అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంత్రించిన పొడిని అక్షింతల్లో కలిపిన మను – అంజు ను అక్షింతలు వేసి దీవించిన ఆరు

Nindu Noorella Saavasam Today Episode:   ఘోర ఇచ్చిన పొడిని మనోహరి అక్షింతల్లో కలుపుతుంది. అంజును తాను కూడా దీవించాలని వెళ్లి అక్షింతలు ఆరు తీసుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు క్యూట్‌గా రెడీ అయి వస్తుంది. అందరూ షాక్ అవుతారు. అంజును చాలా బాగా రెడీ  చేశావని భాగీని మెచ్చుకుంటారు. దీంతో అంజు అందరినీ తిడుతుంది. నేను అందంగా ఉన్నాను కాబట్టే కనిపిస్తున్నాను అంటుంది. ఇంతలో నిర్మల వచ్చి దుర్గామాత డాలర్‌ ఉన్న గోల్డ్‌ చైన్‌ ను అంజు మెడలో వేయమని భాగీకి ఇస్తుంది. సరేనని భాగీ చెప్తుంది. మరోవైపు కింద ఘోర ఇచ్చిన పొడిని ఎక్కడ పెట్టాలా? అని మనోహరి ఆలోచిస్తుంది. ఆరు కూడా తాను తయారు చేసిన గిఫ్ట్‌ ఎక్కడ పెట్టాలా అని చూస్తుంది. ఇంతలో పై నుంచి అంజును తీసుకుని భాగీ, పిల్లలు, కరుణ వస్తారు.

అమర్‌: మెనీ మెనీ రిటర్న్‌ ఆఫ్‌ ది డే..

అంజు: ఈ డ్రెస్‌ చాలా బాగుంది డాడ్‌.

అమర్‌: నీకు నచ్చిందా?

అంజు: చాలా నచ్చింది.

రణవీర్‌: హ్యాపీ బర్తుడే అంజు పాప

అంజు: థాంక్యూ అంకుల్‌ కానీ గిఫ్ట్‌ ఇప్పుడే ఇవ్వకూడదు. కేక్‌ కట్‌ చేసిన తర్వాత ఇవ్వాలి.

నిర్మల: అంజు పాప దేవుడికి దండం పెట్టుకుని వద్దువు రా.. రండి అందరూ రండి.

భాగీ: అత్తయ్యా ఇలా ఇవ్వండి. అంజు నాన్న దగ్గర అశీర్వాదం తీసుకో..

శివరాం: నాన్న దగ్గరే కాదమ్మా.. నాన్న దగ్గర, మిస్సమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో..

అమర్‌: అంజు రాథోడ్‌ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో..

రాథోడ్‌: నేనెందుకులే సార్‌..

అమ్ము: మామయ్యా మామయ్యా అంటావు కదా రాథోడ్‌ కమాన్‌ అంజు రా..

రాథోడ్‌: ఎప్పటిలాగా సున్నాలు కాకుండా సున్నాల పక్కన ఒక్కటి వచ్చేలా తెచ్చుకో..

శివరాం: అంజు… రణవీర్‌, మనోహరి దగ్గర ఆశీర్వాదం తీసుకో..

అంజు: ఇన్ని సార్లు బెండు అవ్వడం నా వల్ల కాదు.. నా వల్ల కాదు కానీ మీరిద్దరూ ఒక్కదగ్గరికి రండి

అంటూ రణవీర్‌, మనోహరిని దగ్గరకు చేర్చి ఆశీర్వాదం తీసుకుంటుంది.

