Nindu Noorella Saavasam Serial Today April 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: భాగీకి స్పాట్ పెట్టిన మను – అంజును లోయలోకి తోసేయాలనుకున్న మను
Nindu Noorella Saavasam Today Episode: అంజును లోయలోకి తోసేసి భాగీని చంపేయాలనుకుంటుంది మనోహరి. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: మగాడిలా గొంతు మార్చి వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి చిత్ర, మనోహరిని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడిని పట్టుకోవాలని బాబ్జీతో కలిసి మనోహరి ప్లాన్ చేస్తుంది. ముందు చిత్ర మీద డౌట్ వచ్చి చిత్రకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడుగుతుంది. హైదరాబాద్‌లో ఉన్నానని చిత్ర అబద్దం చెప్తుంది. తన మీద మనోహరికి డౌట్ వచ్చినట్టు ఉందని వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తుంది. మనోహరి లిఫ్ట్ చేస్తుంది.
చిత్ర: నేను అడిగింది ఏం చేశావు
మనోహరి: నువ్వు చెప్పిన చోటికి వచ్చాను డబ్బు ఎక్కడ పెట్టాలి
చిత్ర: అక్కడ ఉన్న డస్ట్ బిన్‌లో పెట్టి వెళ్లిపో
మనోహరి: బాబ్జీ నేను అక్కడ డస్ట్ బిన్‌లో డబ్బులు పెట్టి వెళ్లిపోతాను. నువ్వు ఇక్కడే ఒక దగ్గర పేపర్ చదువుతూ ఏమీ తెలియనట్టు కూర్చొని వాడెవడో చూడు
బాబ్జీ: సరే మేడం
మనోహరి: ఇవాళ్టీతో వాడి పని ముగించేద్దాం
బాబ్జీ వెళ్లి దూరంగా ఉన్న బెంచీ మీద పడుకుని పేపర్ చదువుతున్నట్టు ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన చిత్ర ప్లాన్ ప్రొసీడ్ అని మనోహరికి మెసేజ్ చేస్తుంది. మనోహరి డబ్బులు పెట్టి వెళ్లిపోతుంది. చిత్ర అక్కడకు రావడం చూసిన బాబ్జీ ఆశ్చర్యపోతాడు.
బాబ్జీ: దేవుడా నా కోసమే ఈ అమ్మాయిని ఇక్కడకు పంపావా..? వస్తున్నా బంగారం వచ్చేస్తున్నా.. హలో మేడం
చిత్ర: వీడేంటి ఇక్కడ ఉన్నాడు.
బాబ్జీ: హలో అండి మీరు ఇక్కడేం చేస్తున్నారు
చిత్ర: మిమ్మల్ని లోకేషన్ అడిగాను కదా చూడటానికి వచ్చాను. ఇదిగో ఈ టిన్ డస్ట్‌బిన్ లో పడేద్దామని వెళ్తున్నాను. ఇంతలో మీరు వచ్చారు. సరే గానీ మీరు ఇక్కడేం చేస్తున్నారు
బాబ్జీ: నేను కూడా లోకేషన్ చూడ్డానికే వచ్చాను.
చిత్ర: లోకేషన్ చాలా బాగుంది కదండి
బాబ్జీ: అవును సూపర్ గా ఉంది
ఇద్దరూ మాట్లాడుకుంటుంటే... ఇంతలో చిత్తు కాగితాలు ఏరుకునే వాడు వెళ్లి మనోహరి పెట్టిన డబ్బులు తీసుకుని వెళ్లిపోతాడు. చిత్ర అంతా గమనిస్తుంది.
చిత్ర: మీకు ఇక్కడ ఏం పని లేదా
బాబ్జీ: నాకు ఏం పని లేదండి.. మీకు ఏదైనా పని ఉంటే చెప్పండి
చిత్ర: ఏమీ వద్దులే నాకు పనుంది వెళ్తాను
చిత్ర వెళ్లగానే బాబ్జీ డస్ట్ బిన్ దగ్గర వెళ్లి చూస్తే డబ్బులు కనిపించవు వెంటనే మనోహరికి కాల్ చేస్తాడు.
మనోహరి: ఏయ్ వాడెవడో తెలిసిందా ..? పట్టుకున్నావా..?
బాబ్జీ: లేదు మేడం నేను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే.. వాడెవడో వచ్చి డబ్బులు పట్టుకెళ్లాడు
మనోహరి: ఏయ్ అమ్మాయి ఎవర్రా..?
బాబ్జీ: అదే మేడం నాకు హోటల్ లో పరిచయం అయింది అని చెప్పాను కదా ఆ అమ్మాయి. నేను చెప్పిన లోకేషన్ చూడ్డానికి వచ్చింది
మనోహరి: రేయ్ బుర్ర తక్కువ వెధవ నేను చెప్పిన పని ఏంటి..?నువ్వు చేసిన పనేంటి..? బ్లాక్ మెయిల్ చేస్తున్న వాణ్ని పట్టుకోరా అంటే అమ్మాయితో మాట్లాడుతూ కూర్చున్నావా..?
బాబ్జీ: సారీ మేడం వాడు ఎక్కువ దూరం వెళ్లి ఉండడు.. ఇక్కడున్న అందరినీ చెక్ చేస్తా..? ఎవడో కనిపెడతా
మనోహరి: చేసిన ఘనకార్యం చాలు వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు దాన్ని చంపడానికి అన్ని రెడీ చేసుకో
బాబ్జీ: అలాగే మేడం
అని చెప్పి బాబ్జీ వెళ్లిపోతాడు. చిత్ర చెత్త ఏరుకునే వాడి దగ్గరకు వెళ్లి డబ్బులు తీసుకుంటుంది. ముందే తను వాడికి బిర్యాని ఇచ్చి అక్కడి డబ్బులు తీసుకురమ్మని చెప్పిన విషయం గుర్తు చేసుకుంటుంది చిత్ర. తర్వాత పిల్లలను అడ్డు పెట్టుకుని భాగీని చంపేయాలని మనోహరి ప్లాన్ చేస్తుంది. అందుకోసం అంజును లోయలోకి తోసేయాలని అనుకుంటుంది. వెంటనే పిల్లల దగ్గరకు వెళ్లి కళ్లకు గంతలు కట్టుకునే గేమ్ అడుతుంది. అంజు లోయలో పడేలా చేస్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















