అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును చూసి మౌనంగా వెళ్లిన భాగీ – ఎమోషనల్‌ అయిన ఆరు  

Nindu Noorella Saavasam serial Today Episode October 7th: ఇంటికి వచ్చిన భాగీ గార్డెన్‌లో ఆరును చూసి కూడా పలకకుండా వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  అంజు మనోహరిని అమ్మా అంటూ పిలుస్తాను అనడంతో మనోహరిలో అమ్మతనం గుర్తుకు వస్తుంది. దీంతో తాను వదిలేసిన దుర్గను గుర్తు చేసుకుంటుంది. వెంటనే రణవీర్‌కు కాల్ చేస్తుంది.

రణవీర్‌: చెప్పు మనోహరి

మను: మన పాప విషయం ఎంత వరకు వచ్చింది. దానిని వెతికే ప్రయత్నం చేస్తున్నావా..? లేదా..?

రణవీర్‌: ఏంటి సడెన్‌ గా నీకు దుర్గ గుర్తుకు వచ్చింది

మను: ఏం లేదు అది ఎలా ఉందో చూడాలనిపిస్తుంది.

రణవీర్‌: చూడాలని ఉందా..? లేక నీ చేతులతో వదిలేసిన దుర్గ మీద కొత్తగా ప్రేమ పుట్టుకొస్తుందా..?

మను: దాని మీద నాకు ప్రేమేంటి..? నాన్‌సెన్స్‌..

రణవీర్‌: అయితే ఇప్పుడు దుర్గ గురించి ఎందుకు అడుగుతున్నావు

మను: చెప్పాను కదా అది ఎలా ఉందో ఒక్కసారి చూడాలనుకున్నాను.

రణవీర్‌: చూసి ఏం చేస్తావు చూసి సారీ చెప్తావా..? తిరిగి దగ్గరకు తీసుకుంటావా..? అన్ని వదిలేసి తన అమ్మగా సెటిల్‌ అయిపోతావా..? నీ మనసులో ఏముంది..?

మను: ఏం లేదు జస్ట్‌ తెలుసుకుందామని అడిగాను అంతే.. పాపను వెతికే ప్రాసెస్‌ పాస్ట్ చేయ్‌

రణవీర్‌: నేను ఎంత వెతికినా ఏం లాభం. అమరేంద్ర దుర్గ గురించి తెలిసినా కూడా చెప్పడం లేదు కదా..?

మను: అమర్‌కు నీ గురించి తెలిసినా కూడా నిన్ను ఏమీ చేయడం లేదు కదా

రణవీర్‌: నాకెందుకో ఈ రెండింటికీ కనెక్షన్‌ ఉందేమో అనిపిస్తుంది. అమరేంద్రకు దుర్గ గురించి తెలిసినా చెప్పడం లేదు. నా గురించి తెలిసినా ఏమీ అనడం లేదు.. ఏమంటావు

మను: ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు పాపను వెతకడం స్పీడప్‌ చేయ్‌

అంటూ చెప్పి ఫోన్‌ పెట్టేస్తుంది. తర్వాత లాన్‌లో నిలబడి భాగీ కోసం ఎదురుచూస్తుంది ఆరు. గుప్త చూసి నవ్వుకుంటాడు.

గుప్త: నువ్వు ఎన్నిమార్లు చూసిననూ రావాల్సిన వారు రావాల్సిన సమయమునకే వచ్చెదరు బాలిక. నువ్వు ఎదరుచూస్తున్నావని ముందుగా రారు.. నువ్వు చూడటం లేదని ఆలస్యంగా రారు

ఆరు: మీకు అసలు మనస్సాక్షి ఉందా గుప్త గారు..నా బాధ ఆవేదన మీకు అర్థం అవుతుందా

గుప్త: అవగతం చేసుకుని మేము ఏమి చేయగలం బాలిక.. ఎప్పుడు ఏది జరగవలయునో అదే జరుగును

ఆరు: మీకు అన్న అక్క అమ్మ భార్య లాంటి బంధాలే లేవా..?

గుప్త: ఎందులకు లేవు.. మేము కూడా మీ వలే గృహస్థులమే.. మాకు కూడా అన్ని బంధములు ఉన్నవి.. కాకుంటే మీకు మరణం ఉన్నది.. మేము మాత్రం అమరులం

ఆరు: అందుకే మీకు నా బాధ అర్థం కావడం లేదు. అందరూ ఉంటారు ఎప్పటికీ ఉంటారు. కానీ నేను నా వాళ్లకు లేకుండా పోయాను.

ఇంతలో అమర్‌ కారు వస్తుంది.

గుప్త: నీ సహోదరి వచ్చింది బాలిక

కారు లోపలికి వచ్చి ఆగుతుంది. భాగీ దిగకుండా అలాగే ఉంటుంది.

అమర్‌: భాగీ ఇల్లు వచ్చింది.. దిగు భాగీ

అంటూ భాగీని చేయి పట్టుకుని కారు దింపి.. లోపలికి తీసుకెళ్తాడు. ఆరు చూసి హాయ్‌ అన్నా బాగీ పలకకుండా వెళ్లిపోతుంది.

ఆరు: ఏంటి గుప్త గారు నేను సొంత అక్కను అని తెలిసినా కూడా బాగీలో ఎలాంటి రియాక్షన్‌ కూడా లేదు. నన్ను చూసి కూడా నాతో మాట్లాడకుండా వెల్లిపోయింది. ఎందుకు నవ్వుతున్నారు గుప్త గారు

గుప్త: నీకు నీ సహోదరి ముఖంలో కోపము కనిపించింది కానీ మనసులో ఉన్న బాధ తెలియడం లేదు కదూ.. తను ఆగ్రహంతో వెళ్లడం లేదు బాలిక. నీ కొరకై బరువెక్కిన గుండెతో భారం అయిన మనసుతో వెళ్లుచున్నది. పక్కన నీ పతిదేవుడు లేనిచో ఇప్పుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుని మనసారా ఏడ్చేది. తన గుండెల్లో గూడు కట్టుకున్న బాధ కరిగే వరకు కన్నీరు మున్నీరు అయ్యేది.

ఆరు: నాకు నా చెల్లిని పట్టుకుని ఏడ్వాలని ఉంది. తనను ఓదార్చాలనిపిస్తుంది. ఇన్నాళ్లు తన దగ్గర ఈ నిజం దాచినందుకు క్షమాపణ చెప్పాలని ఉంది

అని ఆరు ఏడుస్తుంది. దీంతో గుప్త ఆ సమయం వస్తుందిలే బాలిక అని చెప్పడంతో ఆరు షాక్‌ అవుతుది. అంటే నేను మళ్లీ బతుకుతానా..? గుప్త గారు అని అడుగుతుంది. గుప్త షాకింగ్‌ గా చూస్తుంటాడు.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 21th: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
జగద్ధాత్రి సీరియల్: యువరాజుపై చేయిచేసుకున్న నిషిక...భార్య చెంప పగులగొట్టిన యువరాజు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సొంత ఇంటికి చేరుకున్న క్రిష్! అక్కతో ఆటలు.. నానమ్మ గోరుముద్దలు!
Godavari Serial Today July 21st: 'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
Nindu Manasulu Serial Today July 21st: నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget