Nindu Noorella Saavasam Serial Today November 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: రణవీర్‌ను కాపాడబోయిన చంభా – అనుమానంతో ఇంట్లోంచి బయటకు వచ్చిన అమర్
Nindu Noorella Saavasam serial Today Episode November 26th: కారు డిక్కీలో ఉన్న రణవీర్‌ను బయటకు తీసేందుకు చంభా ప్రయత్నిస్తుంటే అప్పుడే అమర్ వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ చేస్తున్న పని చూసి డాక్టర్ నవ్వుకుంటుంది. ఇంకా పుట్టని బేబీ ఎలా మాట్లాడుతుందని ప్రశ్నిస్తుంది. మీరేదే భ్రమలో ఉన్నారని అంటుంది. దీంతో భాగీ భ్రమ కాదు డాక్టర్ నిజమే అని చెప్తుంది.
భాగీ: అదెలా సాధ్యం.. బేబీ పుట్టాక టూ ఇయర్స్‌కు మాటలు వస్తాయి. ఇదే సైన్స్ చెబుతుంది.
భాగీ: అయితే ఆ సైన్స్‌ను కూడా దైవ శక్తి చాలా సార్లు ఆశ్చర్యపరిచింది డాక్టర్. ఆ దైవ శక్తినే మీ భాషలో మెడికల్ మిరాకిల్ అంటారు. ఇంకొంత మంది దానినే మ్యాజిక్ అంటారు.. ఎవరు ఏ పేరుతో పిలిచినా..? అది సైన్స్‌కు అందని దైవశక్తి
డాక్టర్: ఇవేవీ నేను నమ్మను అయినా మీ మాటలు నమ్మశక్యంగా లేవు
భాగీ: అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి వినలేదా..? ఆంజనేయుడు ఒక్క అడుగులో అంత పెద్ద సముద్రాన్ని దాటలేదా..? శ్రీకృష్ణుడి కోసం యమునా నది దారి ఇవ్వలేదా..
డాక్టర్: అవన్నీ పురాణాలు అండి
భాగీ: కాదు డాక్టర్ అవన్నీ హిస్టరీలాగా చూడండి అప్పుడే మీకు అద్బుతంగా అర్థం అవుతాయి.
అంజు: డాక్టర్ మళ్లీ ఒకసారి స్టెతస్ స్కోప్ ఇవ్వండి
అంటూ తీసుకుని తన చెవ్వుల్లో పెట్టుకుని మిస్సమ్మ పొట్ట మీద పెట్టి బీబీ వాయిస్ వింటుంది.
బేబీ: అంజు… అమ్మ జాగ్రత్త.. అమ్మని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి.. నువ్వు నా అక్కవి.. అమ్మకు ధైర్యంగా తోడుగా ఉండు
అని చెప్తుంటే.. అంజు నవ్వుతుంది. నా చెల్లి నాతో మాట్లాడింది అంటూ చెప్తుంటే డాక్టర్ ఆశ్చర్యంగా చూస్తుంది. మరోవైపు రణవీర్‌ను తీసుకుని ఇంటికి వచ్చిన మనోహరి ఇంట్లోంచి డాక్టర్ వెళ్లడం చూసి గేటు బయటే ఆగిపోతుంది.
రణవీర్: ఏంటి మనోహరి కారు ఇక్కడే ఆపేశావు
మనోహరి: భాగీని చూడ్డానికి డాక్టర్ వచ్చినట్టు ఉంది. తను వెళ్లిపోయాక వెళ్దాం
అంటుంది మనోహరి. ఇంతలో డాక్టర్ కారు వెళ్లిపోతుంది. మనోహరి కారు లోపలికి వెళ్తుంది. మనోహరి మెల్లగా కారు దిగి అటూ ఇటూ చూసి ఎవ్వరూ చూడటం లేదు రణవీర్ త్వరగా కారు దిగి లోపలికి వెళ్దాం పద అంటుంది. రణవీర్ కారు దిగగానే లోపలి నుంచి పిల్లుల వస్తారు. వాళ్లను చూసిన రణవీర్ కారు వెనక్కి వెళ్లి డిక్కీలో దాక్కుంటాడు. పిల్లలు దగ్గరకు వస్తారు.
అమ్ము: ఇంత సేపు ఎక్కడికి వెళ్లావు యాదమ్మ.. నువ్వు మిస్సమ్మ పక్కనే ఉండాలని డాడీ చెప్పారు కదా
మనోహరి: అమ్ము, యాదమ్మను నేనే తీసుకెళ్లాను
ఆనంద్: డాడీ.. యాదమ్మను మిస్సమ్మ పనులు మాత్రమే చేయాలని మీ పనులు చేయకూడదని డాడీ మీకు చెప్పారు కదా ఆంటీ
మనోహరి: నేను యాదమ్మను తీసుకెళ్లింది కూడా మిస్సమ్మ పని మీదే రేపు ఊరికి వెళ్తున్నారు కదా మిస్సమ్మకు ఏమేం కావాలో అవన్నీ తీసుకురావడానికి తీసుకెళ్లాను.
ఆకాష్: అవన్నీ తాతయ్య, నాన్న తీసుకొస్తారు కదా మీరెందుకు వెళ్లారు..?
చంభా: అంటే బాబు నాకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను
మనోహరి: అవును మిస్సమ్మతో పాటు యాదమ్మ కూడా మీతో రావాలి కదా.. మీరు లోపలికి వెళ్లండి ఆ సామాన్లనీ నేను తీసుకొస్తాను.
అని చెప్పగానే పిల్లలు లోపలికి వెళ్లిపోతారు. డిక్కీలో ఉన్న రణవీర్ బయటకు రాబోతుంటే బయటి నుంచి అప్పుడే అమర్ వస్తాడు. భయంతో రణవీర్ డిక్కీలోనే ఉండిపోతాడు. అమర్‌ను చూసి మనోహరి, చంభా లోపలికి వెళ్లిపోతారు. తర్వాత మనోహరి, చంభాను తీసుకుని వచ్చి రణవీర్‌ను బయటకు పిలుస్తుంటే.. కారు ఇండికేటర్స్ మోగడంతో లోపలి నుంచి అమర్ వస్తాడు. వచ్చి డిక్కీ తెరువబోతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















