అన్వేషించండి
Nindu Manasulu Serial Today November 1st: నిండు మనసులు: అన్న తిక్క కుదిర్చిన ప్రేరణ! డబ్బున్నోడిని పట్టేశావని గణ నిందలు! ఐశ్వర్య దీపావళి ప్లాన్ ఏంటి?
Nindu Manasulu Serial Today Episode November 1st గణ, ప్రేరణ అందరూ ఒక్క చోట ఉండటం గణ ప్రేరణతో బాగా డబ్బున్నోడిని పట్టేశావని ప్రేరణని అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

నిండు మనసులు సీరియల్ టుడే ఎపిసోడ్
Source : https://www.hotstar.com/
Nindu Manasulu Serial Today Episode సిద్ధూ కోపం చూసిన మినిస్టర్ ఏం చేశావ్ అయ్యా కుర్రాడు అంత కోపంగా ఉన్నాడు అని గణని అడుగుతాడు. దానికి గణ ఏం లేదు సార్ ఒక్కోసారి డ్యూటీ కూడా డౌట్‌ని క్రియేట్ చేస్తుంది. అక్రమం కూడా సక్రమం అయిపోతుంది. అస్సలు పొంతనే ఉండదు అని ప్రేరణని ఉద్దేశించి అంటాడు. ప్రేరణ, సిద్ధూ ఇద్దరూ గణని కోపంగా చూస్తారు.
మినిస్టర్ గణని లోపలికి రమ్మంటే వద్దు సార్ నేను వెళ్తా అని గణ అంటాడు. దాంతో విజయానంద్, సాహితి గణని లోపలికి పిలుస్తారు. గణ వెళ్లిపోతా అంటే పిలవని పేరంటానికి వచ్చావ్ మాతో కలిసి భోజనం చేయవయ్యా మళ్లీ నీకు ఇలాంటి ఛాన్స్ రాదు అని మినిస్టర్ అంటే గణ మనసులో వెధవ అని తిట్టుకుంటాడు. అదృష్టం కలిసి వస్తే మళ్లీ మళ్లీ తినే అవకాశం వస్తుంది అంటాడు గణ. విజయానంద్ గణికి స్వీట్ తినమంటే మంజుల సాహితిని తీసుకురమ్మని చెప్తుంది. సాహితి వెళ్తుంది. సాహితిని గణ చూడటం సిద్ధూ చూస్తాడు.
ఐశ్వర్య కోసం ఇందిర టపాసులు తీసుకొస్తుంది. అన్నీ సౌండ్ రాని చిన్న చిన్న టపాసులు తీసుకొస్తుంది. ఇవేంటి అమ్మ నేను ఎల్‌కేజీ పిల్లని అనుకున్నావా ఇలాంటివి తీసుకొచ్చావ్ అని అంటుంది. రంజిత్ బాబుకి సౌండ్ పడదు కదా అందుకే ఇలా చిన్నవి కాల్చకో అని అంటుంది. రంజిత్ అక్కడే ఉండటం చూసి ఐశ్వర్య వెళ్లి మీ వల్ల మా అమ్మ నాకు ఇలా పిల్లా పిచ్చులవి కొంటుంది అని అంటుంది. పెద్దవే కొనుక్కోవాల్సింది అని రంజిత్ అంటాడు. దీపావళి రోజు నచ్చిన క్రాకర్స్ కూడా కొనే అదృష్టం లేదా అని అంటుంది. నీకు నచ్చినవి కొనుక్కో కావాలి అంటే నేను డబ్బులిస్తా అని రంజిత్ అంటాడు. ఐశ్వర్య చాలా హ్యాపీ అయిపోతుంది. మీరు కూడా రండి ఓనర్ గారు అంటే కాఫీ తాగి వస్తా అని రంజిత్ అంటాడు.
గణ బయట ఉంటే సాహితి స్వీట్స్ తీసుకెళ్లి ఇస్తుంది. మీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చింది అని సాహితి అంటుంది. గణ సాహితి గారు థ్యాంక్యూ అంటే గారు అనొద్దు సాహితి అంటే చాలు అంటుంది. ఇప్పుడేనా ఎప్పుడైనానా అని గణ అడుగుతాడు. మీ ఇష్టం అని సాహితి అంటుంది. సాహితి నవ్వితే మీరు అలా నువ్వుతుంటే అని అంటాడు. ఏంటి అని సాహితి అంటే ఏం లేదు అంటాడు. మీలో ఏదో మ్యాజిక్ ఉందండి అని సాహితి వెళ్లిపోతుంది. వర్కౌట్ అయింది కానీ ఇంకా డోస్ సరిపోలేదు అని అంటాడు.
