Nindu Noorella Saavasam Serial Today June 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీపై చిత్ర ఫైర్ - పట్టించుకోని వినోద్
Nindu Noorella Saavasam Today Episode: పెళ్లైన మొదటి రోజే చిత్ర తన కోపాన్నంతా భాగీపై చూపించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గుడిలో వినోద్, చిత్రకు తాళి కడతాడు. ఇంతలో అమర్, భాగీ, నిర్మల, శివరాం వస్తారు. మనోహరి వచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తుంది. శివరాం కోపంగా చూస్తుంటాడు.
శివరాం: రేయ్ వినోద్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..?
వినోద్: ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నాన్న.. ఇప్పుడు చిత్ర నా భార్య మన ఇంటి కోడలు
భాగీ: ఎందుకు వినోద్ ఎందుకు ఇంత పని చేశావు. ఒక్క నిమిషం ఆలోచించవచ్చు కదా
వినోద్: ఆలోచిస్తే.. మా పెళ్లి ఆపడానికా
శివరాం: అసలు నీకు బుద్ది ఉందారా..?
వినోద్: నేను మీ మాట కాదన్నాను అని మా పెళ్లి అవ్వకుండా ఉండాలని మీరు చూస్తున్నారు. అందుకే కదా అన్నయ్యా నన్ను ఆశ్రమానిక పిలిపించారు. ఇప్పుడు ఇక్కడకు వచ్చారు.
భాగీ: వినోద్ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. కానీ నిజం తెలుసుకో
వినోద్: అవునా ఏంటా నిజం చెప్పండి ఇవాళ నేను తెలుసుకుంటాను
మిస్సమ్మ చిత్ర గురించి నిజం చెప్పబోతుంటే.. అమర్ ఆపేస్తాడు. శివరాం చెప్పడానికి ప్రయత్నించినా అమర్ ఆపేసి..
అమర్: వినోద్ మీరిద్దరూ ఈరోజు పెళ్లి చేసుకుంటున్నారని మాకు తెలుసు. వీళ్లిద్దరూ చిత్రను దత్తత తీసుకున్న వాళ్లు వీళ్ల సమక్షంలో మీ పెళ్లి చేయాలని వీళ్లను మీకు పరిచయం చేయాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. మీకు పెళ్లి చేస్తామని చెప్పాక కూడా మీరు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. మనోహరి వీళ్లిద్దరిని తీసుకెళ్లి దేవుడి దర్శనం చేయించు
మనోహరి వాళ్లిద్దరిని తీసుకుని వెళ్లిపోతుంది. వాళ్లు వెళ్లిపోయాక
భాగీ: ఏవండి ఎందుకండి వినోద్‌కు ఎందుకు నిజం చెప్పలేదు
శివరాం: వాడు పెళ్లి చేసుకుంది ఎవరినో వాడికి ఎందుకు చెప్పలేకపోయావు అమర్
అమర్: చెప్పి ఏం చేస్తాం నాన్నా.. వినోద్ చిన్నప్పటి నుంచి ఎంత సెన్సిటివో తెలుసు కదా..? వాడు ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాడని చెప్పడం.. వాడి భార్య చేతిలో మోసపోయాడని చెప్పడం ఎలా ఒకటి అవుతుంది నాన్నా.. నేను చెప్పబోయే నిజం వాడి మనసును ముక్కలు చేస్తుంది నాన్నా
రావు: ఆ రాక్షసి మీ తమ్ముడి జీవితం నాశనం చేస్తుంది బాబు
రావు వైఫ్: మా మాట విని మీ తమ్ముడికి నిజం చెప్పండి
భాగీ: అవునండి వినోద్‌కు అర్థం అయ్యేలా చెబుదామండి
అమర్: చెప్తే వినే స్థితిలో వాడు లేడు.. చిత్రనే మంచి మనిషిగా మార్చి వినోద్ జీవితం చక్కబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది
శివరాం: అలాంటి అమ్మాయిని ఎలారా మార్చేది
అమర్: తప్పదు వినోద్ కోసం మనం భరించాలి. చిత్ర మారే వరకు మనం ప్రయత్నిద్దాం
అని చెప్తాడు అమర్. తర్వాత అందరూ కలిసి కొత్త జంటను ఇంటికి తీసుకుని వస్తారు. ఇంట్లోకి అడుగుపెడుతూనే చిత్ర చెంబును విసిరి భాగీ మీదకు వేస్తుంది. దీంతో భాగీకి గాయం అవుతుంది. రక్తం వస్తుంది. భాగీ బాధగా రూంలోకి వెళ్లిపోతుంది. ఇంతలో అమర్ ఆయిట్మెంట్ తీసుకుని వెళ్లి భాగీని ఓదారుస్తాడు. అయితే భాగీ అమర్‌ను టెన్షన్ పడొద్దని అంతా తాను చూసుకుంటానని చెప్తుంది. ఆ మాటలకు అమర్, భాగీని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















