Nindu Noorella Saavasam Serial Today November 26th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్, భాగీని డిస్టర్బ్ చేసిన మనోహరి – కరుణ మాటలతో అమర్‌లో మార్పు
Nindu Noorella Saavasam Today Episode: భాగీకి సాంబ్రాణి వేస్తున్న అమర్‌ను డిస్టర్బ్ చేయాలనుకుంటుంది మనోహరి దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Nindu Noorella Saavasam Serial Today November 26th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్, భాగీని డిస్టర్బ్ చేసిన మనోహరి – కరుణ మాటలతో అమర్‌లో మార్పు nindu Noorella Saavasam serial today episode November 26th written update Nindu Noorella Saavasam Serial Today November 26th:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమర్, భాగీని డిస్టర్బ్ చేసిన మనోహరి – కరుణ మాటలతో అమర్‌లో మార్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/26/580b172b76558e56f0adb4169bdccbcb1732585177030879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ రూంలోంచి పొగ వస్తుందని అందరూ అక్కడే ఉంటారు. ఇంతలో రాథోడ్ వచ్చి ఆఫీసుకు టైం అవుతుంది మా సార్ ఇంకా రెడీ కాలేదా? అని అడుగుతాడు. మీ సార్ నీతో పాటు బయటకు రాలేదా..? అని శివరాం అడగ్గానే లేదని రాథోడ్ చెప్తాడు. లోపల ఉన్న భాగీ ఏవండి రాథోడ్ కూడా వచ్చాడు ఏదైనా చేయండి అని చెప్తుంది. అమర్ టవల్ తీసుకుని భుజం మీద వేసుకుంటాడు. మనోహరి డోర్ కొడుతుంది. అమర్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు.
అమర్: ఏంటి ఎందుకు డోర్ కొడుతున్నారు. అందరూ ఇక్కడ ఉన్నారేంటి..?
మనోహరి: ఏంటిది అమర్ అసలు లోపల ఏం జరుగుతుంది.
అమర్: ఏముంది. మిస్సమ్మ సాంబ్రాణి వేసుకుంటుంది. నేను స్నానానికి వెళ్లాను.
మనోహరి: అది కాదు అమర్..
శివరాం: ఏంటమ్మా ఇది కాదు అది కాదు అంటున్నావు భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకుంటారు. దానికే ఇంత హడావిడి చేస్తే ఎలా..?
మనోహరి: అంటే పొగను చూసి అంతా భయపడుతుంటే..
నిర్మల: మనోహరి, మిస్సమ్మ చెప్పింది కదా..? సాంబ్రాణి వేసుకుంటున్నాను అని అయినా అందరం వచ్చి తప్పు చేశాము. వెళ్దాం పదండి.
అంటూ అందరినీ తీసుకుని నిర్మల అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మిస్సమ్మ, మనోహరికి సైగల ద్వారా సాంబ్రాణి పొగ ఆయనే వేశారని చెప్తుంది. మనోహరి ఇరిటేటింగ్ వెళ్తుంది. గార్డెన్ లో ఆరు అటూ ఇటూ తిరుగుతూ అమర్ సాంబ్రాణి వేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. గుప్త నవ్వుతూ..
గుప్త: బాలిక లోపల వీక్షించినది నువ్వు జీర్ణించుకోలేక ఇలా అటూ ఇటూ తిరుగుతుంటివా..? అసలు నీ భాద ఏంటి బాలిక.. ఆ బాలికకు నువ్వే దగ్గరుండి నీ పతి దేవుణితో పెళ్లి చేసితివి. అసలు ఆ బాలిక నీ పతి దేవుణికి భార్యగా ఉండకూడదా..?
ఆరు: ఉండాలి.. ఉండ కూడదు..
గుప్త: ఎందుకు నీకు ఆంత బాధ నీ పతి దేవుణితో ఉన్నది నీ తోబుట్టువే కదా..?
అంటూ గుప్త నోరు జారగానే ఆరు షాకింగ్ గా ఏంటి గుప్త గారు ఏమన్నారు అని అడుగుతుంది. అంటే నీ పతి దేవుణికి భార్య అయినప్పుడు నీ తోబుట్టువు లాంటిదే కదా? అంటాడు గుప్త. దీంతో ఆరు ఆలోచనలో పడిపోతుంది. మరోవైపు పిల్లలు మీటింగ్ పెట్టుకుని తాము అనుకున్నదే జరిగిందని హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో అంజు అందరినీ తిడుతూ అసలు నాన్న మిస్సమ్మకు సాంబ్రాణి వేయడం ఏంటి..? అంటూ తిడుతుంది. మిస్సమ్మ మన అమ్మ స్థానాన్ని లాక్కోవాలని చూస్తుంది అంటుంది. మరోవైపు శివరాం, నిర్మల కూడా హ్యాపీగా ఫీలవుతారు. అమర్, ఆరును దాటి ముందుకు పోలేడేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త జీవితం వైపు వెళ్తున్నాడు అనుకుంటారు. మరోవైపు మనోహరి కోపంగా అటూ ఇటూ తిరుగుతూ.. మిస్సమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో అక్కడికి మిస్సమ్మ వస్తుంది.
Also Read: పింక్ శారీలో Mega Kodalu లావణ్య... రాయల్ ప్రిన్సెస్ అన్నట్టు లేదూ!
భాగీ: మనూ నాకు సిగ్గేస్తుంది.
మనోహరి: నాకు కోపం వస్తుంది.
భాగీ: అయినా.. పొగ మా రూంలో వస్తే.. మంట ఇక్కడ వస్తుందేంటి..?
మనోహరి: నువ్వేదే మాయ చేసి అమర్ తో సాంబ్రాణి వేయించుకున్నావని నాకు తెలియదు అనుకున్నావా..?
భాగీ: అయ్యో పిచ్చి మను మాయ చేసేది మంట పెట్టేది నువ్వు.. నాకు ప్రేమించడం తప్పా ఇంకేమైనా వస్తుందా..? చెప్పు
మనోహరి: ప్రేమ గీమ అన్నావనుకో చంపేస్తాను. నీ సంతోషం, ఈ ఆనందం అంతా మూడు రోజుల ముచ్చటే.. ఎలా వచ్చావో అలా వెళ్లేలా నేను చేస్తాను.
భాగీ: నువ్వేం చేయలేవు.. నేను ఇక్కడే ఉంటా.. వెళ్లాల్సింది.. వెళ్లబోయేది నువ్వే
అంటూ భాగీ కోపంగా మనోహరిని హెచ్చరిస్తుంది. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కరుణ, భాగీకి ఫోన్ చేసి సాంబ్రాణి గురించి అడుగుతుంది. షాక్ అయిన భాగీ నీకెలా తెలుసని అడుగుతుంది. దీంతో కరుణ తాను అమర్ తో ఫోన్ మాట్లాడిన విషయం చెప్తుంది. ఆ విషయం చెప్పగానే భాగీ సంతోషంగా కరుణకు థాంక్స్ చెప్తుంది. తర్వాత ప్రిన్సిపాల్ అమ్మును పిలిచి ఎక్స్‌కర్షన్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్తుంది. కేవలం ఆరవ ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం మాత్రమే ఈ టూర్ ప్లాన్ చేస్తున్నామని చెప్తుంది. దీంతో అమ్ము ప్రిన్సిపాల్ ను వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
Also Read: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)