ఆరు: నీ సమక్షంలోనే అందరినీ ఒక్క దగ్గరికీ తీసుకొచ్చావా? స్వామి. ప్రేమ లేని తండ్రి, స్వార్థంతో నిండిన తండ్రి. ఇదేనా నువ్వు అంజుకు రాసిన తలరాత

అంటూ ఆరు బాధపడుతుంది.  ఐదు నిమిషాల్లో అన్ని రెడీ చేస్తాను. రాథోడ్ పిల్లల్ని నువ్వే చూసుకోవాలి అని అక్షింతలు దేవుడి రూంలో పెట్టి వెళ్లిపోతుంది. అక్షింతలు చూసిన మనోహరి ఘోర ఇచ్చిన పొడిని అక్షింతల్లో కలపాలని వెళ్లి కలుపుతుంది. ఆరు దేవుడి రూంలోకి రాలేదని ఎందుకైనా మంచిది బయట పెడదామని తీసుకొచ్చి బయట టేబుల్‌ మీద పెట్టి వెళ్లిపోతుంది. మరోవైపు ఆరును గుప్త పిలుస్తాడు.

ఆరు: ఏంటి గుప్త గారు..?

గుప్త: బహుమతి ఇచ్చి వెను వెంటనే వచ్చేదని చెప్తివి.. అది చేయడం లేదు.

ఆరు: జస్ట్‌ అక్షింతలు తీసుకుని నా కూతురిని ఆశీర్వదించి వచ్చేస్తాను.

గుప్త: ఇటువంటివే చేయరాదని చెప్పితిని. నా మాట వినుము. ఆ ఘోర నీకోసం ఎచ్చట ఉచ్చు పెట్టెనె తెలియడం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండవలెను.

ఆరు: దేవుడి ముందు ఉన్న అక్షింతలు ఏం చేయగలరు గుప్తగారు. ఒకవేళ ఏమైనా చేసినా కూడా ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఏం కాదు.

 అంటూ ఆరు వెళ్లిపోతుంది. మనోహరి దూరంగా వచ్చి అక్షింతల వైపే చూస్తుంది. ఇంతలో ఆరు వెళ్లి అక్షింతలు ఉన్న పల్లెం తీసుకోవడం చూసి హ్యాపీగా ఘోర రూంలోకి వెళ్తుంది.

మనోహరి: ఘోర బంధించేశావా? చెప్పు ఘోర బంధించేశావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎవ్వరి కంట పడకుండా వెళ్లిపో.. కావాలంటే నేనే పూజ దగ్గరకు వస్తాను. ఏంటి ఘోర ఇంకా అలాగే ఉన్నావు.

ఘోర: ఎక్కడికి వెళ్లేది. ఆ ఆత్మను బందించలేదు.

మనోహరి: బంధించలేదా? ఏం మాట్లాడుతున్నావు ఘోర బంధించలేదా? అంటే నీ మంత్రం పని చేయలేదా? అంటే దాన్ని ఎప్పటికీ బంధించలేమా?

ఘోర: లేదు అలా జరిగే అవకాశమే లేదు. అసలు పొడిని దేని మీద వేశావు.

మనోహరి: అక్షింతల్లో వేశాను.

ఘోర: దేవుడికి వాడే పవిత్రమైన పసుపులో మన పొడిని కలిపితే అసలు ఎలా పనిచేస్తుంది అనుకున్నావు.

అని ఘోర చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది. కింద కూలబడిపోతుంది. మరోవైపు అక్షింతలు తీసుకుని ఆరు, అంజు దగ్గరకు వెళ్లి ఆశీర్వదిస్తుంది. తనపై అక్షింతలు పడటంతో అంజు భయపడుతుంది. ఎవ్వరూ లేకుండా తనపై అక్షింతలు పడ్డాయని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  ఇంతలో అక్కడికి వచ్చిన భాగీ ఆరును చూసి పలకరిస్తుంది. మీరొచ్చి ఎంతసేపు అయింది అని అడుగుతుంది. తర్వాత మీరు వెళ్లి పార్టీలో జాయిన్‌ అవ్వండి నేను వస్తాను అని చెప్పి భాగీ లోపలికి వెళ్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ:  ‘మేఘసందేశం’ సీరియల్‌: శారదకు గుండు కొట్టించబోయిన అపూర్వ-  ఇందును గుడికి

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget