Nindu Noorella Saavasam Serial Today January 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీని బయటకు తీసుకెళ్లిన అమర్ - అడ్డుకునే ప్లాన్ చేస్తున్న మనోహరి
Nindu Noorella Saavasam Today Episode: ఔటింగ్‌కు వెళ్లాలని అమర్, భాగీని తీసుకుని వెళ్లడంతో మనోహరి ఎలాగైనా ఆపాలని ప్లాన్ చేస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీతో కలిసి బయటకు వెళ్లడానికి అమర్ ప్లాన్ చేస్తాడు. అందుకోసం నిర్మలను పిలిచి ఏదైనా పని ఉంటే మనోహరికి చెప్పండని తాను బాగీ బయటకు వెళ్తున్నామని చెప్తాడు. అప్పుడే రూంలోంచి బయటకు వచ్చిన మనోహరి, అమర్ మాటలకు షాక్ అవుతుంది. భాగీని అమర్ బయటకు తీసుకెళ్లడం ఏంటని మనసులో అనుకుంటుంది. ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది. అమర్, భాగీని పిలుస్తాడు. భాగీ వస్తుంది.
అమర్: ఇంట్లో పనులు పక్కన పెట్టేయ్ మనం బయటకు వెళ్తున్నాం..
భాగీ: సరేనండి పదండి…
అమర్: ఇలా కాదు.. నువ్వు ఎఫ్‌ఎం కు వెళ్లేటప్పుడు ఎలా వెళ్లేదానివి అలా
భాగీ: నేను నా ఫ్రెండ్‌తో స్కూటీ మీద వెళ్లే దాన్ని అలాగా..?
నిర్మల: ఎలా వెళ్లే దానివి అంటే నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకునే దానివో అలా అని
భాగీ: చుడిదార్‌లో వెళ్లేదాన్ని.. అయితే..డ్రెస్ వేసుకుని వస్తాను.
అని చెప్పి పైకి వెళ్లబోతూ.. ప్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుని అమర్ దగ్గరకు వచ్చి నేను రానండి అని చెప్తుంది భాగీ.
శివరాం: మిస్సమ్మ, అమర్ ఏం అడిగాడో నీకు అర్థం అయ్యే సమాధానం చెప్పావా..?
భాగీ: ఆయన మాటలు అర్తం అయ్యాయి.. ఆయన మాటల్లోని పరమార్థం అర్తం అయింది.
నిర్మల: మిస్సమ్మ, అమర్ నిన్ను బయటకు తీసుకెళ్లడానికి బట్టలు మార్చుకోమంటున్నాడు.
భాగీ: అది నాకు అర్తం అయ్యింది అత్తయ్యా మీకే అర్థం కాలేదు
శివరాం: ఇంతకీ నీకేం అర్థం అయింది మిస్సమ్మ
భాగీ: బయట ఇంకేదో షూట్ అవుట్ ప్లాన్ చేసి ఉంటారు. నాకు పరిగెత్తడానికి వీలుగా ఉండటానికి నన్ను డ్రెస్ మార్చుకోమంటున్నారు.. అప్పుడంటే నేనేదో మోసపోయా.. ఇంకోసారి అలా మోసపోను
అమర్: ఏయ్ లూజ్ నేను తీసుకెళ్తుంది అందుకు కాదు
బాగీ: నీ మీద నాకు నమ్మకం లేదు
అంటూ భాగీ బాధపడుతుంటే.. నిర్మల, శివరాం బలవంతంగా భాగీని రెడీ అయ్యేలా చేస్తారు. అమర్ బయటకు వెళ్తాడు. గార్డెన్ లో ఉన్న ఆరు, అమర్‌ను చూసి ఈయనేంటి ఇవాళ ఇలా ఉన్నారు అనుకుంటుంది. ఇంతలో భాగీ రెడీ అయ్యి వస్తుంది. ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లాక ఆరు గుప్త కోసం వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు. దీంతో యముడిని పిలుస్తుంది. పైన యమలోకంలో ఉన్న యముడు ఆరు సౌండ్ కు ఇరిటేటింగ్ గా పీలవుతూ గుప్తను తిడుతుంటాడు.
గుప్త: ఆ బాలికను తీసుకురావడంలో మీరు కూడా ప్రయత్నించి విఫలం అయ్యారు కదా ప్రభు.
యముడు: ఈ యమధర్మరాజుల వారికే ఎదురు చెప్తున్నావా..? నీవు చేసిన ఈ తప్పిదమునకు నిన్ను వెంటనే ఈ గుప్తుల బాధ్యత నుంచి తొలగించి నిన్ను ద్వార పాలకుడిగా నిమిస్తున్నాను.
చిత్రగుప్తుడు: నా శిక్షణలో పెరిగిన ఈ చిత్రవిచిత్రగుప్తుడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఇతని తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను ప్రభు. నేను తక్షణమే భూలోకం వెళ్లి ఆ బాలికను తీసుకుని వచ్చెదను..
గుప్త: అయ్యా చిత్రగుప్తుల వారు తొందర పడి మాట ఇవ్వకండి
యముడు: చిత్రవిచిత్రగుప్త అసంబద్ద ప్రేలాపనలు ఆపుము.. చిత్రగుప్త నువ్వు భూలోకం వెళ్లి ఆ బాలికను తీసుకురమ్ము.
అని యముడు చెప్పగానే.. చిత్రగుప్తుడు సరే అంటాడు. మరోవైపు అమర్ తో వెళ్లిన భాగీ భయంభయంగా చూస్తుంటుంది. అమర్ బైక్ ఆపగానే.. భాగీ భయపడుతూ నాకు గన్ అంటే భయం లేదు.. కానీ అందులో బుల్లెట్ అంటేనే భయం అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















