Nindu Noorella Saavasam Serial Today August 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ముంగిసలా మారిన ఆరు – కాలాతో ఫైట్ చేసిన ముంగిస
Nindu Noorella Saavasam serial Today Episode August 6th: చంభా పంపిన కాలాను అడ్డుకునేందుకు ఆరు ముంగిసలా మారిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: బిజినెస్ చేసుకోవడానికి వినోద్‌కు అమర్ డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు తీసుకుని వెళ్లి చిత్ర రూంలో కూర్చుని కౌంట్ చేసుకుంటుంది. ఇంతలో అక్కడకు మనోహరి వస్తుంది.
మను: ఓసేయ్ నువ్వు మరీ ఇంత అల్పసంతోషివి ఏంటే.. ఈ మాత్రం దానికే అంతలా మురిసిపోవాలా..?
చిత్ర: అంటే నేను ఇంత డబ్బును ఎప్పుడూ చూడలేదు మను
మను: ఆ డబ్బును చూసి మురిసిపోవడం కాదు చిత్ర. నువ్వు ఇక్కడి వరకు రావాలన్నా..? ఆ డబ్బు నీకు చేరాలన్నా నా హెల్ప్ నీకు ఉంది. దాంతో పాటు నాతో నువ్వు చాలా పనులు చేయించుకున్నావు. కొంచెం నా గురించి కూడా పట్టించుకో.. ఏంటే సైలెంట్‌గా ఉన్నావు.. ఎంత సేపు డబ్బు గురించి నీ గురించే కాదు నా గురించి కూడా కొంచెం ఆలోచించు.
చిత్ర: ఏంటి మను నీ సంగతి నువ్వు బాగానే చూసుకుంటావు కదా..? కోల్‌కతా మీద చంభాను కూడా దించావు. నీ ప్రయత్నం నువ్వు చేసుకో నా మీద ఈ డబ్బ మీద మాత్రం కాంసట్రేషన్ చేయకు. అర్థం అయింది అనుకుంటా..?
మను: ఏంటో డబ్బును చూడగానే నీ బుద్ది చూపిస్తున్నావా..? నా పాటికి నన్ను వదిలేసి నీ లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నావా..?
చిత్రను వినోద్ పిలుస్తాడు. చిత్ర వెళ్లిపోతుంది. అందరూ డిన్నర్ చేస్తుంటే అమర్ బిజినెస్ గురించి అడుగుతాడు.
అమర్: వినోద్ టెక్సటైల్ బిజినెస్ పెట్టడానికి షోరూమ్ ఎక్కడ దొరికింది..?
వినోద్: మేయిన్ రోడ్డులోనే ఒక షోరూమ్ దొరికింది అన్నయ్య
చిత్ర: బావగారు మంచి సెంటర్‌లోనే షోరూం దొరికింది. పెద్దగా పబ్లిషిటీ ఇవ్వకుండానే కస్టమర్స్ వచ్చేస్తారు.
అమర్: కొత్తగా బిజినెస్ పెడుతున్నారు కాస్త వెనకా ముందు చూసుకోండి. ఎక్సీపీరియన్స్ ఉన్న స్టాప్‌ను తీసుకోండి.
చిత్ర: అయ్యో బావగారు ఈ బిజినెస్‌లో బొటిక్ విషయాల్లో నాకు చాలా అనుభవం ఉంది
మను: (మనసులో) ఇది చాలా ఓవర్ చేస్తుంది చెప్తా..
అమర్: నీకు మరీ అవసరం అయితే భాగీ నీకు తోడుగా ఉంటుంది. తన హెల్ప్ తీసుకో..
చిత్ర: అయ్యో బావగారు మళ్లీ తనకెందుకు బావగారు శ్రమ మేము చూసుకుంటాము కదా..?
అమర్: పర్వాలేదు తను ఫ్రీగానే ఉంటుంది.
చిత్ర: అయ్యో బావగారు తనకు ఫ్రీ టైం ఎక్కడుంది చెప్పండి మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవడంలోనే టైం సరిపోతుంది కదా
అమర్: మీకోసం తను ఫ్రీ టైం చూసుకుంటుంది చిత్ర
చిత్ర: వద్దులేండి బావగారు
భాగీ: ఏవండి వద్దులేండి.. చిత్రకు అనుభవం ఉంది అంటుంది కదా తను చూసుకుంటుంది.
మను: అమర్ అంతగా కావాలంటే చిత్రకు నేను హెల్ఫ్ గా ఉంటాను ఏమంటావు చిత్ర
చిత్ర: అయ్యో మను నువ్వు మాత్రం ఎందుకు చెప్పు.. వేరే పనుల్లో బిజీగా ఉంటావు కదా..?
మను: (మనసులో) దీనికి బాగా పొగరెక్కింది డబ్బులు చేతిలో పడగానే నన్నే అవైడ్ చేస్తుంది
అమర్: సరే అయితే బిజినెస్ జాగ్రత్తగా చూసుకోండి
చిత్ర: బావగారు మీరిచ్చిన డబ్బుకు నేను హడ్రెండ్ పర్సెంట్ న్యాయం చేస్తాను. మీరు చూస్తూ ఉండండి ఒక్క షోరూంతో స్టార్ట్ చేసి సిటీ అంతా బ్రాంచెస్ ఓపెన్ చేస్తాను.
అంటూ చిత్ర చెప్పగానే ఓవర్ కాన్పిడెంట్ పనికిరాదు చిత్ర అని మనోహరి చెప్తుంది. ఇది ఓవర్ కాన్పిడెంట్ కాదు మను నా మీద నాకున్న నమ్మకం. నమ్మకం లేకపోతే బిజినెస్ చేయలేం అంటుంది చిత్ర. తర్వాత అమర్ ఇంట్లోకి వచ్చి కాలాను ఎలాగైనా అడ్డుకోవాలని ఆరు ఆలోచిస్తుంది. వెంటనే గుప్త తనకు ఇచ్చిన శక్తులు గుర్తుకువచ్చి గుప్త దగ్గరకు వెళ్లి మీరు నాకిచ్చిన శక్తులు ఉపయోగించి ఆ కాలాను ఇంట్లోంచి తరిమేస్తానని చెప్తుంది. ఎలా చేస్తావని గుప్త అడగ్గానే.. అది పాము రూపంలో వస్తే.. నేను ముంగిస రూపంలో వెళ్తానని చెప్పి ఆరు ముంగిస రూపంలోకి మారుతుంది. ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















