Nindu Noorella Saavasam Serial Today December 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీ కోసం పిల్లల ఆరాటం – పిల్లలను ఓదార్చిన మనోహరి
Nindu Noorella Saavasam serial Today Episode December 31st: భాగీ కావాలని పిల్లలు ఏడుస్తుంటే.. మనోహరి ఓదారుస్తుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో భాగీ కోసం అందరూ బాధపడుతుంటారు. పిల్లలు కూడా ఏడుస్తుంటారు. అమర్ పిల్లలను ఎంత ఓదార్చినా కన్వీన్స్ అవ్వరు. రాథోడ్.. రామ్మూర్తికి కాల్ చేసి విషయం చెప్తాడు. రామ్మూర్తి కంగారుగా అమర్ ఇంటికి వస్తాడు.
రామ్మూర్తి: నా బిడ్డకు ఏమైంది బాబు అసలు అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి..? అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇలా జరగడం ఏంటి..? బాబు
రాథోడ్: సార్ మీరు టెన్షన్ అవ్వకండి సార్ మిస్సమ్మకు ఏమీ అవ్వదు సార్
అమ్ము: చెప్పండి డాడ్ మిస్సమ్మకు ఏమైంద తాతయ్య కూడా అడుగుతున్నారు కదా..? అసలు ఏం జరిగింది డాడ్
అమర్: తను ఎక్కడికి వెళ్లలేదు.. వస్తుంది. మీరు ఏడవకండి
అమ్ము: డాడీ రాత్రి మేము నిద్రపోయే ముందు మిస్సమ్మ మా గదిలోకి వచ్చింది. ఏదో సెండాఫ్ ఇస్తున్నట్టుగా మాతో మాట్లాడింది
అంజు: మేము మీరు చెప్పిన మాట వినాలని రోజూ స్కూల్‌కు వెళ్లాలని అల్లరి చేయకూడదని బాగా చదువుకోవాలని.. టైం టూ టైం తిని నిద్రపోవాలని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది డాడ్
అమర్: ( మనసులో) అంటే వెళ్లిపోవాలని భాగీ ముందే డిసైడ్ అయిందన్నమాట. అందుకే పిల్లలతో అలా మాట్లాడి ఉంటుందా..?
ఆనంద్: మాకు అప్పుడే డౌటు వచ్చింది డాడ్. బుజ్జమ్మను చూసుకోవడంలో మిస్సమ్మ బిజీగా ఉంటానని మమ్మల్ని మేమే చూసుకోవాలని చెప్పింది
ఆకాష్: మిస్సమ్మ ఎందుకు ఇలా చేసింది డాడ్ .. బుజ్జమ్మను తీసుకుని ఎందుకు వెళ్లిపోయింది
అమర్: తను వచ్చేస్తుంది. మీరు ఏడవకండి..? మనోహరి పిల్లలను తీసుకెళ్లు
మనోహరి: సరే అమర్
అని పిల్లలను తీసుకుని లోపలికి వెళ్తుంది.
రామ్మూర్తి: ఏంటి బాబు పిల్లలు ఏదేదో మాట్లాడుతున్నారు. నా కూతురుకు ఏమైంది. నా బిడ్డ, మనవరాలు ఎక్కడికి వెళ్లిపోయారు బాబు..
అమర్: తెలియదు మామయ్య.. తెలుసుకుంటాను..
అని వెళ్లిపోతాడు అమర్..
రామ్మూర్తి: అమ్మా భాగీ ఎంత పని చేశావమ్మా..? అసలు ఎందుకిలా చేశావమ్మా..? ఎందుకిలా చేశావు తల్లి..
రాథోడ్: సార్ మీరు టెన్షన్ అవ్వకండి సార్ మిస్సమ్మకు ఏమీ అవ్వదు సార్
రామ్మూర్తి: ఏమీ అవ్వకపోవడం ఏంటి..? రాథోడ్.. ఒక చంటి బిడ్డను తీసుకుని అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లిపోవడం అంటే మామూలు విషయమా..? అసలు నా భాగీకి ఏమైంది..? నా కూతురును ఆ మనోహరే ఏదో అని ఉంటుంది. అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయి ఉంటుంది. ఒసేయ్ మనోహరి
రాథోడ్: సార్ ఆగండి సార్ మిస్సమ్మ వెళ్లిపోవడానికి మనోహరికి ఏమీ సంబంధం లేదు సార్ మిస్సమ్మే కావాలని వెళ్లిపోయింది సార్..
రామ్మూర్తి: నువ్వు ఏం అంటున్నావు రాథోడ్.. అసలు ఏమంటున్నావు రాథోడ్..
రాథోడ్: నిన్న మిస్సమ్మ ఏదో బాధగా కొత్తగా మాట్లాడింది సార్.. పిల్లలను సార్‌ను జాగ్రత్తగా చూసుకోమని నాకు అప్పగింతల్లా చెప్పింది సార్.. పిల్లలకు చెప్పినట్టే నాకు కూడా సెండాఫ్ చెప్పింది సార్.. అప్పుడే నాకు అనుమానం వచ్చి ఎక్కడికి వెళ్తుతున్నావు మిస్సమ్మ అని అడిగాను.. ఓ నాలుగు రోజలు మా ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పింది. అందుకే సార్ ముందుగా మీకు ఫోన్ చేశాను..
రామ్మూర్తి: భాగీ భాదగా వెళ్లిపోయింది అంటే దానికి కారణం ఆ మనోహరే అయ్యుంటుంది. ఈ విషయం వెంటనే బాబుగారికి చెప్పాలి ఇప్పటికిప్పుడు దాన్ని ఇంట్లోంచి తరిమేస్తే కానీ నా కూతురు ఇంటికి తిరిగి రాదు..
రాథోడ్: సార్ వద్దు సార్.. మనోహరి గురించి మనం సార్ తో ఏమీ చెప్పకూడదని మిస్సమ్మ నా దగ్గర మాట తీసుకుంది సార్..
రామ్మూర్తి: అదేంటి రాథోడ్ ఆ నీచురాలి గురించి అల్లుడు గారికి చెప్తానని భాగీ అనుకుంది కదా..?
రాథోడ్: అదే నాకు అర్థం కావడం లేదు సార్.. కానీ మిస్సమ్మ తిరిగి వచ్చే వరకు మనోహరి గురించి ఏమీ నోరు జారకూడదని ఒట్టు వేయించుకుంది సార్..
రామ్మూర్తి: నా బిడ్డ ఎందుకు ఇలా చేసింది రాథోడ్ దానికి ఏమైంది..?
రాథోడ్: బాధపడకండి సార్ పిల్లల్ని సార్‌ను వదిలి మిస్సమ్మ బయట ఉండలేదు సార్ త్వరలోనే తిరిగి వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది సార్..
రామ్మూర్తి: అప్పటి వరకు ఆ పిల్లల గతి ఈ ఇంటి గతి ఏం కావాలి రాథోడ్ అసలు నా కూతురు ఎందుకు ఇలా చేసింది రాథోడ్ ..
అని రామ్మూర్తి బాధపడతాడు. రాథోడ్ ఓదారుస్తుంటాడు. ఇక పిల్లలను మనోహరి ఎంత కన్వీన్స్ చేయాలని చూసిన కన్వీన్స్ అవ్వరు. భాగీ కావాలని ఏడుస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















