Nindu Noorella Saavasam Serial Today December 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: మనోహరికి వార్నింగ్ ఇచ్చిన రామ్మూర్తి – ఆరు కోసం మంత్రం వేసిన చంభా
Nindu Noorella Saavasam serial Today Episode December 10th: ఊర్లో వాళ్లతో మంచిదానివి అనిపించుకున్నావా..? మనోహరి అంటూ రామ్మూర్తి వార్నింగ్ ఇస్తాడు దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంటికి వస్తున్న అతిథులకు స్వాగతం పలకడానికి రామ్మూర్తి ఇంటి గేటు దగ్గర నిలబడి ఉంటాడు. ఊర్లో మహిళలు కూడా ఫంక్షన్‌కు వస్తుంటారు. వాళ్లను చూసిన రామ్మూర్తి వాళ్లను పలకరిస్తాడు.
రామ్మూర్తి: ఏం కాంతమ్మా ఈశ్వరమ్మా మీరు కూడా ఇంత లేటుగా వస్తే ఎలా చెప్పండి..? మొత్తానికి వచ్చారు చాలా సంతోషంగా ఉందమ్మా
ఈశ్వరమ్మ: నిన్న అమ్మాయి ఇంటికి వచ్చి అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటామండి..?
మనోహరి, చంభా షాక్
కాంతమ్మ: మేమే కాదు ఊరు ఊరంతా కదిలి వస్తుంది.
రామ్మూర్తి: ( మనసులో) వీళ్లు చెప్తుంది మనోహరి గురించేనా..?
కాంతమ్మ: అంత బాగా పిలిచింది అమ్మాయి
ఈశ్వరమ్మ: పిలుపంటే అలా ఉండాలి. అంత పద్దతి గల అమ్మాయిని మేము ఎప్పుడూ చూడలేదు..
రామ్మూర్తి: మీరు చెప్తుంది నిన్న ఇంటికి వచ్చి పిలిచిన అమ్మాయి గురించేనా…?
ఈశ్వరమ్మ: ఆ అమ్మాయి గురించే అండి.. నువ్వు ఎవరమ్మా అని అడిగితే నీ పెద్ద కూతురు లాంటి దాన్ని అని చెప్పింది
రామ్మూర్తి: (మనోహరికి ఇంత మంచి బుద్ది ఎలా వచ్చిందబ్బా.. అని మనసులో అనుకుంటాడు.) సరే సరే వెళ్లండమ్మా వెళ్లి లోపల కూర్చోండి.. సీమంతం మొదలవుతుంది
రామ్మూర్తి: మంగళ ఒసేయ్ మంగళ ఇటురా..
మంగళ: ఏంటండి.. ఎందుకు పిలిచారు..
రామ్మూర్తి: అక్కడేం చేస్తున్నావు..లోపలికి వెళ్లి వచ్చిన వాళ్లకు ఏం కావాలో చూడు..
మంగళ: అదే పనిలో ఉన్నాను.
రామ్మూర్తి: అయితే వెళ్లు
రామ్మూర్తి అక్కడే నిలబడి అతిథులకు స్వాగతం పలుకుతుంటాడు… ఈశ్వరమ్మ మాటలు గుర్తు చేసుకుని దూరంగా తననే గమనిస్తున్న మనోహరి దగ్గరకు వెళ్తాడు.
రామ్మూర్తి: ఏమ్మా మనోహరి నీ పిలుపు బాగుందని ఊరంతా తెగ మెచ్చుకుంటున్నారు.. అంత బాగా పిలిచావా ఏంటి..?
మను: మరి ఏమనుకుంటున్నారు బాబాయ్ గారు నా మంచితనం మీ ఊరందరికీ అర్థం అయిపోయింది. ఒక్క మీకు తప్ప..
రామ్మూర్తి: బలే దానివే.. నీ సంగతి నాకు తెలియదా..? నటించడంలో నీ తర్వాతే ఎవరైనా నీ నటనకు మా అరుంధతే పడిపోయిందట.. మా ఊరి వాళ్లు ఇంకెంత..? మొత్తానికి మా అల్లుడి గారిని కూడా మాయ చేసేస్తున్నావు..
మను: నిన్న నన్ను పిలుపునకు వెళ్లమని చెప్పింది మీరే..ఇప్పుడు మీరే నన్ను దెప్పిపొడుస్తున్నారా.?
రామ్మూర్తి: నిజం ఒప్పుకోవాలి కదమ్మా.. ఏ మాటకు ఆ మాట నీ పిలుపుతో మా ఊరి వాళ్లందరినీ మెప్పించి ఇంత మందిని సీమంతానికి రప్పించావు అంటే నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే అయ్యుంటుంది అమ్మ.. సీమంతం అయ్యాక నీకొక మంచి చీర పెడతా..
అంటూ రామ్మూర్తి వెళ్లిపోగానే.. చంభా కోపంగా..
చంభా: ముసలోడు ఏంటి..? చాలా వెటకారాలు ఆడుతున్నాడు..? నీ గురించి బాగా అర్తం చేసుకున్నట్టు ఉన్నాడు
మను: ఈ వెటకారాలు అన్ని కాసేపటి వరకే ఆ తర్వాత అందరూ పీసు పీసు అయి కాలి బూదిదై పోతారు
చంభా: మళ్లీ చెప్తున్నాను మనోహరి ఒక్క భాగీ కోసం ఇంత మందిని చంపడం అవసరమా..?
మను: నాకు కావాల్సింది అమర్ మాత్రమే.. మిగతా వాళ్లు ఎలా చచ్చినా నాకు అనవసరం.. అంతా చచ్చి పైన అరుంధతి దగ్గరకు వెళ్లి ముచ్చట్లు పెట్టుకుంటారు.
చంభా: అరుంధతి పైన లేదు కిందే ఉంది. నిన్న ఊరందరినీ పిలిచింది తనైతే పొగడ్తలేమో నీకు వచ్చాయి..
అని చంభా అనగానే.. అవును ఇంతకీ ఆ అరుంధతి ఇక్కడే ఉందా ఏంటి.? అని మనోహరి అడగ్గానే.. ఉండు చూస్తాను అంటూ చంభా మంత్రం చదువుతూ కళ్లు మూసుకుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















