అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today November 14th: నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  భాగీ కోసం ఎమోషనల్‌ అయిన అమర్‌ - అమర్‌ కు దగ్గరయ్యేందుకు మనోహరి ప్రయత్నం

Nindu Noorella Saavasam serial Today Episode November 14th: ఐసీయూలో ఉన్న భాగీ కోసం అమర్ తపించిపోతుంటాడు. భాగీ విషయం తెలిసి ఆరు బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ మీద మనోహరి విష ప్రయోగం చేయించిందని యమలోకంలోని యముడు, విచిత్ర గప్తుడు మాయా దర్పణంలో చూస్తారు.

గుప్త: వీక్షించితిరా ప్రభు ఆ మనోహరి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేయుచున్నదో

యముడు: అన్నియు వీక్షించుచున్నాను గుప్త

గుప్త: కృష్ణ పరమాత్మ కూడా శిశు పాలుడిని వంద తప్పుల వరకే క్షమించాడు ప్రభు తమరు ఎందుకని ఈ బాలికను శిక్షించకుండా ఉపేక్షిస్తున్నారు

యముడు: దేనికైనా సమయం రావాలి కదా గుప్త

గుప్త: ఆ దుర్మార్గురాలు మన లోకమునకు వచ్చిన పిదప నరకలోమున ఉన్న శిక్షలన్నీ విధించెదను

యముడు: విచిత్రగుప్త మాకును ఆ బాలికపై ఆగ్రహముగా ఉన్నది. కానీ ఆమె ఆయువు తీరే వరకు మనమేమీ చేయలేము..

గుప్త: పాపి చిరాయువు అన్నట్టు ఆ రాక్షాసి అంత త్వరగా మరణించి మన లోకమునకు రాదనుకుంటాను ప్రభు..

యముడు: మృత్యు దేవత ఆదేశించినప్పుడే మన కర్తవ్యం పాటించాలి గుప్త. అంత వరకు మనం ఎవ్వరి చావును కోరరాదు.. భూలోకమున జరుగునది ఆ  అరుందతి బాలిక కంట పడకుండా చూసుకొనుము..

గుప్త: అటులనే ప్రభు… ప్రభూ అటు చూడుము..

అంటూ పక్కనే నిలబడి మొత్తం వింటున్న ఆరును చూపిస్తాడు గుప్త. ఆరును చూసిన యముడు షాక్‌ అవుతాడు. ఈ బాలిక మొత్తం విన్నదా..? అని మనసులో అనుకుంటాడు. ఆరు ఏడుస్తూ దర్పణంలోకి చూస్తుంది.

ఆరు: నా చెల్లెకి ఏమైంది..? ఎందుకు హాస్పిటల్‌ లో ఉంది..? చెప్పండి రాజుగారు.. గుప్త గారు చెప్పండి

యముడు: నీ సోదరిపై విష వాయువు ప్రయోగం జరిగింది బాలిక

ఆరు: ఎవరు చేశారు

గుప్త: ఇంకెవరు చేస్తారు.. ఆ మనోహరి

ఆరు: ఇప్పుడు నా చెల్లి పరిస్థితి ఏంటి..?

యముడు: చూస్తున్నావు కదా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతుంది

ఆరు: నా చెల్లి చావడానికి వీల్లేదు తన కడుపులో ఒక బిడ్డ ఉంది. వాళ్లను కాపాడండి యమధర్మరాజా..? మీ కాళ్లు పట్టుకుంటా..? నన్ను కనికరించండి.. ఫ్లీజ్‌

యముడు: అది నా చేతుల్లో లేదు బాలిక

ఆరు: మీరైనా చెప్పండి గుప్త గారు. ఎలాగైనా నా చెల్లి బతకాలి. తను నిండు నూరేళ్లు పిల్లలతో కలిసి ఉండాలి

గుప్త: క్షమించుము బాలిక. మేము నిమిత్త మాత్రులం మాత్రమే ఈ విషయంలో మేము నీకు సహాయం చేయలేని నిస్సహాయులం

ఆరు: అయ్యో భాగీ ఆ దేవుడికే నీ మీద దయ లేనప్పుడు ఇక నిన్ను ఎవరు కాపాడతారు..? నీ కడుపులో ఉన్న బిడ్డను ఎవరు రక్షిస్తారు

అని ఏడుస్తుంది. యముడు, గుప్త అక్కడి నుంచి వెళ్లిపోతారు. భూలోకంలో సరస్వతి వార్డెన్‌ ఆశ్రమంలో పిల్లలకు టిఫిన్‌ పెడుతుంటుంది. ఇంతలో రాజు కంగారుగా పరుగెత్తుకుంటూ వస్తాడు.

రాజు: మేడం భాగమతి మేడం హాస్పిటల్‌లో.. ఐసీయూలో ఉన్నారట.. పరిస్తితి చాలా సీరియస్‌గా ఉందట

సర్వస్వతి: ఏం జరిగింది రాజు గారు.. (జరిగిన విషయం చెప్తాడు రాజు) ఈ దాడి కచ్చితంగా  ఆ మనోహరే పనే అయుంటుంది. ఆ రాక్షసి ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటుంది. దేవుడు దాన్ని  ఎప్పుడు తీసుకెళ్తాడో రాజు గారు

రాజు: ఆ దుర్మార్గురాలు గురించి మీరు భాగీ గారికి చెప్పారు కదా మేడం. ఇంకా ఆవిడ ఆ ఇంట్లో ఎందుకు ఉంది.

సర్వస్వతి: నేను మనోహరి గురించి భాగీ గారికి చెప్పాను. కానీ మనోహరి గురించి ఏదో కారణం చేత భాగీ గారు అమరేంద్ర గారికి చెప్పలేదు

రాజు: పదండి మేడం మనం వెళ్లి అమరేంద్ర గారికి అన్ని విషయాలు చెబుదాం

సర్వస్వతి: రాజు గారు అమరేంద్ర గారికి  ఏ విషయం చెప్పొద్దని భాగీ గారు నా దగ్గర మాట తీసుకున్నారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది భాగీ గారి గురించి పదండి రాజు గారు హాస్పిటల్‌కు వెళ్దాం

అంటూ అందరూ కలిసి హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ అంజు, అమ్ము, ఆనంద్‌, ఆకాష్‌ నలుగురు కలిసి భాగీ కోసం గుడికి వెళ్తుంటే వారితో పాటు గుడికి వెళ్లి హోమం చేయిస్తారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget