అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :  శోభకు తన శక్తులు ఇచ్చిన ఆరు – భూమితో కలిసి దీపం వెలిగించిన శోభ  

Nindu Noorella Saavasam Today Episode:   శోభకు తనకున్న స్పర్శ శక్తని ఆరు ఇవ్వడంతో శోభ తన కూతురుతో కలిసి దీపం వెలిగిస్తుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ గుడిలో పూజలు చేస్తుంటారు. ఇంతలో అమర్‌ వాటర్‌ తీసుకెళ్లి భాగీకి ఇస్తాడు. దీంతో భూమి మెల్లగా భాగీని చూస్తుంది. అమరేంద్ర గారు మా భాగీ అంటే బాగానే ప్రేమ ఉంది మీకు అంటుంది. అలాంటిదే లేదని పాస్టింగ్ ఉంది కదా..? అందుకే వాటర్‌ ఇచ్చానని చెప్తాడు. ఇంతలో గగన్‌ కూడా భూమిని ఎందుకు వాళ్లను ఇబ్బంది పెడతున్నావు అంటాడు. భాగీ కూడా మ భూమిని ఎలా భరిస్తున్నారు అని అడుగుతుంది. మాతో మమూలుగా ఆడుకోదని చెప్తాడు గగన్‌. తర్వాత అందరూ దీపాలు వెళిగిస్తారు. కళ్లు మైసుకుని మెక్కుతుంటే మనోహరి అక్కడకు వచ్చి తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌ బాటిల్స్‌ పెడుతుంది. మరోవైపు దూరంగా కూర్చున్న శరత్‌ చంద్ర ఆత్మ భూమిని తలుచుకుంట ఏడుస్తుంది.

గుప్త: ఆ తల్లి కార్చు ప్రతి కన్నీటి బొట్టుకు కారణం నవ్వే బాలిక. ఆ బాలిక బాధను తీర్చబోయి.. ఈ తల్లికి తీరని బాధను మిగిల్చితివి.

ఆరు: తీర్చగలను గుప్త గారు ఆ తల్లి బాధను నేను తీర్చగలను.

గుప్త: బాలిక.. ఈ బాలిక మళ్లీ ఏం చేయునో ఏమో..

ఆరు: శోభాచంద్ర గారు. భూమి మీద ఉన్నందుకు.. పుణ్యం చేసుకున్నందుకు స్పర్శ శక్తని ఆ భగవంతుడు ఇచ్చాడు. ఆ శక్తిని ఇవాళ మనసా వాచా మీకు ఇద్దామనుకుంటున్నాను.

గుప్త: బాలిక నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..? అటుల చేసిన ఎడల నీవు నీ శక్తిని కోల్పోయెదవు.

ఆరు: పర్వాలేదు గుప్త గారు ఈవిడ తన కన్న కూతురుతో కొన్ని క్షణాలు కలిసి ఉంటుందంటే నా శక్తులు పోయినా పర్వాలేదు.

శోభ: ముఖ పరిచయం కూడా లేని నాకోసం ఇంత త్యాగం ఎందుకు చేస్తున్నావు అమ్మా..

ఆరు: కూతురుగా తల్లి లేని బాధ తెలుసు. తల్లిగా పిల్లలకు దూరంగా ఉన్న బాధ తెలుసు.

గుప్త: బాలిక ఒక్కసారి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకో..

ఆరు: పర్వాలేదు గుప్త గారు అయినా ఒక తల్లి బిడ్డను కలపలేని శక్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత. నా శక్తి ఆమెకు వచ్చేటట్టు చేయండి గుప్తగారు.

గుప్త: నీ త్యాగమును ఏ పేరున పిలవాలెనో తెలియడం లేదు బాలిక.

