు అరుంధతిని హెచ్చరించడంతో కథలో కీలక మలుపులు ఏర్పడతాయి.
Nindu Noorella Saavasam Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో తనకి అతిగా సపర్యలు చేస్తున్న భార్యని, బావమరిదిని చూసి ఆశ్చర్యపోతాడు రామ్మూర్తి అసలు మీకు ఏం జరిగింది ఇవాళ అని అడుగుతాడు.
మంగళ: నువ్వు మా కోసం కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను అంటుంది.
రామ్మూర్తి: ఏమిటో మీ ప్రేమను కూడా భరించలేకపోతున్నాను అని స్కూల్ కి బయలుదేరుతాడు. కాళీని తోడు పంపిస్తాను అని మంగళ అంటే వద్దులే అని చెప్పి వెళ్ళిపోతాడు.
మంగళ : అంతా సిద్ధమే కదా తమ్ముడు నేను మనోహరి ని కలవటానికి వెళ్తాను నువ్వు మీ బావ సంగతి చూసుకో అంటుంది.
కాళీ: అంతా సిద్ధమే అక్క, బావ స్కూలుకు వెళ్లే టైంకి బావ మీద ఎటాక్ జరగడం ఖాయం అంటాడు.
సరే అని చెప్పి ఇద్దరూ ఇంట్లోంచి బయలుదేరుతారు. కాళీ రామ్మూర్తిని వెంబడిస్తూ ఉంటాడు.కొంచెం దూరం నడిచిన ఒక మహిళ కి ఫోన్ చేసి తర్వాత నీ ఎదురుగా వస్తున్న వ్యక్తిని నువ్వు కలవాల్సింది అని చెప్పటంతో ఆమె రామ్మూర్తికి ఎదురుగా వచ్చి బాగున్నారా అంకుల్ అని పలకరిస్తుంది. అయోమయంగా చూస్తున్న రామ్మూర్తితో నన్ను గుర్తుపట్టలేదా నేను భాగి ఫ్రెండ్ ని అంటుంది.
రామ్మూర్తి: క్షమించమ్మా నిన్ను గుర్తుపట్టలేకపోయాను ఎలా ఉన్నావు అని అడుగుతాడు.
మహిళ : బాగానే ఉన్నాను అంకుల్, భాగీ కి పిల్లలు ఎంతమంది తను ఎలా ఉంది అని అడుగుతుంది.
రామ్మూర్తి : భాగీకి ఇంకా పెళ్లి అవ్వలేదు అని విచారంగా చెప్తాడు.
మహిళ: అదేంటంకుల్ ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదా, జీవితంలో ఒక తోడు అవసరం కదా సరే భాగి పెళ్ళికి నన్ను పిలవడం మర్చిపోకండి అని తన కొడుకు ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ప్లాన్ సక్సెస్ అయిందని ఆనందపడతాడు కాళీ, అక్కకి చెప్పడానికి వెళ్తాడు.
మరోవైపు చిత్రగుప్తుడు అక్కడ ఉన్నట్లు నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని చెప్తాడు. రాథోడ్ నమ్మడు కానీ అమర్ తండ్రి చెప్పటంతో చిత్రగుప్తుడు చెప్పిన చోట తాళం వెతుకుతాడు అక్కడ తాళం ఉంటుంది. ఆ విషయం పరుగు పరుగున వెళ్లి నీల మనోహరి కి చెప్తుంది. మనోహరి పరుగు పరుగున వచ్చి రాథోడ్ దగ్గర తాళం తీసుకొని తనే డోర్ కీ ఓపెన్ చేస్తుంది.
బయటికి వచ్చిన మిస్సమ్మని పలకరించి రాత్రి నిద్రపోయి ఉండవు వెళ్లి రెస్ట్ తీసుకో పిల్లల్ని ఈ పూట మేం చూసుకుంటాం అని చెప్తారు అమర్ తల్లిదండ్రులు. అప్పుడే అక్కడికి వచ్చిన అమర్ ఈ తాళాలు ఎక్కడ దొరికాయి అని అడుగుతాడు.
రాథోడ్: తోట మాలి చెప్పాడు అని చెప్తాడు.
అమర్: మీరు ఇంటి బయట ఉంటారు కదా మీకు ఈ తాళాల సంగతి ఎలా తెలుసు అని చిత్రగుప్తుడిని నిలదీస్తాడు.
చిత్రగుప్తుడు: ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు ఒకసారి చూశాను అంటాడు.
అమర్: మీరు చేయవలసింది తోట పని కదా మీరు ఎందుకు ఇంటి పని చేశారు అని మందలిస్తాడు.
అమర్ తండ్రి: ఏదో అవసరానికి సాయం చేసే ఉంటాడు మరి ఎప్పుడు చేయడులే అని చెప్పి చిత్రగుప్తుడిని బయటికి పంపించేస్తాడు.
బయటికి వచ్చిన చిత్రగుప్తుడు అరుంధతి అంగుళీకము అడుగుతాడు. నా దగ్గర లేదు అంటుంది అరుంధతి.
చిత్రగుప్తుడు: నిన్ను నమ్మాను.
అరుంధతి: నమ్మిస్తేనే కదా మోసం చేయగలం అంటుంది.
చిత్రగుప్తుడు: దయచేసి అంగుళీకము ఇవ్వు, నాతోపాటు మా లోకానికి వచ్చేయు లేదంటే నీకు ఇక్కడ చాలా ప్రమాదం ఉంది నిన్ను అంతం చేయడానికి మూడు శక్తులు ఏకమవుతున్నాయి అని హెచ్చరిస్తాడు.
అరుంధతి: నన్ను భయపెట్టడానికి కదా అలా అంటున్నారు అని ఆషామాషీగా తీసుకుంటుంది అరుంధతి.
చిత్రగుప్తుడు : నీ పుట్టింటి వారు నీ అత్తింటి వారు నిన్ను ప్రమాదంలోకి నెట్టేయాలని చూస్తున్నారు ఈ సంగతి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని బాధపడతాడు.
ఆ తర్వాత అరుంధతి మిస్సమ్మ దగ్గరికి వెళ్లి గది తాళాలు పోయాయి అంట కదా అని అడుగుతుంది.
మిస్సమ్మ : మా ఇంట్లో విషయాలు మీకు బాగా తెలుస్తాయి అక్క అయినా మీ మీద చాలా కోపంగా ఉంది మనం ఇంత క్లోజ్ గా ఉంటాం కదా మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తుంటారు కదా అయినా ఎప్పుడూ మీ ఇంటికి నన్ను ఎందుకు పిలవలేదు అని అడుగుతుంది.
అరుంధతి: ఇప్పుడు నువ్వు ఉన్నది మా ఇంట్లోనే కదా అనటంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read - సలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?