Nindu Noorella Saavasam Serial Today February 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అంజలిని షాపింగ్ కు తీసుకెళ్లిన అమర్ - అంజలిని చూసి షాక్ అయిన మంగళ
Nindu Noorella Saavasam Today Episode: షాపింగ్ మాల్ దగ్గర అంజలిని చూసి మంగళ షాక్ అవుతుంది. నిజం తెలుస్తుందేమోనని భయపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: శివరాం మంగళకు ఫోన్ చేసి పెళ్లి బట్టలు కొందాం కూకట్‌పల్లికి రమ్మని చెప్తాడు. మంగళ సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కాళీని పిలిచి కూకట్‌పల్లి వెళ్దాం పద బట్టలు కొనడానికి అని చెప్తుంది. దీంతో కాళీ మనిద్దరం బయటకు వెళితే ఇంట్లో బావ ఒక్కడే ఉంటాడని చెప్పడంతో మీ బావేమైనా చిన్న పోరడా ఒక్కడు అంటున్నావు అని మంగళ కోప్పడుతుంది. మనం రోజంతా అక్కడే ఉంటామా అంటూ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. మరోవైపు అరుంధతి, అమరేంద్ర కూర్చుని మాట్లాడుకుంటుంటారు.
అరుంధతి: మీరు నాకోసం భాగి పెళ్లి చేస్తున్నందుకు ఆనంద పడాలో లేదా మనం భాగి వాల్ల పెళ్లి ప్లాన్ చేసి ఈ పెళ్లి చేస్తున్న విషయం తలుచుకుని బాధపడాలో తెలియడం లేదండి. ఇదంతా భాగితో చేప్పేద్దామా అని చూస్తే విధిని మారిస్తే ప్రకృతి నుంచి వచ్చే ప్రమాదాల వల్ల నా కుటుంబానికి ప్రమాదం అని గుప్త గారు చెప్పారు.
అని అరుంధతి బాధపడుతుంటే.. మిస్సమ్మ డోర్ దగ్గరకు వచ్చి పిలుస్తుంది. అమరేంద్ర మిస్సమ్మను లోపలికి పిలుస్తాడు. మిస్సమ్మ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంటే అరుంధతి, మిస్సమ్మకు కనిపించకుండా బయటకు వెళ్లిపోతుంది.
మిస్సమ్మ: అన్నింటికి కారణాలు అర్థం అయినా దీని వెనకున్న కారణం అర్థం కావడం లేదండి.
అరుధతి: ఆయన నీ పెళ్లి చేయాలనుకుంది నాకోసం భాగీ ( తలుపు చాటున నిలబడి మనసులో అనుకుంటుంది.)
అమరేంద్ర: ఇది నా బాధ్యత మిస్సమ్మ. నేను చేయాల్సిన పని, తీర్చుకోవాల్సిన రుణం.
అనగానే అర్థం కాలేదని మిస్సమ్మ అంటుంది. నీ పెళ్లి అయితే అంతా నీకు అర్థం అవుతుందిలే అని అమరేంద్ర చెప్పగానే మిస్సమ్మ బయటకు వచ్చేస్తుంది. అరుంధతి లోపలికి వెళ్తుంది. బయట మిస్సమ్మను చూసిన రాథోడ్ పెళ్లి సింపుల్‌గా చేసుకుంటాను అంటున్నావు అని అడుగుతాడు. పెళ్లే కాంప్రమైజ్ అయ్యి చేసుకుంటున్నాను అని సార్‌కు ఈ విషయం చెప్పొద్దని మిస్సమ్మ వెళ్లిపోతుంది. తర్వాత షాపింగ్‌కు వెళ్లడానిక అందరూ రెడీ అయి మిస్సమ్మ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ కిందకు రాగానే అమరేంద్ర ఇక వెళ్దామా అంటాడు. దీంతో ఒక్క నిమిషం ఆగండి అంజలి కూడా వస్తుంది అని చెప్తుంది. దీంతో మనోహరి షాక్ అవుతుంది.
మనోహరి: అంజలి కూడా మనతో పాటు షాపింగ్‌కు వస్తుందా?
మిస్సమ్మ: అవును
మనోహరి: ఎందుకు?
అమరేంద్ర: మనోహరి మిగతా ముగ్గురు వస్తున్నారు అందుకని ..
అని అమర్ చెప్పగానే మనోహరి తను ఇప్పుడే రిలాక్స్ అవుతుంది. షాపింగ్ ఎంతసేపు అవుతుందోనని అందుకే వద్దంటున్నాను అంటుంది. దీంతో మిస్సమ్మ అంజలిని తీసుకెళ్దామని చెప్తుంది. అమర్ సరే అంటాడు. మనోహరి మాత్రం మీరు వెళ్లండి నేను ఇప్పుడే వస్తాను అని రూంలోకి వెళ్లి మంగళకు ఫోన్ చేస్తుంది. మంగళ కావాలనే లిఫ్ట్ చేయకుండా సైలెంట్‌లో పెడుతుంది. ఏదో ఒకటి చేసి వాళ్లను షాప్ దగ్గరే ఆపేయాలి అనుకుంటుంది మనోహరి. మరోవైపు షాప్ దగ్గరకు వచ్చిన కాళీ, మంగళతో అక్క జీవితంలో ఇంత పెద్ద షాప్‌లో బట్టలు కొనే అదృష్టం నీవల్లే నాకు కలిగింది అంటూ ఎగ్జైట్ అవుతుంటాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. ఇంతలో అమర్ వాళ్లు షాప్ దగ్గరకు రాగానే రాధోడ్ మంగళకు ఫోన్ చేస్తాడు. తాము బయట ఉన్నామని చెప్పడంతో మంగళ బయటకు వస్తుంది.
మంగళ: సార్ నమస్తే నా కూతురు రాలేదా?
అమరేంద్ర: వచ్చారు.
అనగానే మిస్సమ్మ, అంజలి కలిసి కారు దిగడాన్ని మంగళ చూసి షాక్ అవుతుంది. కాళీ యాక్సిడెంట్ చేసినప్పుడు అంజలి చూసింది అని చెప్పిన విషయాన్ని మంగళ గుర్తు చేసుకుని షాక్ అవుతుంది. ఏమైందని అమర్ అడుగుతాడు. ఇంతలో మనోహరి కల్పించుకుని అంజలికి హెల్త్ బాగాలేదు కదా ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంది అని చెప్పగానే అమర్ సరే లోపలికి వెళ్దాం పదండి అని అందరూ లోపలికి వెళ్తారు. లోపల స్టోర్ మేనేజర్ వచ్చి ఏ ఫ్లోర్‌లో ఏయే ఐటమ్స్ ఉన్నాయో చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: తన పక్కన నటించాలంటే అలా ఉండాలన్నారు - ఎన్టీఆర్, ఏఎన్నార్‌లపై వై విజయ ఆసక్తికర వ్యాఖ్యలు