Nindu Noorella Saavasam Serial Today February 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అంజుకు చైన్ వేసిన రణవీర్ – చైన్ చూసి షాకైన అమర్
Nindu Noorella Saavasam Today Episode: అంజుకు అమర్ వేసిన చైన్ లాంటిదే రణవీర్ తీసుకురావడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ చైన్ అంజు మెడలో వేయడంతో భాగీ ఆ చైన్ అంత స్పెషలా అని అడుగుతుంది. అదేం లేదని క్యాజువల్‌గానే వేశానని అమర్ చెప్తాడు. నాకైతే ఏదో స్పెషల్ కనిపిస్తుంది అని భాగీ చెప్పడంతో అమర్ షాకింగ్‌ఆ చూస్తుంటాడు. చాటుగా ఉంటూ అంతా వింటున్న ఆరు షాక్ అవుతుంది.
ఆరు: మిస్సమ్మ తెలిసి అడుగుతుందా..? తెలుసుకోవడానికి అడుగుతుందా..?
అమర్: దానికి అంత స్పెషాలిటీ ఏమీ లేదు. ఆరు కొన్నది కదా అంతే..
అంజు: మిస్సమ్మ ఇది ది గ్రేట్ అంజు మెడలో ఉంది. అందుకే ఈ చైన్‌కు అంత స్పెషాలిటీ
మనోహరి, రణవీర్ వస్తారు. కారు దిగగానే.. రణవీర్ ప్లాన్ చేంజ్ చేస్తున్నాను మనోహరికి చెప్తాడు.
మనోహరి: అయితే అంజును అడిగి తీసుకెళ్దామనుకుంటున్నావా..?
రణవీర్: అవును మనోహరి.. అమర్‌ను నేరుగా ఢీకొట్టలేం.. మంచితనం.. మనుషుల మీద ఉన్న ప్రేమ అనే బలంతో కొట్టగలం ఇప్పుడు నేను అదే అస్త్రా్న్ని వాడబోతున్నాను.
అంటూ లోపలికి వెళ్తాడు. లోపల భాగీ చైన్‌ను చూస్తూనే ఉంటుంది.
అంజు: ఏంటి నా చైన్‌ను అలా చూస్తున్నావు.. అమ్మో దిష్టి తగులుద్ది నా చైన్‌కు హాయ్ రణవీర్ అంకుల్.. చేతిలో మళ్లీ కవర్ ఏంటి..? మళ్లీ షాపింగ్‌కు వెళ్లారా
భాగీ: కలసి వస్తున్నారు. కలిసి బయటకు వెళ్లారా..? లేదా బయటికి వెళ్లాక కలిశారా..?
రణవీర్: బయటకు వెళ్లాక కలిశాం.. నాకు హెల్ప్ కావాలంటే.. మనోహరి గారిని రమ్మని చెప్పాను..
భాగీ: ఏం హెల్ప్
రణవీర్: అంజలికి గిఫ్ట్ కొన్నాలని అనుకున్నాను అందుకోసం మనోహరి గారిని రమ్మన్నాను. ఇదే ఆ గిఫ్ట్
అంటూ చైన్ తీసి చూపిస్తాడు రణవీర్. ఆ చైన్ చూసి అమర్ షాక్ అవుతాడు.
అమర్: ఈ చైన్ ఈ చైన్
రణవీర్: ఈ చైనే.. ఏంటి అమరేంద్ర గారు మీరు ఎక్కడైనా చూశారా..?
అమర్: చూశానని కాదు.. ఈ చైన్, డాలర్ ఎందుకు తీసుకొచ్చారు
రణవీర్: స్పెషల్ రీజన్ అంటూ ఏమీ లేదండి.. తీసుకురావాలని తీసుకొచ్చాను
అమర్: ఇది నార్మల్ చైన్ కాదు కదా..? ఏదో ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంది. ఇదే చైన్ ఎందుకు చేయించారు
రణవీర్: అంటే మా ఊర్లో దుర్గామాతను ఎక్కువగా కొలుస్తామండి అందుకే అంజు పాప మెడలో దుర్గామాత లాకెట్ వేస్తే రక్షగా ఉంటుందని ఈ చైన్ తీసుకొచ్చాను. మిస్సమ్మ గారు పాప మెడలో ఈ చైన్ మీరే వేయండి.
మనోహరి: రణవీర్ గారు మీరే తీసుకొచ్చారు కదా.. మీరే అంజు మెడలో వేయండి.
అని చెప్పగానే అమర్ కూడా మీరే వేయండి అని చెప్తాడు. దీంతో రణవీర్ వెళ్లి అంజు మెడలో చైన్ వేస్తాడు. సేమ్ చైనా ఎలా తీసుకొచ్చారు అని అమర్ మనసులో అనుకుంటాడు. తర్వాత రణవీర్‌కు ఫోన్ చేసి మనోహరి అంజున ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నావు అని అడుగుతుంది.
రణవీర్: ఏమో నాకేం అర్థం కావడం లేదు. మనం తీసుకొచ్చిన చైన్ గురించి అమర్ అంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే.. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా..?
మను: ఆ చైన్ చూడ్డానికి డిఫరెంట్‌గా ఉంది కదా.. అందుకే అమర్ అలా అడిగి ఉంటాడు
రణవీర్: లేదు మనోహరి అమర్ అడిగిన విధానం. ఆ చైన్‌ను చూసిన విధానం మామూలుగా లేదు
మను: నువ్వు ఎక్కువవగా ఆలోచిస్తున్నావు నీ ఫ్యామిలీ చైన్ గురించి అమర్‌కు ఎలా తెలుస్తుంది…?
రణవీర్: అదే కనుక్కోవాలి.. అంజు మెడలో ముందురోజు అమర్ వేసిన చైన్ చూడాలి
మను: నీకేమైనా పిచ్చి పట్టిందా..? అనవసరమైన అనుమానాలతో నీ డౌట్లు పక్కన పెట్టు.
అని మనోహరి చెప్తుండగానే అంజు బయటకు రణవీర్ దగ్గరకు వస్తుంది. అంజు మెడలో చైన్ చూసి షాక్ అవుతాడు రణవీర్. వెంటనే నాతో పాటు కోల్‌కతా వస్తావా అని అంజును అడిగితే డాడీ పంపించరు అంకుల్ అంటుంది. డాడీ ఓకే అంటే వస్తావా..? అంటాడు. సరే అంటూ లోపలికి వెళ్తుంది అంజు. వెనకే లోపలికి వెళ్లిన రణవీర్ అమర్ దగ్గరకు వెళ్లి ఇవాళ రాత్రికే కోల్‌కత్తా వెళ్తున్నానని చెప్తాడు. ఇంతలో మనోహరి వచ్చి నేను కూడా కోల్‌కతా వెళ్తున్నానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















