అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 15th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌ :   అమర్, భాగీలను కలిసిన గగన్‌, భూమి -  అపూర్వకు ఫోన్‌ చేసిన మనోహరి

Nindu Noorella Saavasam Today Episode:  గుడికి వచ్చిన అమర్‌, భాగీలను గగన్‌, భూమిలు కలుస్తారు. భూమి క్లోజ్‌ ఫ్రెండ్‌ భాగీ షాక్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:   అమర్‌, భాగీ, పిల్లలు, మనోహరి అందరూ కలిసి గుడికి వెళ్తారు. కారు దిగిన భాగీ కాలుకు ఏదో గుచ్చుకుందని బాధపడుతుంటే అమర్‌ చూసుకుని నడవొచ్చు కదా అంటాడు. దీంతో మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది. వీళ్లిద్దరిని విడగొట్టాలని నేను ప్రయత్నిస్తుంటే..వీళ్లేమో బంధం గట్టి పడాలని గుడికి వచ్చారు. వీళ్లతో పాటు రావడం నా దరిద్రం అని మనసులో అనుకుంటుంది.

మనోహరి: కళ్లు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది.

అమర్: ఇప్పుడు ఓకేనా..? పర్వాలేదా..? నడవగలవా..?

మనోహరి: అమర్‌ గుచ్చుకుంది చిన్న పెంకే.. గునపం కాదు.

భాగీ: నడవగలను అండి వెళ్దాం పదండి.

మనోహరి: చీ ఈరోజు ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందో…? ( అని మనసులో అనుకుంటుంది.)

గుడి దగ్గర ఆడవాళ్లను ఆట పట్టిస్తున్న చిల్లర బ్యాచ్‌ ను చూసి అమర్‌ మీరు వెళ్లండి నేను వస్తాను అంటాడు. భాగీ వాళ్లు లోపలికి వెళ్తారు. ఇంతలో గగన్‌, భూమి కూడా అదే గుడికి వస్తారు. గగన్‌ కూడా వాళ్లను చూసి కొట్టడానికి వెళ్తాడు. ఇద్దరూ కలిసి పోకిరీలను కొడతారు. తర్వాత ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటారు. గుడిలోకి వెళ్లిన అంజు మనోహరిని కామెడీగా చూస్తుంది. మిస్సమ్మ ముందు నువ్వు తుస్సు అయ్యావంటూ వెక్కిరిస్తుంది. మనోహరి ఇరిటేటింగ్‌ ఫీలవుతుంది. నేను ఎంత చేసినా అమర్‌కు దూరం అవుతున్నాను అనుకుంటూ కొబ్బరికాయ కింద పడేస్తుంది. ఇంతలో భూమి వస్తుంది.

భూమి: హలో కొబ్బరికాయ కొట్టాలి. అలా కింద పడేయకూడదు.

మనోహరి: ఈ అమ్మాయి శోభా, శరత్ చంద్ర వాళ్ల అమ్మాయిలా ఉంది. అపూర్వకు ఈ పిల్లకు అసలు పడదు కదా..? ( అని మనసులో అనుకుని వెళ్లిపోతుంది.)

గగన్‌: అసలు నీకు సెన్స్‌ ఉందా..? తెలియని వాళ్లతో గొడవ పడతావేంటి..?

భూమి: మీరేంటి నన్ను అంటారు. తప్పు చేసింది ఆవిడ.

గగన్‌: అయినా గుడిలో ఇంత మంది ఉన్నారు కదా..? నీకెందుకు కోపం వచ్చింది.

భూమి: అందరూ సైలెంట్‌ గా ఉంటారేమో నేను ఉండను.

గగన్‌: నీకు చెప్తున్నాను కదా.. నాకు బుద్ది లేదు.

అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఇంతలో శారద, పూరి అక్కడకు వచ్చి వాళ్ల గొడవ ఆపి గుడిలోకి తీసుకెళ్తారు. మరోవైపు ఆరు కూడా గుడికి వస్తుంది. ఆరు వెనకాలే చెప్పకుండా గుప్త వస్తాడు. మరోవైపు గుడిలోపల భాగీని చూసిన భూమి వెళ్లి హగ్‌ చేసుకుంటుంది. నీ పెళ్లికి పిలవలేదని అలుగుతుంది భూమి. తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. భాగీ పిల్లలను నా పిల్లలు అని పరిచయం చేయగానే అది విన్న ఆరు ఎమోషనల్‌ అవుతుంది. అందరూ హ్యాపీగా ఉంటే మనోహరి పక్కకు వెళ్లి అపూర్వకు ఫోన్ చేస్తుంది.

