Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: నిజం తెలుసుకున్న గుప్త – అయోమయంలో భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode September 23rd: ఆరు రూంలోకి వెళ్లిన భాగీ అక్కడి ఆరు ఫోటో చూసి షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి పిచ్చిపట్టినట్టుగా తన రూంలోకి వెళ్లి ఏడుస్తూ రూంలో వస్తువులు మొత్తం చిందరవందరగా చేస్తుంది. కోపంతో చూస్తూ.. భాగీ, అమర్ హగ్ చేసుకోవడాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇక హాస్టల్ ఉన్న సరస్వతి దగ్గరకు రాజు వస్తాడు.
రాజు: ఏంటి మేడం ఇది నేను సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. మిమ్మల్ని తప్పించాను కాబట్టి ఏం కాలేదు లేదంటే ఆ మనోహరి మిమ్మల్ని చంపేసేది.
సరస్వతి: నేను చావుకు సిద్దపడే అక్కడికి వెళ్లాను రాజు గారు కానీ నేను అమరేంద్ర గారికి భాగీ గారికి నిజం చెప్పలేకపోయాను.
రాజు: మీరు అన్ని సార్లు ప్రయత్నించినా నిజం చెప్పలేకపోయారు అంటే ఇక సాధ్యం కాదు మేడం వదిలేయండి.
సరస్వతి: వదిలేస్తే ఎలా రాజుగారు వాళ్లకు నిజం తెలియాలి కదా..? ఆ రాక్షసి ఆ పిశాచి గురించి అది చేసిన దారుణాల గురించి పాపాల గురించి నేను చెప్పాలి కదా రాజు గారు
రాజు: మిమ్మల్ని నమ్ముకుని ఇంత మంది అనాథ పిల్లలు బతుకుతున్నారు మేడం మీకు ఏదైనా అయితే ఈ ఆశ్రమం గతి ఏం కావాలి..
సరస్వతి: ఈ ఆశ్రమం ఈ పిల్లలు మనము సంతోషంగా ఉన్నామంటే అందుకు కారణం ఆ కుటుంబమే రాజు గారు.. ఆ మంచి మనుషులు చేసిన సాయం వల్లే ఇక్కడ అందరం ఆనందంగా ఉన్నాము నందనవనం లాంటి ఆ ఇంట్లోకి ఒక చీడ పురుగు చేరింది. అమాయకంగా నమ్మిన అరుంధతిని పొట్టన పెట్టుకుంది. అభం శుభం తెలియని ఆ పసిపాప ప్రాణాలు తీయాలనుకుంది. ఆ దెయ్యం అక్కడే ఉంటే ఇంకెందరిని బలి తీసుకుంటుందో నాకు ఏమైనా అయితే ఈ ఆశ్రమాన్ని చూసుకోవడానికి మీరు ఉన్నారు రాజు గారు. కానీ ఆ కుటుంబానికి ఏమైనా అయితే ఇలాంటి ఆశ్రమాలకు ఆశ్రయమే లేకుండా పోతుంది. అందుకే నా ప్రాణం పోయినా సరే వాళ్లకు నిజం చెప్తాను..
రాజు: సరే మేడం మీరు ఇక్కడే ఉండండి.. నేను ఆ ఇంటికి వెళ్లి అమరేంద్ర గారినో భాగీ మేడం గారినో ఇక్కడికి తీసుకొస్తాను
సరస్వతి: వాళ్లను ఇక్కడికి తీసుకొస్తారా..? బాగోదేమో రాజు గారు
రాజు: మీరు బయటకు వెళితే ప్రమాదం మేడం.. అంతే కాకుండా ఈ ఆశ్రమంలో పెరిగిన ఆ మనోహరి గురించి ఆ ఒక్కరికి నిజం తెలియడం మంచిది ఒప్పుకోండి మేడం…
సరస్వతి: సరే రాజు గారు జాగ్రత్త మీరు నా మనిషని ఆ మనోహరికి తెలుసు మీరు తన కంట పడకుండా జగ్రత్తగా వెళ్లి రండి.
అంటూ చెప్పగానే రాజు వెళ్తాడు. సరస్వతి ఆలోచిస్తుంది. ఇక యముడు వచ్చి గుప్తను హెచ్చరిస్తాడు.
యముడు: విచిత్రగుప్త..
గుప్త: ప్రభువులకు ప్రణామములు..
యముడు: గుప్త త్వరలోనే ఒక విపత్తు జరగబోతుంది. త్వరగా ఆ బాలికను తీసుకుని నువ్వు మన లోకానికి రమ్ము
గుప్త: విపత్తా ఏంటి ప్రభు ఆ విపత్తు..
అని గుప్త అడుగుతుండగానే యముడు వెళ్లిపోతాడు.
గుప్త: ప్రభువుల వారు త్వరలోనే పెను ప్రమాదం జరగబోతుంది అన్నారు. ఆ ప్రమాదం ఏమై ఉండొచ్చు.. ప్రభువుల వారే చెప్పారంటే అదేదో పెద్ద విపత్తే అయి ఉంటుంది.
అనుకుని మంత్రం వేసి మాయా దర్పణం తెప్పించుకుని అందులో చూస్తాడు. భాగీ ఆరు రూంలోకి వెళ్లి ఆరు ఫోటో చూసి షాక్ అవ్వడం కనిపిస్తుంది. దీంతో గుప్త కూడా ఆలోచనలో పడిపోతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















