Nindu Noorella Saavasam Serial Today January 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆశ్రమానికి వెళ్లిన అమర్ - నిజం తెలుసుకున్న భాగీ
Nindu Noorella Saavasam serial Today Episode January 13th: భాగీ ఉంటున్న ఆశ్రమానికి అమర్ వెళ్లడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మ స్కూల్‌కు వెళ్లడానికి రెడీ అయి రెడీ అవుతున్న భాగీ దగ్గరకు వెళ్తుంది. మమ్మీ అని పిలుస్తుంది. తిరిగి తన దగ్గరకు వచ్చిన బుజ్జమ్మను చూసిన భాగీ హ్యాపీగా ఫీలవుతుంది.
భాగీ: స్కూల్ కు టైం అవుతుంది నువ్వు రెడీ అయ్యావా..? బుజ్జమ్మ
బుజ్జమ్మ: నేను ఎప్పుడో రెడీ మమ్మీ
భాగీ: నువ్వు సూపర్ బుజ్జమ్మ
బుజ్జమ్మ: దేనికి నేను సూపర్ మమ్మీ
భాగీ: నిన్ను రెడీ చేసే అవకాశం నాకు ఎప్పుడూ ఇవ్వువు నీ అంతట నువ్వే రెడీ అవుతావు. నీ పనులు నువ్వే చేసుకుంటావు
బుజ్జమ్మ: మరీ నీకు నేను శ్రమ ఇవ్వకూడదు కదా.? నిన్ను కష్టపెట్టకూడదు కదా..? నిన్ను బాగా చూసుకోవాలి కదా..?
భాగీ: అదేంటి బుజ్జమ్మ నిన్ను నేను కదా చూసుకోవాల్సింది
బుజ్జమ్మ: నేనే నిన్ను చూసుకోవాలి అది నా బాధ్యత నిన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను..
భాగీ: నువ్వు నన్ను కాపాడతావా..?
బుజ్జమ్మ: అంటే నీ మీద ఈగ దోమ ఏదీ వాలకుండా చూసుకుంటాను
భాగీ: నువ్వు అచ్చం మా అక్కలాగే మాట్లాడుతున్నావే
బుజ్జమ్మ: నేను మీ అక్కనే కదా
భాగీ: ఏంటి ఏమన్నావు.?..
బుజ్జమ్మ: అదేనమ్మా నాకు నువ్వు మీ అక్క పేరు పెట్టావు కదా..? అంటే నేను నీ అక్కనే కదా..?
భాగీ: నువ్వు మా అక్కవి.. మా అమ్మవి.. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం
బుజ్జమ్మ: అదేం కాదు నువ్వు మా అమ్మ అవ్వడం నా అదృష్టం నువ్వు నా గ్రేట్ మమ్మీవి నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు.. అందుకే నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను.
భాగీ: థాంక్యూ బుజ్జమ్మ.. ఇంక స్కూల్ కు వెళ్దామా..?
బుజ్జమ్మ: ఆ మమ్మీ ఒక్క నిమిషం
భాగీ: ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు
బుజ్జమ్మ: ఈరోజు నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు మమ్మీ
భాగీ: ఏం లేదే రోజూ లాగానే ఉన్నానే
బుజ్జమ్మ: ఊహూ నువ్వు స్పెషల్‌గా రెడీ అయ్యావు..
భాగీ: అదేం లేదు రోజు లాగే ఉన్నాను..
బుజ్జమ్మ: లేదు నాకు ఎందుకో ఇవాళ నువ్వు స్పెషల్‌గా కనిపిస్తున్నావు.. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా..? మమ్మీ
భాగీ: స్పెషల్ ఏం లేదు నువ్వే నన్ను స్పెషల్ గా చూస్తున్నావు.. స్కూల్ కు ఆలస్యం అవుతుంది పద వెళ్దాం
అనగానే ఇద్దరూ కలసి వెళ్లబోతుంటే అప్పుడే అక్కడకు రాజు వస్తాడు. భాగీ రావడం చూసి ఆశ్చర్యపోతాడు.
రాజు: మీరు ఎక్కడికి అమ్మా
భాగీ: బుజ్జమ్మను స్కూల్ లో డ్రాప్ చేసి వస్తాను బాబాయ్
రాజు: నీకెందుకమ్మా శ్రమ బుజ్జమ్మను స్కూల్‌కు నేను తీసుకెళ్తాను కదా
భాగీ: పర్వాలేదు బాబాయ్ గారు బుజ్జమ్మ కూడా నన్ను స్కూల్‌కు రమ్మంటుంది.
రాజు: అది కాదమ్మా..? మీరు బయటకు వెళ్తే..?
భాగీ: మీ భయం నాకు అర్థం అయింది బాబాయ్.. నేను బయటకు వెళ్లి ఏ టెన్షన్ లేకుండా తిరిగి వస్తాను
అనగానే రాజు కూడా తాను వస్తానని చెప్తాడు. అయితే సరే అంటూ ముగ్గురు కలిసి స్కూల్‌కు వెళ్తారు. తర్వాత అమర్, రాథోడ్ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. అమరేంద్ర రావడం చూసిన రాజు షాక్ అవుతాడు. వెంటనే పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు.
రాజు: అమ్మా అమ్మా నువ్వు కాసేపు బయటకు రావొద్దమ్మా..?
భాగీ: ఎందుకు ఏమైంది బాబాయ్ ..
రాజు: మన ఆశ్రమానికి అమరేంద్ర సార్ వచ్చారమ్మా..?
భాగీ: ఏంటి బాబాయ్ మీరు చెప్పేది..? ఆయనేంటి ఇక్కడకు రావడం ఏంటి..? నా గురించి తెలిసిపోయిందా ఏంటి..? బాబాయ్..
రాజు: లేదు తెలియలేదు.. రేపు పండగ కదమ్మా పిల్లలకు బట్టలు ఇవ్వడానికి వచ్చి ఉంటారు… అయినా నువ్వు ఆయన వెళ్లే వరకు బయటకు రావొద్దమ్మ
అని చెప్పి రాజు హాల్లోకి వెళ్తాడు. అమర్ వచ్చి పిల్లలకు బట్టలు ఇచ్చి వెళ్తుంటే భాగీ కిటికీలోంచి చూస్తుంది. అమర్‌ను చూసి ఎమోషనల్ అవుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