రంజిత్ ఐశ్వర్యని తీసుకెళ్లి క్రాకర్స్ కొనిపిస్తాడు. మీరు క్రాకర్స్ కొనుక్కోవడానికి పర్మిషన్ ఇవ్వడమే ఎక్కువ పైగా మీరే కొనిచ్చారు ఎందుకు అంటుంది. సంవత్సరానికి ఒక్క సారే కదా పర్లేదు అని అంటాడు. బయట వెళ్లి కాల్చుకుంటా అని వద్దు అని రంజిత్ అంటాడు. అదేంటి సార్ అంటే క్రాకర్స్ కొనుక్కుంటా అన్నావ్ ఓకే అన్నాను కానీ నేను కాల్చడానికి పర్మిషన్ ఇవ్వలేదు.. సౌండ్ రావడానికి వీల్లేదు అని అంటాడు. ఇందిర నవ్వుకుంటుంది. ఐశ్వర్య మనసులో ఓరి దుర్మార్గుడా ఇంత ట్విస్ట్ ఇచ్చావేంట్రా అని అనుకుంటుంది. ఇందిర ఫుల్‌గా నువ్వుతుంది. ఐశ్వర్య బుంగ మూతి పెడుతుంది.
గణ దగ్గుతూ ఉంటే మినిస్టర్ నీరు తీసుకురమ్మని ప్రేరణకు చెప్తాడు. ప్రేరణ నీరు తీసుకొచ్చి గణకి ఇస్తుంది. మినిస్టర్ విజయానంద్, గణతో ఆ రోజు స్టేజ్ మీద మనకు గడ గడ నీరు తాగించింది ఈ రోజు సీఐగారికి తాగిస్తుంది అని అంటాడు. ఆ రోజు మీ నాన్న గారి గురించి అంత చెప్పావ్ కదామ్మా మీ నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు అని మినిస్టర్ అడుగుతారు. బ్రహ్మాండంగా ఉన్నారు సార్.. చాలా సెక్యూర్ ప్లేస్‌లో ఒక పనామె సేవలు చేస్తే మరో పనామె మందులు ఇస్తూ త్వరలోనే మా నాన్న క్యూర్ అవ్వడానికి తహతహలాడుతున్నారు అని అంటుంది. సంతోషం అమ్మా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మినిస్టర్ అంటాడు. గణ లేచి వెళ్లిపోతాడు.
మినిస్టర్ విజయానంద్‌తో వీడితో కొంచెం జాగ్రత్త అని చెప్తాడు. ఐశ్వర్య క్రాకర్స్ అని పెట్టి కాల్చడానికి రెడీ అయిపోతుంది. ఇందిర వచ్చి రంజిత్ బాబు వద్దు అన్నారు కదా ఎందుకు ఇలా చేస్తావే అని అంటుంది. ఐశ్వర్య ఫుల్‌గా డీజే పెడుతుంది. రంజిత్ వచ్చి ఏంటి సౌండ్ అంటే ఏం వినిపించనట్లు ఐశ్వర్య మాట్లాడుతుంది. రంజిత్ అంత సౌండ్ ఎందుకు అంటే డీజే ఆపేసి నేనేం చేశాను సార్ సౌండ్ రావడం లేదు కదా అని అంటుంది. పాటలు వినాలా క్రాకర్స్ కాల్చాలా అని ఐశ్వర్య విసిగించడంతో గంట మాత్రమే క్రాకర్స్ కాల్చు అని రంజిత్ పర్మిషన్ ఇస్తాడు. గణని చూసినందుకు ప్రేరణ చిరాకు పడుతుంటే గణ వచ్చి బాగా డబ్బున్నోడిని పట్టేశావ్ గ్రేట్ నువ్వు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
ఇంకా చదవండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం
Advertisement





















