Nindu Noorella Saavasam Serial Today March 23rd:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: డ్రైవర్‌ను తప్పించిన మనోహరి – ఎస్సైతో చాలెంజ్ చేసిన అమర్
Nindu Noorella Saavasam Today Episode: అరుంధతిని హత్య చేసిన డ్రైవర్ ను మనోహరి తప్పించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: బయటకు వెళ్తున్న అమర్ దగ్గరకు వెళ్లి రాథోడ్ అరుంధతిని చంపిన వాళ్లు బయట స్వేచ్చగా తిరుగుతున్నారని వాళ్లను వదిలిపెట్టొద్దని చెప్తాడు. అయితే ఆ చంపిన వాళ్లు ఎవరో నీకు తెలసినట్లు చెప్తున్నావని ఒకవేశ నీకు తెలిస్తే నాకు చెప్తావులే అంటాడు అమర్. ఆరు చావుకు కారణమైన వాళ్లకు శిక్ష పడాలని నేను ఎంత కోరుకుంటానో నువ్వు అంతే కోరుకుంటావని నాకు తెలుసు అంటూ వాళ్లెవరో నీకు తెలుసా? అనగానే నాకు తెలువదు సార్ కానీ మేడం చావు వెనక మనకు తెలిసిన వాళ్ల హస్తమే ఉండొచ్చని అనిపిస్తుంది అంటాడు రాథోడ్. అయితే పదా అంటూ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. మరోవైపు మనోహరి ఎస్సైకి ఫోన్ చేస్తుంది. ఎస్సై దారిలోనే ఉన్నామని డ్రైవర్ తప్పించుకుని నీ దగ్గరకు వస్తాడని చెప్తాడు. తర్వాత టీ తాగడానికి పోలీసులు కారు దిగగానే అరుంధతిని చంపిన డ్రైవర్ తప్పించుకుని పారిపోయి.. మనోహరిని కలుస్తాడు.
మనోహరి: ఎం చెప్పాను నీకు అమర్ కంటికి కనిపిస్తే చంపేస్తాడని చెప్పానా? చావు అంచుల దాకా వెళ్లొచ్చావని నీకు అర్థం అవుతుందా? వెళ్లిపో ఈ ఊరు ఈ స్టేట్ ఇప్పుడే వదిలేసి వెళ్లిపో..
డ్రైవర్: నీ భయం నాకు అర్థం అవుతుంది మేడం కానీ నా బాధే మీకు అర్థం కావడం లేదు. నేను అడిగిన డబ్బు నాకు ఇచ్చేస్తే నేను వెళ్లిపోతాను
మనోహరి: వారం రోజుల్లో నాకు పెళ్లి అవుతుంది. అప్పుడు నీకు కోటి రూపాయలు ఇస్తాను.
డ్రైవర్: కోటి రూపాయలా? మీ పెళ్లి కంటే రెండు రోజుల ముందే నాకు డబ్బు మొత్తం ఇవ్వాలి.
అంటూ వార్నింగ్ ఇచ్చి డ్రైవర్ వెళ్లిపోతూ కొడైకెనాల్‌లో ఆ మిలటరీ ఆయన భార్యను మీరు నాచేత చంపించారన్న సాక్ష్యాలు అన్ని నా దగ్గర ఉన్నాయి. అవి నా మనిషికి ఇచ్చాను. మీరు నన్ను ఏమైనా చేస్తే అవి మిలటరీ ఆయనకు ఇస్తాడు. అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అమర్ ఆ డ్రైవర్ ఎక్కడా అని నిలదీస్తాడు.
ఎస్సై: సార్ మీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను కానీ వాడు అలా పారిపోతాడని నేను అనుకోలేదు. వాణ్ని పట్టుకోవడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు సార్.
అమర్: ఎంతకీ అమ్ముడుపోయావు. చెప్పు ఎంతకీ అమ్ముడుపోయావు.
ఎస్సై: ఏం మాట్లాడుతున్నారు నా స్టేషన్ లో ఇంకొక మాట మాట్లాడితే మీరు మిలటరీ అని కూడా చూడను.
మీకు చేత కాకపోతే నేను వెతుకుతాను వాణ్ని అని చెప్పడంతో ఎస్సై సరే వెతకండి మేము మీకు సపోర్టు చేస్తాను అని భయపడుతూ చెప్తాడు. దీంతో అమర్ స్టేషన్ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఎస్సై మనోహరికి ఫోన్ చేసి ఆయనతో మీరు జాగ్రత్తగా ఉండండి. బలమున్నవాడితో పెట్టుకోవచ్చు కానీ తెగించినోడితో పెట్టుకుంటే ఓడిపోయేది మనమే.. అంటూ జాగ్రత్తలు చెప్తాడు ఎస్సై. మనోహరి ఇంట్లోకి వెళ్తుంటే గుప్త నీ రాత ఏంటో నువ్వు కోరుకున్నది నీకు కాకుండా వేరొకరి దక్కుతుందని నువ్వెప్పుడు తెలుసుకుంటావో ఏమో అనడంతో మనోహరి విని వచ్చి గుప్తను తిడుతుంది. తర్వాత అరుంధతి వచ్చి గుప్తను తిడుతుంది. ఇంట్లోకి వచ్చిన మనోహరికి నీల డాష్ ఇస్తుంది.
మనోహరి: దున్నపోతులా డాష్ ఇవ్వడమే కాకుండా మళ్లీ నామీదే పంచులు వేస్తున్నావా? అయినా ఏం కొంపలు మునిగిపోతున్నాయని అంతలా కంగారు పడుతున్నావు.
నీల: మునిగిపోయేది మీ కొంపే మేడం.
అంటూ పిల్లలు పెళ్లి ఆపడానికి లెటర్ రాయాలని ప్లాన్ చేయడాన్ని నీల, మనోహరికి చెప్తుంది. పిల్లలు లెటర్ రాసి అమర్ రూంలో పెట్టి వెళ్లడాన్ని చూసిన మనోహరి రూంలోకి వెళ్లబోతుంటే శివరాం చూసి మనోహరిని పిలుస్తాడు. ఎందుకు అమర్ రూంలోకి చూస్తున్నావు అని అడుగుతాడు. అమర్ టీ ఏమైనా తాగుతాడేమో అడుగుదామని అనగానే అమర్ మూడ్ బాగాలేదు అని చెప్పడంతో మనోహరి పక్కకు వెళ్తుంది. రూంలో అమర్ పిల్లలు రాసిన లెటర్ చూస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: యంగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య?