అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today June 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి శుభఘడియలు – జాబ్‌ మానేస్తానన్న అనామిక  

Nindu Noorella Saavasam Today Episode: ఇంట్లోంచి అనామిక వెళ్లిపోతాననగానే మనోహరి హ్యపీగా ఫీలవుతుంది. చిత్ర తో కలిసి భాగీని ఇంట్లోంచి వెళ్లగొట్టాలని ప్లాన్‌ చేస్తుంది.  

Nindu Noorella Saavasam Serial Today Episode: తనకు ఆఖరి ఘడియలు సమీపిస్తున్నాయని తెలుసుకున్న అనామికలోని ఆరు కంగారుగా గుప్తకోపం వెతుకుతుంది. ఆ కంగారులో కిందపడబోతుంటే అమర్‌ వచ్చి పట్టుకుంటాడు.

అమర్‌: చూసుకుని వెళ్లు అనామిక.. నువ్వు బాగానే ఉన్నావా..? ఎందుకో కంగారు పడుతున్నట్టు.. బాధగా ఉన్నట్టు కనిపిస్తున్నావు

అనామిక:  అలాంటిదేం లేదు సార్‌

అమర్‌:  ఏదైనా ప్రాబ్లమ్‌ ఉంటే ఇది కూడా నీ ఫ్యామిలియే అనుకుని షేర్ చేసుకో అనామిక

అనామిక: అలాగే సార్‌.. థాంక్యూ..

అనగానే అమర్‌ వెళ్లిపోతాడు. మరోవైపు స్వామిజీ మనోహరికి ఫోన్‌ చేస్తాడు.

స్వామిజీ: ఏంటి మనోహరి అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతున్నాయని సంబర పడుతున్నావా..?

మను: నేను అనుకున్నవన్ని జరగుతున్నాయని మీకెలా తెలుసు స్వామి

స్వామిజీ: నీ జాతకం చెప్తుంది మనోహరి. నీకు శుభ ఘడియలు మొదలయ్యాయి.

మను: నాకు శుభ ఘడియలు మొదలైతే చిత్రకు పెళ్లి జరగడం ఏంటి స్వామి.. నా పెళ్లి జరిగితే కదా నాకు శుభ ఘడియలు మొదలైనట్టు

స్వామిజీ: ఏమో నీ పెళ్లికి కూడా నీ ప్రయాణం మొదలవుతుందేమో

మను: ఏమంటున్నారు స్వామిజీ నాకు అమర్‌కు పెళ్లి జరుగుతుందా..? కానీ ఆ అరుంధతి ఉండగా అదెలా జరగనిస్తుంది

స్వామిజీ: అరుంధతి ఉండదు కాబట్టే అది జరుగుతుంది

మను: మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామిజీ.. అరుంధతి ఉండదు అంటే ఎక్కడికి వెళ్తుంది

స్వామిజీ:  ఆ అరుందతి పరమాత్మలో కలిసిపోతుంది. ఈ పౌర్ణమి ఆ ఆత్మకు చివరి రోజు. ఆ రోజే ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది

మను: అంటే అరుంధతి ఇక్కడి నుంచి పర్మినెంట్‌ గా వెళ్లిపోతుందా..

స్వామజీ:  అవును మనోహరి వెళ్లిపోతుంది

అంటూ స్వామిజీ చెప్పగానే థాంక్యూ స్వామిజీ అంటూ కాల్ కట్ చేసి చిత్రకు కాల్ చేస్తుంది. ఎక్కడ ఉన్నావని అడుగుతుంది. ఇప్పుడే స్టార్ట్‌ అయ్యానని చిత్ర చెప్తుంది ఇంకా స్టార్ట్‌ అయ్యే దగ్గరే ఉన్నావా.? త్వరగారా అని చెప్తుంది.

చిత్ర: ఏంటి మను అంత హ్యపీగా ఉన్నావు

మను: నాకు స్వతంత్రం రాబోతుంది చిత్ర

చిత్ర: అది 1947లోనే వచ్చేసింది కదా

మను: ఏయ్‌ నేను అంటుంది అరుంధతి నుంచి నాకు స్వతంత్రం రాబోతుందని.

చిత్ర: అంటే అరుంధతి వెళ్లిపోబోతుందా..?

మను: అవును ఇక మనల్ని ఆపడానికి ఎవ్వరూ లేరు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి

చిత్ర:  అయితే నా ఎంట్రీ.. అరుంధతి ఎగ్జిట్‌ అన్నమాట సరే నేను వచ్చేస్తున్నాను బై

 అంటూ కాల్ కట్‌ చేయగానే.. మనోహరి హ్యాపీగా  అరుంధతి ఈ ఇంటి నుంచి వెళ్లిపోయి చిత్ర చిన్న కోడలుగా వస్తే.. ఇద్దరం కలిసి భాగీని ఈజీగా ఇంట్లోంచి వెళ్లగొట్టొచ్చు ఆ తర్వాత అమర్‌కు నాకు పెళ్లి కాకుండా ఎవ్వరూ ఆపలేరు. అరుంధతి నువ్వు మనిషిగా ఉన్నప్పుడే ఆఖరి సారి నీతో మాట్లాడాలని ఉంది. అనుకుంటూ బయటకు వెళ్తుంది. బయట గుప్త దగ్గరకు వెళ్లిన అనామికకు గుప్త పౌర్ణమి ఘడియలు సమీపిస్తున్నాయి. నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి లేదంటే ఆ అమ్మాయి చనిపోతుంది అని చెప్పగానే అనామిక బాధగా సరేనంటూ అమర్‌ దగ్గరకు వెళ్లి తాను జాబ్‌ మానేసి వెళ్లిపోతానని చెప్తుంది. దీంతో పిల్లలు ఎమోషనల్‌ అవుతారు. అందరినీ ఓదారుస్తుంది అనామిక. తర్వాత అందరికీ బై చెప్పి వెళ్లిపోవాలనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 22nd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీకి యాక్సిడెంట్ చేసిన విహారి! నడిరోడ్డు మీద భర్తతో గొడవ పడ్డ లక్ష్మీ 2.0!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget