అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today July 2nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ పాలల్లో టాబ్లెట్‌ కలిపిన చిత్ర – తెలియక అమర్‌కు ఇచ్చిన భాగీ  

Nindu Noorella Saavasam 2 July Episode: భాగీ, అమర్‌కు ఇచ్చే పాలల్లో చిత్ర టాబ్లెట్‌ కలపడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Nindu Noorella Saavasam Serial Today Episode: శోభనం కోసం తనను రెడీ చేస్తున్న చిత్రతో ఇదంతా అవసరమా అని అడుగుతుంది భాగీ. దీంతో నీకు అవసరం కాకపోవచ్చు కానీ నాకు చాలా అవసరం పెళ్లి అయ్యాక శోభనం జరగకపోతే ఎంత కష్టమో తెలుసా అంటుంది. రెండు రోజులకే అంత కష్టమా అంటూ భాగీ అడుగుతుంది. అంతా గార్డెన్‌లో ఉన్న ఆరుకు గుప్త తన మంత్రంతో చూపిస్తుంటాడు. అంతా చూస్తున్న ఆరు బాధపడుతుంది.

గుప్త: బాలిక మాకొక విషయం అవగతం అవ్వడం లేదు. వారిరువురిని కలపడం కోసం నువ్వే ప్రయత్నిస్తువి కదా మరి ఎందుకు ఇప్పుడు నీకీ ఈ వ్యథ

ఆరు: అప్పుడు ఎన్నో రోజులు ప్రిపేర్‌ అయితే కలపడానికి ట్రై చేశాను. ఇప్పటికి ఇప్పుడంటే ఏదోలా ఉంది.. అది కాదు గుప్త గారు ఇప్పటికి ఇప్పుడు ఇది అంటే ఆయన ఎలా ఫీలవుతారు. పాపం ఆయన ఏమైపోతారు చెప్పండి

గుప్త: అది నన్ను అడిగితే నేనేం చెప్పగలను కాసేపట్లో నీ పతి దేవుడు వస్తాడు. అతగాడినే ఆ ప్రశ్న అడుగుము

అమర్‌ ఇంటికి వస్తాడు.

అమర్: రాథోడ్‌ ఈ రోజు నైట్‌ నేను పడుకునే సరికి కొంచెం లేట్‌ అవుతుంది. పొద్దునే కూడా ఎర్లీగా ఏం రాకు పది గంటలకు వెళ్దాం.. నేను లేచాక నీకు కాల్ చేస్తాను అప్పుడు వచ్చేయ్‌

రాథోడ్‌: అలాగే సార్‌.. గుడ్‌ నైట్‌

గుప్త: తమరి ప్రశ్నకు సరియైన సమాధానం దొరికినట్టు ఉన్నది

ఆరు: ఆయన మీరు అనుకున్నట్టు కాదు గుప్త గారు. లేదు అది మీరు విన్నారు కదా..? నేను మళ్లీ మనిషినై జన్మెత్తి ఈ భూమి మీదకు వచ్చాక కూడా వదలరు చూడండి అందుకు బాధగా ఉంది. ఆ లోపల జరిగేది కూడా గాలిలో గీతలు గీసి చూపిస్తారు కదా చూపించండి

గుప్త మంత్రం చదవగానే లోపల జరిగేది ఆరుకు కనిపిస్తుంది. అమర్‌ తమ రూంలోకి వెళ్లగానే.. మనోహరి డెకరేట్‌ చేస్తుంది.

అమర్‌: మనోహరి మా రూంలో ఏం చేస్తున్నావు.. అసలు ఏంటి ఇదంతా

మనోహరి:  కార్యానికి రూం డెకరేట్‌ చేయమంటే చేస్తున్నాను అమర్‌

అమర్‌: వినోద్‌, చిత్ర వాళ్ల రూం ఉంది కదా ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అసలు ఇదంతా చేయమని నీకెవరు చెప్పారు..? భాగీ ఎక్కడ..?

మనోహరి: భాగీ రెడీ అవుతుంది

అమర్‌: అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మనోహరి.. వాళ్ల కార్య ఇక్కడ పెట్టడం ఏంటి

మనోహరి: వాళ్ల కార్యం జరగాలంటే ముందు నీకు భాగీకి కార్యం జరగాలట కదా..?

అమర్‌: అవును భాగీ చెప్పింది అయితే..

మనోహరి: అందుకే ఇవాళ నీకు భాగీకి శోభనం ఏర్పాటు చేస్తున్నాం

అమర్‌: ఏంటి మనోహరి ఇదంతా వాళ్లు చెప్తే నువ్వు చేసేస్తావా..? ఇది మా ఇద్దరి పర్సనల్‌ మ్యాటర్‌ మేమిద్దరం మాట్లాడుకుంటాం కదా..?

ఆరు:  అది మా ఆయన అంటే బంగారు కొండ

మనోహరి: నాకు ఇదంతా చేయడం సరదా కాదు. చిత్ర అడిగిందని బాధపడుతుందని నా బాధను పక్కనపెట్టి ఇదంతా చేస్తున్నాను. ఒకరకంగా చూసుకుంటే భాగీ ప్లేస్‌లో నేను ఉండాల్సిన దాన్ని కదా..?

ఆరు:  ఇదొక్కటి ఎక్కడికి వెల్లినా తిరిగి అక్కడికే వస్తుంది

మను: అదే మనం అనుకున్నట్టు మన పెళ్లి జరిగి ఉంటే భాగీ ప్లేస్‌ లో  నేను ఉండేదాన్ని కదా అంటున్నాను అమర్‌. అలాంటిది నేను ఎలా చేస్తాను అనుకుంటున్నావు ఈ డ్రెస్‌ తీసుకో అమర్‌ రెడీ అవ్వు

అని మనోహరి వెళ్లిపోతుంది.

ఆరు: చూశారా గుప్త గారు మా ఆయనకు అసలు ఇదంతా చేస్తున్నారని కూడా తెలియదు.

అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత అమర్‌ రెడీ అవుతుండగానే.. చిత్ర, మనోహరి కలిసి భాగీని రూం దగ్గరకు తీసుకొచ్చి భాగీ రూంలోకి వెళ్లగానే డోర్‌ క్లోజ్‌ చేసుకుని వెళ్లిపోతారు. పాల గ్లాసుతో రూంలోకి వెళ్లిన భాగీ సిగ్గు పడుతుంది. కింద చిత్ర హ్యాపీగా ఫీలవుతుంటే..

వినోద్‌: ఇవాళ అక్కడ కార్యం అయిపోతుందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు మా అన్నయ్య ఏదీ అంత ఈజీగా ఒప్పుకునే రకం కాదు.. నీకు మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు

చిత్ర:  అవును మీ అన్నయ్య గురించి నాకు తెలియదు కానీ నా గురించి నీకు తెలియదు.  నేను మీ అన్నయ్యకు ఇచ్చే పాలల్లో టాబ్లెట్‌ కలిపిన విషయం నీకు తెలియదు

చిత్ర మాటలకు వినోద్‌ షాక్‌ అవుతాడు.

భాగీ: ఈ పాలు తాగండి..

పాలు తాగిన అమర్‌, భాగీని రొమాంటిక్‌గా చూస్తుంటాడు. ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు భాగీ అంటూ హగ్‌ చేసుకుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget