అన్వేషించండి

Nindu Noorella Savasam October 19: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మిస్సమ్మ మీద కోపంతో రగిలిపోతున్న మనోహరి - పనిమనిషి నీలాతో ప్రేమలో పడ్డ చిత్రగుప్తుడు!

మిస్సమ్మ చేసే పనులకు అమర్ ఇంప్రెస్స్ అవుతుండటంతో కథలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

Nindu Noorella Savasam, October 19, ఈరోజు ఎపిసోడ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళ మనసులో మాటని చెప్పలేకపోతున్నారు అని మిస్సమ్మ అమర్ తో అంటుంది..

ఆ మాటలకి ఆలోచనలో పడతాడు అమర్.

అమర్: ఓ నిర్ణయానికి వచ్చి రేపు స్కూలుకు వెళ్లి టీసీలు తీసుకువచ్చేయ్, వేరే స్కూల్లో జాయిన్ చేద్దాం అని రాథోడ్ కి చెప్తాడు.

మిస్సమ్మ: పిల్లలకి మంచి స్కూల్ కూడా చూశాను, మన వీధిలోనే ఉంది. వాళ్లు చల్లారిపోయిన భోజనాలు చేయక్కర్లేదు, స్టడీస్ కూడా చాలా బాగున్నాయి అని చెప్తుంది.

అమర్ పిల్లల్ని ఆ స్కూల్లోనే జాయిన్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

అమర్ పేరెంట్స్: పిల్లలు అంత పొద్దున్నే లేస్తుంటే వాళ్ళ బాధ చూడలేకపోయే వాళ్ళం తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. వాళ్లని స్కూల్ మాన్పించి మంచి పని చేశావు.

ఆ మాటలకి కోపంతో పగిలిపోతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది మనోహరి.

నీల : మీరు పిల్లల్ని కష్టపడి ఆ స్కూల్లో జాయిన్ చేస్తే తను ఎంత సింపుల్గా స్కూల్ మాన్పించేసింది. ఒక దెబ్బతో అందరినీ తన వైపు తిప్పుకుంది. ఆట గట్టిగా ఉంది ఎవరు గెలుస్తారో చూడాలి అని మనోహరి తో అంటుంది.

మరోవైపు పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన ప్రాబ్లంని మిస్సమ్మ ఎంత సింపుల్గా సాల్వ్ చేసేసింది అంటూ ఆమె మీద ఇంప్రెస్ అవుతారు.

అమ్ము : తను మనకి ఫీవర్ చేసింది కదా తనని ఇక్కడే ఉండిపోయేలాగా చేద్దామా..

అమ్ము : ఈ మాట గట్టిగా అనకు, మనం మిస్సమ్మ చేసే పనులకు ఇంప్రెస్ అవుతున్నాం అంటే ఆమె ముందు మనం ఓడిపోయినట్లుగా అవుతుంది.

మిగిలిన ఇద్దరూ కూడా అంజుకి సపోర్ట్ చేస్తారు. మనం మిస్సమ్మ కి ఇంప్రెస్స్ అయినట్లు తెలియకూడదు. ఈ ఒక్కసారికి ఈ పొట్టి దాన్ని ఫాలో అయిపోదాం అని చెప్పి అమ్ముని కూడా ఒప్పిస్తారు.

ఇదంతా చూస్తున్న మనోహరి ఒక మాటతో అందరినీ తన వైపు తిప్పుకుంటుంది అలా జరగనివ్వును అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు..

మిస్సమ్మ : లోపల ఏంటి అంత స్ట్రాంగ్ గా మాట్లాడేశావు,నీ మాటలకి ఆయన ఎదురు చెప్పలేకపోయారు. పిల్లల్ని స్కూల్ మాన్పించేసి మంచి పని చేశావు.

మనోహరి : అంత దూరం వెళ్తున్నారు కదా అదేమైనా మంచి స్కూలా అంటే అది కాదు అందుకే అలా చెప్పాను.

అరుంధతి: కేర్ టేకర్ గా జాయిన్ అయిన వెంటనే పిల్లల గురించి కేర్ తీసుకున్నావు నువ్వు నిజంగా గ్రేట్.

మిస్సమ్మ : ఇందులో గొప్ప ఏముంది నా పని నేను పర్ఫెక్ట్ గా చేశాను, ఇంతకు ముందు చేసే ప్రోగ్రామ్లు కూడా అలాగే చేసేదాన్ని.

అరుంధతి: ఇంతకుముందు ఏం చేసేదానివి.

మిస్సమ్మ : చెప్పుకొని ఆనందించే అంత గొప్ప జ్ఞాపకాలని నా గతం ఇవ్వలేదు.

ఈలోపు దొంగలాగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు చిత్రగుప్తుడు. అది చూసిన అరుంధతి, మిస్సమ్మ ఇద్దరు కంగారు పడతారు. మిస్సమ్మ తెలిసినా తెలియనట్లుగా ఉండిపోతుంది.

మిస్సమ్మ: వాడిని చూసినా చూడనట్లు మాట్లాడుకుందాము. అప్పుడు వచ్చినది దొంగో కాదో తెలుస్తుంది.

చిత్రగుప్తుడు ఇదంతా దూరం నుంచి చూస్తాడు. మిస్సమ్మ తనని చూసినా ఏమీ రియాక్ట్ కాకపోవడంతో తను ఎవరికీ కనిపించట్లేదు అనుకొని అరుంధతి దగ్గరికి వచ్చి పిలుస్తాడు. వెంటనే మిస్సమ్మ రియాక్ట్ అవుతుంది. అంటే నేను అందరికీ కనిపిస్తున్నానన్నమాట అనుకుంటాడు.

అరుంధతి: చిత్రగుప్తుడి నుంచి తప్పించుకోవటం కోసం దొంగ దొంగ అని అరుస్తుంది. ఆ కేకలకి పరుగెత్తుకుంటూ వస్తాడు రాథోడ్

రాథోడ్: చిత్రగుప్తుడిని చూసి నువ్వు మళ్ళీ మారువేషంలో వచ్చావా అని కోప్పడతాడు.

చిత్రగుప్తుడు : నేను చోరుడుని కాదు.

మిస్సమ్మ: దొంగవి కాకపోతే ఎందుకు మా అక్కని బాలిక అని పిలిచావు.

రాథోడ్: అక్క, ఎవరావిడ, ఎక్కడుంది

మిస్సమ్మ: పక్కింటి ఆవిడ ఇంతసేపు ఇక్కడే ఉండేది. ఇతన్ని చూసి భయపడి పోయి పారిపోయి ఉంటుంది.

రాథోడ్: ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో.

చిత్రగుప్తుడు: నా అంగుళీకము దక్కించుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి.

ఇంతలో నీల పని చేసుకుంటూ బయటికి వస్తుంది ఆమెను చూసిన చిత్రగుప్తుడు నేను పని చేస్తాను అంటాడు.

ఇంట్లో ఉన్న వాళ్ళకే పని లేదు ఇంక నువ్వేం చేస్తావు.

నీల:పెద్దమ్మ గారు తోటమాలి కావాలని చెప్పారు ఈయన చేస్తారేమో అడుగు.

రాథోడ్: అవును నాకు కూడా చెప్పారు అని చెప్పి చిత్రగుప్తులతో మాట్లాడి అతనిని పనిలో పెట్టుకుంటాడు రాథోడ్. తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

నీల: మీకు ఏమైనా కావాలంటే నన్నే అడగండి అంటూ చిత్రగుప్తుడిని ఓరగా చూస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమెనే చూస్తూ ఉండిపోతాడు చిత్రగుప్తుడు.

అరుంధతి: అప్పుడే అక్కడికి వచ్చి ఏంటి మిస్టర్ గుప్తా లవ్వా..

చిత్రగుప్తుడు: నీవల్ల నేను ఎన్ని అగచాట్లు పడుతున్నానో తెలుసా, నీతో స్నేహం చేసినందుకు నాకు ఇలా జరగాల్సిందే.

అరుంధతి: మీరు ఇక్కడ పని చేయటం యమపురి వాసులు చూస్తే మీకు ప్రాబ్లం అవ్వదా..

చిత్రగుప్తుడు: నా అంగుళీకము తిరిగి తీసుకోవాలని కదా.

ఒకసారి గా షాక్ అవుతుంది అరుంధతి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్‌ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
Bachhala Malli Twitter Review - బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ: మిక్స్డ్ టాక్ వచ్చిందేంటి? నరేష్ యాక్టింగ్ అదరగొట్టినా కష్టమేనా?
Viduthalai 2 Twitter Review - విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
విడుదల 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... నేషనల్ అవార్డు గ్యారెంటీ - విజయ్ సేతుపతి సినిమా టాక్ ఏమిటంటే?
Bangladesh China Frienship: బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
బంగ్లాదేశ్‌కు అత్యాధునిక యుద్ధవిమానాలు అమ్ముతున్న చైనా - ఇండియాపై భారీ కుట్రకు సిద్ధమవుతున్న పొరుగుదేశం !?
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Today Weather Report: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం- తెలంగాణలో తగ్గేదేలే అంటున్న చలిపులి
Embed widget