‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆస్థికలు ఎక్కడకు పోలేదన్న యముడు – సీసీ టీవీ ఫుటేజీ చూసి షాకైన భాగీ, రాథోడ్
Nindu Noorella Saavasam Today Episode: ఆస్థికలు ఎవరు కొట్టేశారో సీసీటీవీలో చూస్తారు భాగీ, రాథోడ్. అందులో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఆస్థికలు నేను తీసుకురాలేదని ఘోర చెప్తాడు. అమర్ కు దొరికితే ఎలా ఉంటుందో నాకు తెలుసు మనోహరి అటువంటప్పుడు నేను ఎలా ఇంట్లోకి రాగలను అంటాడు ఘోర. మనోహరి మరింత షాక్ అవుతుంది. ఇక అంతా అయిపోయింది. ఆస్తికలు ఎవరు తీసి ఉంటారని అమర్ తీగ లాగితే నా డొంకంతా కదులుతుంది. అమర్‌కు నా నిజస్వరూపం తెలుస్తుంది అని బయపడతుంది మనోహరి. ఆ ఆస్తికలు కానీ దొరక్కపోతే మన ఇద్దరి ప్రయాణం చీకట్లోకే మనోహరి అంటాడు ఘోర. మరోవైపు గుప్త తన దివ్య దృష్టితో ఆస్తికలు ఎవరు తీశారో చూడాలని ప్రయత్నిస్తాడు కానీ దివ్య దృష్టి పని చేయదు.
గుప్త: ఎందుకు ప్రభు నన్ను ఇక్కట్లు పెట్టి ఉంటివి
యముడు: గుప్తా.. ఏమైంది..
గుప్త: ఏమో ప్రభు అంతా గందరగోళంగా ఉంది. నా దివ్య దృష్టి కూడా పని చేయడం లేదు
యముడు: నువ్వు ఆ బాలికకు చేసిన సాయం వల్లే ఈ శిక్ష.. అయినా ఇది తాత్కాలికమే గుప్త.
గుప్త: అయితే ఆ ఆస్తికలు ఎవరు తీసుకెళ్లారు ప్రభు ఆ ఘోర తీసుకెళ్లాడేమోనని భయంగా ఉంది.
యముడు: ఆస్తికలు ఇల్లు దాటి వెళ్లలేదు. ఇంటిలోనే ఉన్నాయి గుప్త.
అని యముడు చెప్తుండగానే ఆరు వస్తుంది. ఆరును చూసిన యముడు మాయం అయిపోతాడు. గుప్తగారు. నా ఆస్తికలు ఎవరో తీసుకెళ్లారో మీ మాయా పేటికను తెరచి చూడండి. నా బాధలో నేను ఉంటే మధ్యలో వచ్చి చెడగొట్టావు బాలిక. ఆస్తికలు ఎక్కడకు పోలేదు. ఇంట్లోనే ఉన్నాయట ప్రభువుల వారు తెలిపారు అని చెప్తాడు గుప్త. బయటకు వెళ్లిన రాథోడ్ కోసం భాగీ ఎదురు చూస్తుంది. ఇంతలో రాథోడ్ రాగానే ఆస్తికలు మనోహరి కొట్టేస్తుంది. అది రికార్డు కావడానికి కెమెరా పెట్టమంటే ఏకంగా ఆస్తికలను నువ్వే కొట్టేస్తే ఎలా రాథోడ్ అని అడుగుతుంది భాగీ. రాథోడ్ తాను తీయలేదని చెప్తాడు. అనుమానం వచ్చి ఇద్దరూ కలిసి సీసీటీవీ ఫుటేజీ చెక్ చేస్తారు. అందులో అంజు ఆస్తికలు కొట్టేయడం చూసి షాక్ అవుతారు. ఆరు ఆస్తికలు తీసుకుని రూంలో ఏడుస్తూ కూర్చుని ఉంటుంది అంజు. అమ్మా అని గట్టిగా పిలవగానే గార్డెన్‌లో ఉన్న ఆరు పరుగెత్తుకుని అంజు దగ్గరకు వెళ్తుంది. ఇంతలో అమ్ము, ఆనంద్, ఆకాష్ వస్తారు. వాళ్లను చూసి ఆస్తికలు దాచిపెడుతుంది అంజు.
ఆకాష్: ఏం దాస్తున్నావు అంజు..
అంజు ఆస్థికలు తీసి చూపిస్తుంది. పిల్లలు ముగ్గురు షాక్ అవుతారు.
అమ్ము: నాన్నా కనిపించకుండా పోయాయి అన్న ఆస్థికలు నీ దగ్గరకు ఎలా వచ్చాయి.
అంజు: నైట్ అందరూ పడుకున్నాక నేనే అమ్మ ఆస్తికలు తీసుకొచ్చాను
ఆనంద్: ఆస్తికలు తీసింది నువ్వే అని తెలిస్తే డాడ్ ఎంత కోప్పడతారో తెలుసా..? పద డాడీకి ఇచ్చేద్దాం.
అంజు: నేను ఎవ్వరికీ ఇవ్వను అమ్మ ఆస్తికలు నాతో ఉంటే అమ్మ నాతో ఉంటుంది.
అంటూ అంజు ఎమోషనల్ అవుతుంది. అయితే అమ్ము, ఆకాష్, ఆనంద్ ముగ్గురు కలిసి ఆస్తికలు అమర్‌కు ఇవ్వమని ఎంత చెప్పినా అంజు వినదు. చివరకు అమ్ము బలవంతంగా లాక్కుంటుంటే ఆస్తికలు చేజారి కిందపడబోతాయి. ఇంతలో అమర్ వచ్చి ఆస్తికలు పట్టుకుంటాడు. అమర్‌ను చూసిన పిల్లలు భయపడుతుంటారు. అంజు గజగజ వణికిపోతుంది. అమర్ మాత్రం చాలా కూల్‌గా ఆస్తికలు కావాలా తీసుకో అంటూ అంజు చేతికి ఇస్తాడు. అమ్మను దూరం చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని అమర్ ఎమోషనల్ అవుతుంది. పక్కనే ఉన్న ఆరు ఏడుస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!