Nindu Noorella Saavasam Serial Today January 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరిని హెచ్చరించిన చంభా – పట్టించుకోని మను
Nindu Noorella Saavasam serial Today Episode January 8th: భాగీ విషయంలో మనోహరి జాగ్రత్తగా ఉండాలని చంభా హెచ్చరించడంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: సిటీలోకి భాగీ వచ్చిందన్న విషయం తెలియగానే తప్పకుండా ఇంటికి వస్తుందని మనోహరి అనుమానిస్తుంది. తాను ఇంట్లో లేని టైంలో భాగీ ఇంటికి వస్తే తనకు ఏ విషయం తెలియదని అందుకోసం ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టిస్తుంది.
చంభా: మనోహరి ఇంటి చుట్టూ కెమెరాలు బిగించి ఏం చేయాలి అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు
మను: బిడ్డతో భాగీ ఊళ్లోకి దిగింది అని తెలిసింది కదా..? ఊళ్లోకి వచ్చింది ఇంటి దాకా రాకుండా ఉంటుందా..?
చంభా: కచ్చితంగా వస్తుంది. కానీ మనం పెట్టిన ఏడేళ్ల గడువులో ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నాయి కదా..?
మను: మనం దానికి పెట్టిన భయం వందేళ్లు ఉంటుంది. కానీ అది మమకారం చంపుకోలేక అమరేంద్రను పిల్లలను చూడటానికి ఈ ఇంటికి చాటుగా వచ్చిన రావొచ్చు
చంభా: అందులో అనుమానమే లేదు.. చాటుగా వచ్చినా వస్తుంది
మను: అది చాటుగా వచ్చినా..? స్టేట్‌గా వచ్చినా నా కంట్లో పడాలనే ఇన్ని కెమెరాలు ఫిక్స్ చేయించాను
చంభా: అది సరే ఎలాగూ భాగీ వచ్చింది అనుకుందాం.. అప్పుడేం చేస్తావు..
మను: ముందు దాన్ని చూస్తాం.. మనం వేసిన శిక్షలో భాగంగా ఈ ఐదేళ్ల తర్వాత అది ఎలా ఉందో చూస్తాను. తర్వాత దాని అంతు చూస్తాను
చంభా: అంటే భాగీని చంపేస్తావా..?
మను: నిస్సందేహంగా ఏడేళ్ల గడువు గడిచాక నేనే దాన్ని వెతుక్కుంటా వెళదామనుకున్నాను.. కానీ దాని చావును అదే వెతుక్కుంటూ వచ్చింది. ఇన్నేళ్లు దాన్ని అరుంధతి కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నేను చూస్తాను
చంభా: మనోహరి ఇప్పుడు కూడా ఆ అరుందతియే కాపాడుతుంది.. ఆ విషయం మర్చిపోకు..
మను: అదెక్కడ ఉంది ఎప్పుడో పైకి పోయింది కదా..?
చంభా: మర్చిపోయినట్టు ఉన్నావు.. బిడ్డ రూపంలో అరుంధతి కిందకు వచ్చింది కదా..? పుట్టగానే.. నువ్వు ముట్టుకోగానే.. నీకు షాక్ ఇచ్చింది. పసిబిడ్డగా ఉన్నప్పుడే నిన్ను కాలుతో తన్నింది. నీకు గన్ను ఎక్కుపెట్టింది. ఇప్పుడు అరుందతి ఐదేళ్ల పిల్ల అంటే నడవడం మాట్లాడటం వచ్చిన పిల్ల అంటే ఇంకా శక్తి వంతురాలు అయ్యుంటుంది. నువ్వు అనుకుంటున్నట్టు భాగీ నీ చేతుల్లో చావడానికి రాలేదు మనోహరి.. నిన్ను చంపడానికి అరుంధతే భాగీని వెంటపెట్టుకుని వచ్చింది. భాగీ తన చావును వెతుక్కుంటూ రాలేదు.. నీ చావునే వెంటపెట్టుకుని వచ్చింది. వచ్చింది అమ్మా కూతుళ్లు కాదు.. అక్కా చెల్లెల్లు అని గుర్తు పెట్టుకో
మను: మళ్లీ పుట్టిన అరుంధతి నా మృత్యువని నేను మర్చిపోలేదు.. చంభా అందుకే ఐదు సంవత్సరాల క్రితం ఆ చావును గడప దాటించాను.. ఇప్పుడు అదే చావును గడగడా వణికిస్తాను.. వాళ్లు తల్లీబిడ్డలైనా..? అక్కా చెల్లెళ్లు అయినా నా చేతిలో చావడం ఖాయం.. నా చావును నేనే చంపేస్తాను
చంభా: అది నీకు సాధ్యం అవుతుందా..? అది నువ్వు చేయగలవా..?
మను: నేను ఏం చేయగలనో నీకు బాగా తెలుసు చంభా.. ఈ మనోహరికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.. ఇప్పుడా బిడ్డ శక్తి పెరిగి ఉండొచ్చు.. అలాగే నా తెలివి కూడా పెరిగింది. చూస్తూ ఉండు నేను వాళ్లను ఎలా చంపేస్తానో..?
అనగానే.. చంభా మాత్రం మనసులో అనుమానంగా ఎవరు ఎవరిని చంపుతారో చూస్తాను కదా..? అనుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















