అన్వేషించండి

Nindu Noorella Savasam October 14: మనోహరి నిజస్వరూపం బయటపెట్టిన మిస్సమ్మ.. పోలీసులకు పిచ్చెక్కించిన చిత్రగుప్తుడు!

మిస్సమ్మకి మనోహరి నిజస్వరూపం తెలియడంతో కధ మంచి రసవత్తరంగా మారింది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

Nindu Noorella Savasam, October 14 : ఈరోజు ఎపిసోడ్​లో అంజు మాట్లాడుతూ.. మనోహరి ఆంటీకి ఏమైంది, రాత్రి తిన్న డిన్నర్ ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా..

నీల : కంగారుగా దీనికి నాకు సంబంధం ఏమీ లేదు.

అంజు: మనోహరి ఆంటీ కి ఏమైనా జరిగితే, నిన్న లాగ 11 రోజుల ప్రోగ్రాం చేస్తారా..

మిస్సమ్మ: తప్పమ్మ, అలా మాట్లాడకూడదు.

నీల: ఇంకా మనోహరి అమ్మగారు బ్రతికే ఉన్నారు.

అంజు : అయితే ఈరోజు స్కూల్ కి వెళ్ళక్కర్లేదు కదా..

నీల: ఎందుకు వెళ్ళక్కర్లేదు?

మళ్లీ ఏమైనా అయితే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేస్తారు.. అంజుని పక్కకు తీసుకువెళ్లి ఎందుకు స్కూల్ డుమ్మా కొట్టించాలని చేస్తున్నావ్ అంటారు మిగతా ముగ్గురు.

అంజు : అందుకే బుర్రవాడమనేది, మనం స్కూల్ మానేస్తే డాడీ ముందు మిస్సమ్మ బుక్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళని ఒప్పిస్తుంది. ఆ తర్వాత మిస్సమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి మనోహరీ ఇంటికి బాగైంది అని తెలిసిన వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది.

నీల : అమరేంద్ర గారికి నిజం తెలియకుండా చూడు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది.

మరోవైపు మనోహరికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. మరోవైపు మిస్సమ్మ మనోహరి రూమ్​కి వెళ్తుంది. రూమ్​లో అంతా వెతికితే ఆమెకి పాయిజన్ బాటిల్ దొరుకుతుంది.

నీల: ఈవిడెంటి ఆ రూమ్ లోకి వెళుతుంది అనుకుంటూ చీపురు పట్టుకొని తను కూడా రూమ్ లోకి వెళుతుంది.

మిస్సమ్మ చేతిలో బాటిల్ చూసి పొద్దున్న సరిగ్గా క్లీన్ చేయలేనట్టు ఉందమ్మ, ఇటు ఇవ్వండి పారేస్తాను అంటుంది.

మిస్సమ్మ : నువ్వు రూమ్ క్లీన్ చెయ్యు ఈ బాటిల్ మాత్రం నా దగ్గర ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చేసరికి మనోహరి విషం తాగిందంట కదా ఏం జరిగింది అని అడుగుతుంది అరుంధతి.

మిస్సమ్మ : అప్పుడే ఈ విషయం మీ వరకు వచ్చిందా..

అరుంధతి: పొరుగింటి వాళ్ళమే కదా, అయినా ఏం జరిగిందో చెప్పు.

మిస్సమ్మ : మనోహరి గారు విషం తాగితే అమరేంద్ర గారు హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు అంటూ ఆలోచనలో పడుతుంది.

అరుంధతి: ఏంటా ఆలోచిస్తున్నావ్, తనకి ఏమీ కాదులే.

మిస్సమ్మ: నాకు తెలుసు, తను తీసుకున్నది సీరియస్ పాయిజన్ కాదు. త్రీ అవర్స్ లో వామిటింగ్ చేసేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆమె చనిపోవాలని పాయిజన్ తీసుకోలేదు అని కళ్లకు కట్టినట్లు చెప్తుంది మిస్సమ్మ.

మనోహరి : అందరూ లేచారు కదా, నేను చెప్పినట్లు చెయ్యి.

నీల: అలాగే చేస్తాను, కానీ నాకు భయంగా ఉందమ్మా.

మనోహరి : ఏం భయపడకు, ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు నేను పాయిజన్ తాగిన వెంటనే ఇంట్లో వాళ్ళందరినీ పిలువు అంటుంది.

మరోవైపు హాస్పిటల్​లో మనోహరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు అమర్ దగ్గరికి వచ్చి ఏమి పర్వాలేదు విషం మొత్తం కక్కించేసాము కాసేపట్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తారు.

మిస్సమ్మ : ఇలా జరుగుతుందని మనోహరికి కూడా తెలుసు.

అరుంధతి: అంత కన్ఫామ్​గా ఎలా చెప్తున్నావ్.

మిస్సమ్మ : ఎవరైనా చనిపోవటానికి సిద్ధపడితే, ఎవరు చూడకుండా అందరూ పడుకున్నాక చేసుకుంటారు. కానీ ఈవిడ మాత్రం అందరూ లేచాక పాయిజన్ తీసుకుంది. అంటే ఈవిడ సింపతి కోసమో మరొక విషయం కోసమో ఆ పాయిజన్ తీసుకుంది ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి.

అరుంధతి: మీ మేడం గారికి చెడ్డపేరు వస్తుంది, ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ చెప్పకు, నాలుగు రోజుల్లో ఉండి వెళ్ళిపోతుంది, ఆవిడ సంగతి మనకెందుకు అంటూ పని ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు అమర్ పేరెంట్స్ మనోహరి కోసం కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అమర్ ఫోన్ చేసి మనోహర్ కి ఏమి కాలేదని, కాసేపట్లో ఇంటికి వచ్చేస్తామని చెప్తాడు. దాంతో ఇంట్లో అందరూ రిలాక్స్ అవుతారు. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్న చిత్రగుప్తుడిని ఆ గేటు ఎందుకు దూకాలి అనుకున్నావ్ అసలు మీరు ఏ గ్రూప్ కి చెందినవారు అని అడుగుతాడు పోలీస్.

చిత్రగుప్తుడు : నేను విచిత్ర చిత్రగుప్తుడిని, మాది యమపురి. ఆ దేశ రక్షకభటుడి ఇంట్లో ఒక ఆత్మ ఉంది. ఆమె వద్ద నా ఉంగరం ఉండిపోయింది. ఆ అంగూళ్యకం నాకు ఇప్పిస్తే నేను మా యమపురి పోయెదను అంటాడు.

వాడి మాటలకి పిచ్చెక్కిపోతాడు పోలీసు, వీడిని అర్జెంటుగా నా ముందు నుంచి తీసుకు వెళ్ళిపోమ్మని కానిస్టేబుల్​కి ఆర్డర్ వేస్తాడు. తర్వాత మళ్లీ అతని దగ్గర ఉన్న మొత్తం బంగారం అంతా తీసేసుకో అని అంటాడు.

చిత్రగుప్తుడు: నా దగ్గర ఉన్న బంగారం అంతా తీసేసుకున్న పర్వాలేదు కానీ నాకు ఆ అంగూళ్యకం ఇప్పించండి.

ఆ మాటలకి పోలీసు మరింత ఫ్రస్టేట్ అవుతాడు.

మరోవైపు మనోహరి ఎందుకు ఇంత పని చేసింది అని అరుంధతి ఆలోచనలో ఉండగానే మనోహరిని తీసుకొని ఇంటికి వస్తారు అమర్ వాళ్ళు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget