Nindu Noorella Saavasam Serial Today December 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరు త్వరలోనే భూలోకం విడిచిపెడుతుందన్న గుప్త - స్వామిజీని ఇంటికి పిలిపించిన నిర్మల
Nindu Noorella Saavasam Today Episode: నువ్విక ఈలోకం విడిచిపెట్టే టైం ఆసన్నమైందని.. ఆరుకు గుప్త చెప్పడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: హాస్పిటల్‌కు వెళ్లి బాబ్జీని చూసి ఇంటికి వస్తున్న మనోహరిని చూడగానే ఆరు కోపంగా తిడుతుంది. ఎవరో పిలిచినట్టు మను అలాగే నిలబడిపోతుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన ఆరు అసలు నువ్వు మనిషివేనా మిస్సమ్మనే చంపాలనుకుంటావా..? అంటూ నిలదీస్తుంది. కానీ ఆరు మాటలు మనోహరికి వినబడవు. అయినా ఆరు తన పక్కనే ఉందనుకుని మనోహరి ఏంటే దాన్ని చంపాలనుకున్నందుకు నా మీద నీకు కోపం వస్తుందా..? ఆ సారి దాన్ని ఎలాగైనా చంపేస్తాను. అమర్‌ను పెళ్లి చేసుకుంటాను అంటూ లోపలికి వెళ్తుంది మనోహరి. సోపాలో కూర్చున్న శివరాం ఏదో ఆలోచిస్తుంటాడు.
నిర్మల: ఏవండి ఏం ఆలోచిస్తున్నారు.
శివరాం: అమర్ గురించి, మిస్సమ్మ గురించి, పిల్లల గురించి ఆలోచిస్తున్నాను.
నిర్మల: ఇప్పుడు ఏం అయిందండి అందరూ క్షేమంగానే ఉన్నారు కదా..?
శివరాం: ఇప్పుడు ఉన్నారు కానీ నాకెందుకో ప్రమాదం వాళ్ల వెంటే తిరగుతుంది అనిపిస్తుంది. అరుంధతి చావు దగ్గర నుంచి ఇంట్లో ప్రతిసారి ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతూనే ఉంది.
నిర్మల: మీరు అనవసరంగా భయపడుతున్నారు అండి..
శివరాం: కానీ అదే ప్రమాదం మళ్లీ ఎదురైతే ప్రతిసారి అదృష్టం మనవైపే ఉంటుందని అనుకోలేం
నిర్మల: అయితే ఒకసారి స్వామిజీని పిలిపించి ఏవైనా దోషాలు ఉన్నాయేమో తెలుసుకుందాం
అని నిర్మల చెప్పగానే సరే నీ ఇష్టం అంటాడు శివరాం. అమర్ బాల్కనీలో కసరత్తు చేస్తుంటే కింద నుంచి ఆరుంధతి చూస్తుంది. పేపర్ తీసుకుని రాథోడ్, భాగీ వస్తారు. భాగీని చూసిన ఆరుంధతి కారు చాటుకు వెళ్లిపోతుంది.
రాథోడ్: ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడగానే కస్సు బుస్సు అనుకునే వారు ఇప్పుడేంటి ఇలా సైడు అయిపోతున్నారు. అంటే ఇద్దరి మధ్య కెమిస్ర్టీ మొదలైందా..? (అని మనసులో అనుకుంటాడు.)
భాగీ: ఏవండి డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమంటే మీరు ఇలా ఎక్సర్‌సైజ్ చేస్తున్నారేంటి..?
అమర్: డాక్టర్ గారు హ్యాండ్ ఎక్సర్ సైజ్ చేయమన్నారు
మను: బాగా చెప్పావు అమర్.. ఇవన్నీ మిస్సమ్మకు ఏం తెలుసు పప్పులో ఉప్పు వేయడం కూరలో కారం వేయడం లాంటివి అయితే బాగా తెలుసు. ఇందాక తెలిసిన డాక్టర్‌తో మాట్లాడాను అమర్ నీ గురించి చెప్పాను. తను కొన్ని ఎక్సర్ సైజులు చెప్పారు. నేను చూపిస్తాను నీకు
అంటూ మనోహరి అమర్‌ను రొమాంటిక్‌గా పట్టుకుంటుంది. అది చూసిన భాగీ పిచ్చ కోపంతో ఊగిపోతుంది.
రాథోడ్: నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఆవిడ ఇలాగే ఓవర్ చేస్తూ సార్‌ను ఎగేసుకుని పోతుంది వెళ్లు మిస్సమ్మ నువ్వు వెళ్లి విజృంభించు
భాగీ: మనోహరి గారు.. నీకు వచ్చింది చేయడం కాదు.. ఆయనకు నొప్పి రాకుండా చూడాలి. ఎక్సర్ సైజ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను.
అంటూ భాగీ కూడా అమర్‌కు రొమాంటిక్‌గా ఎక్సర్ సైజ్ చేయిస్తుంది. అది చూసిన మనోహరి కోపంగా భాగీని తిడుతుంది. ఇంతలో రాథోడ్ నవ్వుతూ ఏంటి మేడం ఎక్కడో ఏదో కాలినట్టు ఉంది అంటాడు. దీంతో మనోహరి రాథోడ్‌ను తిడుతుంది. కింద నుంచి అంతా గమనిస్తున్న ఆరు కోపంగా గార్డెన్‌లోకి వెళ్లి గుప్తను వెతుకుతుంది. దీంతో గుప్త నవ్వుతూ బాలిక నువ్వు రెండు దినములలో ఈ లోకాన్ని విడిచి వెళ్లెదవు అని హెచ్చరిస్తాడు. నా ఇష్టం లేకుండా నేను ఎలా వెళ్తాను అంటుంది ఆరుంధతి. ఇంతలో స్వామిజీ వస్తాడు. ఆయనకు ఆరు ఆత్మ కనిపిస్తుంది. ఆత్మను చూస్తూనే ఆయన లోపలికి వెళ్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