 అంటూ ఆరు స్పర్శ శక్తిని శోభా చంద్రకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాడు గుప్త. స్పర్శ శక్తి వచ్చిన శోభాచంద్ర సంతోషంగా వెళ్లి పువ్వులు పట్టుకుంటుంది. తర్వాత భూమి వాళ్ల దగ్గరకు వెళ్లి చాటు నుంచి చూసి వెళ్లిపోతుంటే..

భూమి: అమ్మా.. ( అని పిలుస్తుంది.) మీ కళ్లు అచ్చం మా అమ్మ కళ్లలాగే ఉన్నాయి.

ఆరు: ఏంటిది గుప్త గారు శోభ గారు భూమికి కనిపిస్తుందా..?

గుప్త: నువ్వు నీ సోదరికి కనిపించుచుంటివి కదా..? నీ శక్తి ఈ బాలికకు ఇచ్చావు కదా..? అందుకే కనిపిస్తుంది.

శోభ: నీ పేరేంటి తల్లి..

భూమి: భూమి.. అమ్మా నాకో సాయం చేస్తారా..? నాకు అమ్మ లేదమ్మా.. నాతో పాటు ఈ దీపాలు వెలిగిస్తారా..?

అని అడగ్గానే శోభ.. భూమి దగ్గరకు వెళ్లి తదేకంగా చూస్తుంటుంది. ఇంతలో భూమి ఏంటమ్మా అలా చూస్తున్నారు అని అడుగుతుంది. తెలిసిన అమ్మాయిలా ఉన్నావు అందుకే చూస్తున్నాను అని చెప్తుంది.

భూమి: అమ్మా మీ ముఖం నేను ఒకసారి చూడొచ్చా..?

శోభ: ఏమీ అనుకోకు తల్లి.. నాకు కాస్త గాయం అయింది. అందుకని..

భూమి: ఏమైనా మీ కళ్లు మాత్రం చాలా బాగున్నాయి. నిజంగా మా అమ్మ కళ్లలాగే ఉన్నాయి. మిమ్మల్ని నేను ఒకటి అడగొచ్చా..?

శోభ: అడుగమ్మా…?

భూమి: అందరూ నా కళ్లు మా అమ్మ కళ్లలాగే ఉంటాయి అంటారు. నిజంగా నా కళ్లు మీ కళ్లలాగే ఉంటాయా..?

శోభ: మీ అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నీ కళ్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. ముందు ఆ కన్నీళ్లు తుడుచుకో..

  అంటూ శోభ ఏడుస్తుంది. భూమి ఎమోషనల్ అవుతుంది. ఇద్దరూ కలిసి దీపం వెలిగిస్తారు. తర్వాత శోభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దూరం నుంచి అంతా గమనిస్తున్న గుప్త ఆశ్చర్యంగా నువ్వు చాలా మంచిదానివి అంటూ మెచ్చుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీట్‌లో నోట్ల కట్టలుఆ డబ్బుతో నాకు సంబంధం లేదు, ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విజయోత్సవాలకు ఆహ్వానం - కేసీఆర్‌ను టీజ్ చేస్తున్నారా ?
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
India Vs Australia 2nd Test Match: మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
మరోసారి చేతులెత్తేసిన భారత బ్యాటర్లు.. 180 పరుగులకే ఆలౌట్
Abhishek Singhvi Controversy:రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
రాజ్య‌స‌భ‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ సీటు వద్ద నోట్ల క‌ట్టలు- విచార‌ణ‌కు ఛైర్మ‌న్ ఆదేశం
CM Chandrababu: 'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
'ఒక కుటుంబం నుంచి ఒక ఐటీ ప్రొఫెషనల్' - సీఎం చంద్రబాబు కొత్త నినాదం ఇదే!
Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - సులభ దర్శనానికి ప్రత్యేక పోర్టల్
YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Benefit Shows Cancelled In Telangana: ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
ఫుష్ప 2 ఎఫెక్ట్‌- తెలంగాణలో బెనిఫిట్‌ షోలు రద్దు
Embed widget