Nindu Noorella Saavasam Serial Today January 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పిల్లలకు వార్నింగ్ ఇచ్చిన అమర్ - అమర్ ను చూసి షాకైన ఆరు
Nindu Noorella Saavasam Today Episode: ఉదయమే పిల్లలను నిద్ర లేపి వారితో వార్మప్ చేయిస్తాడు అమర్. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్ లో గుప్త కోసం వెతుకుతుంది ఆరు. ఎక్కడా కనిపించడం లేదని కంగారు పడుతుంది. తర్వాత ఆస్తికలు నదిలో కలపొద్దు అని సాధువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. బయట లైట్ ఆఫ్ చేయడానికి వచ్చిన భాగీ, ఆరును చూసి షాక్ అవుతుంది. దగ్గరకు వెళ్తుంది.
భాగీ: అక్క ఇక్కడి ఏం వెతుకుతున్నారు
ఆరు: రింగు పోయింది మిస్సమ్మ అదే వెతుకుతున్నాను.
భాగీ: అయితే ఇంట్లోకి వెళ్లి లైట్ తీసుకొస్తాను ఉండు అక్కా ఇద్దరం కలిసి వెతుకుదాం
ఆరు: ఏమీ వద్దులే మిస్సమ్మ అది గోల్డ్ రింగేం కాదు.. ఉదయం వెతుక్కుంటాను. మిస్సమ్మ ఇంట్లో అందరూ పడుకున్నట్టు ఉన్నారు.
భాగీ: లేదక్కా పడుకున్నా పడుకోనట్టే
ఆరు: ఎందుకు ఏమైంది మిస్సమ్మ..
భాగీ: అక్క ఆస్థికలు నదిలో కలపలేదన్న బాధో.. అక్క ఇంటి చుట్టూ తిరుగుతుందనే సంతోషమో తెలియడం లేదక్కా
ఆరు: మరి నువ్వేం అనుకుంటున్నావు
భాగీ: నాకెందుకో ఆరు అక్కా మళ్లీ ఈ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తుందనిపిస్తుంది.
ఆరు: నువ్వు ఊరుకో మిస్సమ్మ చనిపోయిన వాళ్లు మళ్లీ ఎలా తిరిగి వస్తారు.
భాగీ: లేదక్కా సాక్ష్యాత్తు ఆ దేవుడే వచ్చి అక్క ఆస్థికలు కలపకుండా చేయడం..అక్క ఆత్మ ఇక్కడే తిరగడం.. ఆ అవకాశం ఉంటే అక్కా మళ్లీ తిరిగి రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను..
ఆరు: ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ.. మరి ఆరు తిరిగి వస్తే నీ పరిస్థితి ఏంటి..?
భాగీ: ఇది ఆరు అక్కా కుటుంబం.. ఆవిడ తిరిగి వస్తే నేను వెళ్లిపోతాను
ఆరు: నువ్వు అలా మాట్లాడకు మిస్సమ్మ.. ఆయన పక్కన ఉండే అధికారం ఎవరికైనా ఉందంటే.. అది నీకే.. ఈ ఇంట్లో నీ స్థానం.. ఆయన జీవితంలో నీ స్ధానాన్ని కానీ ఎవ్వరూ మార్చకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి మిస్సమ్మ..
అని చెప్తూ రాత్రి అయింది మిస్సమ్మ నేను వెళ్తాను నువ్వు వెళ్లి పడుకో అంటుంది ఆరు. సరేనని భాగీ వెళ్లిపోతుంది. పొద్దునే అలారం మోగగానే.. పిల్లలు నిద్ర లేస్తారు. అంజు మాత్రం ఇరిటేటింగ్ గా ఫీలవుతుంది.
అంజు: ఇంత పొద్దున్నే ఎవర్రా అల్లారం పెట్టింది.
అమర్ కనిపించగానే..షాకింగ్ గా చూస్తూ..
అంజు: గుడ్ మార్నింగ్ డాడ్.. అదే పొద్దున్నే ఎలా లేవాలో చెప్తున్నాను.
అమర్: అంటే అల్లారం మోగకపోతే మీరు సిక్స్‌కు లేవలేరా..? మీ డిసిప్లీన్ ఏమైంది.
అంజు: చాలా గ్యాప్ వచ్చింది కదా.. డాడ్ ? అందుకే గురకపెట్టి నిద్ర పోతున్నాం..
అమర్: రేపటి నుంచి ఇలా సిక్స్ కు లేవడం కాదు..సిక్స్ వరకే లేచి రెడీ అయి కిందకు రావాలి.
పిల్లలందరూ షాక్ అవుతారు. మరి ఈరోజు ఏం చేస్తారని అమర్ అడగ్గానే కొద్దిసేపు పడుకుంటాం డాడ్ అంటారు. కాదు ఐదు నిమిషాల్లో రెడీ అయి గార్డెన్ లోకి రావాలి అని చెప్తాడు. తర్వాత అమర్ గార్డెన్ లోకి వెళ్లి విజిల్ వేస్తాడు. విజల్ విని అందరూ షాక్ అవుతారు. అందరూ బయటకు వస్తారు. విజిల్ వేస్తున్న అమర్‌ను చూసి ఆరు షాక్ అవుతుంది. ఇంతలో పిల్లలు బయటకు వస్తారు. వారిచేత ఎక్సర్ సైజ్ చేయిస్తుంటాడు అమర్. వీడు మళ్లీ ఇంట్లో ట్రైనింగ్ క్యాంపు మొదలుపెట్టాడు అంటాడు శివరాం. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