అపూర్వ: ఏంటి నేస్తమా చాలా రోజులకు గుర్తొచ్చినట్టు ఉన్నాను. ఎక్కడున్నావు. ఎలా ఉన్నావు.

మనోహరి: అమర్‌ ను పెళ్లి చేసుకోలేదు కదా అస్సలు బాగాలేను. నువ్వు కూడా బాగా లేవని ఇప్పుడే తెలిసింది. ఇందాక గుడికి వచ్చిన నీ శత్రువును చూస్తుంటే అర్థం అవుతుంది.

అపూర్వ: ఆ భూమి గుడికి వచ్చిందా…?  మనిద్దరం ఓడిపోతున్నాం మనోహరి.

మనోహరి: నీ శత్రువు నా శత్రువు కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు.

అని చెప్పగానే అపూర్వ.. భూమిని చంపేయమని మనోహరికి చెప్తుంది. నీకు అడ్డుగా ఉన్న ఆ భాగీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తల్లీకూతుళ్లు నా చేతిలోనే చావడానికి పుట్టినట్టున్నారు అని అంటుంది అపూర్వ. మరోవైపు ఆరును చూసిన భాగీ దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. తమ దగ్గరకు రమ్మని పిలుస్తుంది. దీపాలు వెలిగించాక వస్తానని చెప్తుంది ఆరు. సరేనని వెళ్లిపోతుంది ఆరు. తర్వాత ఆరు గుప్త దగ్గరకు వెళ్తుంది.

ఆరు: నేను ఈరోజు ఎవరి శరీరంలోకి వెళ్లనని మాటిచ్చాక. మీరు నాకొక మాట ఇచ్చారు కదా.. ఇప్పుడు అడగొచ్చా నేను.

గుప్త: ఆ మాట ఏంటో అడుగుము.. అది సాద్యమో అసాధ్యమో కాదో నేను చెప్పెదను.

ఆరు: అసలు నా గురించి నేను ఏమీ కోరుకోను

గుప్త: ఏవో చిన్న చిన్న కోరికలు కోరుతుందమో.. ( అని మనసులో అనుకుని ) అడుగుము..

ఆరు: భూమి వాళ్ల అమ్మను ఈరోజు భూలోకానికి రప్పించండి.

గుప్త: ఏమిటి స్వర్గంలో ఉన్న ఆ బాలిక తల్లిని భూలోకానికి తీసుకురావాలా..? వలదు బాలిక ఇది అసంభవం. సృష్టికి విరుద్దం. విధికి ఎదురు వెళ్లకూడదు.

ఆరు: గుప్త గారు మాటిచ్చారు. దేవుని సన్నిధిలో ఉండి మీరిచ్చిన మాట తప్పుతారా..?

అని ఆరు అడగ్గానే గుప్త సరేనని మంత్రం చదివి శోభాచంద్ర ఆత్మను కిందకు రప్పిస్తాడు. శోభాచంద్రను చూసిన ఆరు హ్యాపీగా చూస్తుంది. దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంటుంది. దీంతో శోభాచంద్ర షాక్‌ అవుతుంది. ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారు అని అడుగుతుంది. నీ తీరని కోరిక నెరవేర్చేందుకు అని గుప్త చెప్పగానే అయితే నా కూతురిని చూపిస్తారా..? అని అడుగుతుంది. అవునని అక్కడ నీ కూతురు ఉందని ఎవరో కనుక్కోమని ఆరు చెప్తుంది. భూమిని చూసిన శోభాచంద్ర తనే నా కూతురు అంటూ ఎమోషనల్ అవుతుంది. మరోవైపు మనోహరి భూమిని, భాగీని చంపడానికి పెట్రోల్‌ బాబ్జీతో తెప్పించుకుంటుంది. వాళ్లిద్దరిని ఇక్కడే చంపేస్తానని చెప్తుంది.  ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget