Nindu Noorella Saavasam Serial Today December 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: పక్కింటి అక్కే ఆరు ఏమో అని డౌటు పడ్డ రాథోడ్ - మనోహరికి మళ్లీ వార్నింగ్ ఇచ్చిన భాగీ
Nindu Noorella Saavasam Today Episode: భాగీకి కనిపిస్తున్న పక్కింటి అక్కే ఆరు మేడం అయ్యుండొచ్చు అని రాథోడ్ అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: డోర్ దగ్గర నిలబడ్డ రాథోడ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే భాగీ వస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు రాథోడ్ అని అడుగుతుంది. నీ గురించే ఆలోచిస్తున్నాను అని రాథోడ్ చెప్పగానే మా నాన్న కూడా నా గురించి ఇంతలా ఆలోచించి ఉండరు. అన్నయ్యా అనే పదానికి నిలువెత్తు రూపం రాథోడ్ నువ్వు అని భాగీ అనగానే రాథోడ్ తల బాదుకుంటాడు. ఏమైంది రాథోడ్ అని మిస్సమ్మ అడగ్గానే ఇందాక స్వామిజీ వచ్చి మేడం గారు ఇక్కడే తిరుగుతుంది కదా ఎవరికీ కనిపించని మేడం ఆత్మ నీకు కనిపిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది అంటాడు. అదేం లేదని ఆత్మలను ఎవరైనా పట్టుకుంటారా..? కానీ నేను పక్కింటి అక్కను చాలా సార్లు పట్టుకున్నాను అని భాగీ అనగానే రాథోడ్ వెళ్లిపోతాడు. రూంలో మనోహరి ఆలోచిస్తుంది.
మనోహరి: ఆ ముసలోళ్లు నా ప్రతి ప్లానుకు అడ్డు పడుతూనే ఉన్నారు. దాన్ని పౌర్ణమి లోపు పంపించేద్దాం అనుకుంటే పౌర్ణమి వరకు ఆపేశారు. దానికి ఈ మిస్సమ్మ కూడా వత్తాసు పలికింది. ఇప్పుడు పౌర్ణమి రోజు అది ఎందుకు సైలెంట్ గా ఉంటుంది. అయినా దాన్ని ఎలాగో మూడు రోజులు ఆపితే దాని పీడ విరగడి అయిపోతుంది.
భాగీ వస్తుంది. భాగీని చూసిన మనోహరి షాక్ అవుతుంది.
మనోహరి: నేను మాట్లాడుకున్నది మొత్తం విందా (అని మనసులో అనుకుంటుంది.)
భాగీ: నువ్వు ఇక మారవా మనోహరి ఎప్పుడూ ఇలా ఎవరినో ఒకరిని బాధపెడుతూనే ఉంటావా..?
మనోహరి: నేను మాట్లాడుకుంది వినలేదు. ( అని మనసులో అనుకుంటుంది.) అది సరే ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు
భాగీ: నువ్వు ఆరోజు నాకు చూపించింది ఆరు అక్క ఫోటోనేనా..?
మను: అవును ఆరు ఫోటోనే చూపించాను. అయినా ఇప్పుడు నీకెందుకు వచ్చింది ఆ డౌటు.
భాగీ: నీ మాటల్లో కంగారు.. ముఖంలో టెన్షన్ చూస్తుంటే ఇక్కడేదో జరుగుతుంది అని నాకు అనుమానంగా ఉంది.
మను: అదేం లేదు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో..
భాగీ వెళ్లిపోతుంటే.. ఇంతలో అమర్ వస్తాడు.
అమర్: నేను మీ ఇద్దరితో మాట్లాడాలని వచ్చాను
మను: ఏంటి అమర్ చెప్పు..
అమర్: ఘోర గురించి మాట్లాడాలి
మనోహరి: ఘోర గురించా..? ఏం మాట్లాడాలి..
అమర్: మనం ఆరు అస్థికలు నదిలో కలిపేస్తున్నామని ఆ ఘోరకు తెలిస్తే వాడు మళ్లీ మన ఇంటికి వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మనోహరి నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఘోర మన ఇంటికి వచ్చిన ప్రతిసారి నీ రూంలోకి వచ్చాడని నాకు అనుమానంగా ఉంది
మనోహరి: ఇక రాడులే అమర్
భాగీ: రాడని నీకెలా తెలుసు అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావు
మను: మనం ఎవ్వరం చెప్పకపోతే ఘోరకు ఎలా తెలుస్తుంది. అందుకే రాడులే అని చెప్పాను.
అని మనోహరి సర్ది చెప్పగానే అమర్, భాగీ వెళ్లిపోతారు. మరోవైపు ఘోర పూజలు చేస్తుంటాడు. ఇంతలో ఘోరకు పూజలో ఆరు ఆస్తికలు నదిలో కలిపినట్టు కనిపిస్తుంది. వెంటనే ఘోర తన గురువును పిలిచి ఏం జరుగుతుందని అడుగుతాడు. ఆత్మ ఆస్తికలు నదిలో కలిపితే నువ్వు చేసే పూజలు ఎందుకు పనికిరావని ఎప్పటికీ ఆత్మను బంధించలేవని చెప్పి వెళ్లిపోతాడు. అలా కానివ్వను అంటూ ఘోర పూజ మళ్లీ మొదలు పెడతాడు. మరోవైపు యముడు వచ్చి గుప్తను హెచ్చరిస్తాడు. ఈసారి ఎలాగైనా ఆ బాలికను మన లోకానికి తీసుకురా అని చెప్తాడు. గుప్త సరే అంటాడు. ఆరు గురించి తెలుసుకోవడానికి స్వామిజీ ఆశ్రమానికి వెళ్తాడు అమర్. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!