Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు సీరియల్: నా మొగుడే నా మేనల్లుడా షాక్‌లో సుధాకర్, మామని బురిడీ కొట్టి అడ్రస్ పట్టేసిన ప్రేరణ!
Nindu Manasulu Serial Today Episode July 24th ఇందు తమ్ముడే సుధాకర్ అని ప్రేరణ వాళ్లకి తెలీడం సుధాకర్ వాళ్లని ఓ ఇంట్లో పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ గుడిలో సుధాకర్‌ని చూసి అడ్రస్ అడుగుతుంది. సుధాకర్ నన్ను వదిలేయ్ తల్లీ నువ్వు మీ ఊరు వెళ్లిపో అని ప్రేరణతో అంటాడు. ఇంతలో ఇందు వచ్చి సుధాకర్‌ని తమ్ముడు అంటుంది. సుధాకర్ ఇందుని చూసి అక్క అంటాడు. అక్కేంటి అని ప్రేరణ అంటే తను మా బాబాయ్ కొడుకు అని చెప్తుంది.
ప్రేరణ, ఐశ్వర్యలు మేనకోడళ్లని చెప్తుంది. సుధాకర్ వెళ్లే వాళ్లకి బీపీ ట్యాబ్లెట్ అడుగుతూ గుండె పట్టుకొని కూర్చొంటాడు. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకుంటా అని వెళ్లిపోయింది మా గణ సార్ తండ్రి ఒక్కరేనా అని అంటుంది. అవునురా తమ్ముడు అని ఇందు అంటుంది. తమ్ముడు.. మామయ్యా.. మామయ్యా.. నీతో ఒకటి రెండు సార్లు మాట్లాడాను నీ ఇంటికి వచ్చుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదే అని చాలా భయపడతాడు. ఇన్నాళ్లు వాడు నాకు మొగుడే అనుకున్నా అల్లుడు కూడా వాడేనా అంటుంది. వాడు నీకు అల్లుడేంటిరా రాక్షసుడు అని ఇందు అంటుంది. బావని కలిస్తే మిమల్ని మిమల్ని కలిసినందుకు నన్ను చంపేస్తాడే వాడు అని అంటాడు.
ఇందు సుధాకర్‌తో తమ్ముడు మేం తలదాచుకోవడానికి ఒక చోటు కావాలిరా అంటుంది. సుధాకర్ ఇందుతో నేను ఉన్న ఇంట్లో కుదరదు కానీ నాకు తెలిసిన వాళ్ల ఇంట్లో పెడతాను అని అంటాడు. ఇళ్లు బాగుంటుందా మామయ్య అని ఐశ్వర్య అంటే నన్ను చంపేయ్‌వే చంపేయ్ అని అంటాడు. ఇక ఇంటికి తీసుకొస్తాడు. ఓనర్‌కి ఏవేవో చెప్పి ఒప్పించా మీరు కూడా నోటికి దొరికింది చెప్పి ఒప్పించేయండి అంటాడు. ఇక ప్రేరణ సుధాకర్‌కి టెన్షన్ పడొద్దని అంటే నా జీవితానికి ఇక అది ఉండదు అంటాడు. ఇందు పాలు పొంగిద్దామని అంటే నీ మొగుడి కొడుకుకి తెలిస్తే నన్ను పొంగిచేస్తాడని అంటాడు. ఇంతలో ఇంటి ఓనర్ వస్తాడు. ఇళ్లు బాగుందా అంటే ఐశ్వర్య పెయింట్ బాలేదు.. వ్యూ బాలేదు అంటుంది. దానికి ఓనర్ మీరు ఇచ్చే రెంట్‌కి ఇది సరిపోతుందని అంటాడు.
ఓనర్ ఇంటాయన గురించి అడిగితే దుబాయ్‌లో ఉన్నారని సుధాకర్ అంటాడు. ఐశ్వర్య ఆకలి అంటే ప్రేరణ సుధాకర్‌తో టిఫెన్ తీసుకువద్దామని అంటుంది. ఇందు ఏడిస్తే సుధాకర్ వద్దని ఏదో ఒకటి చేద్దామని అంటాడు. మరోవైపు సాహితి డల్‌గా అన్నయ్యని తలచుకొని బాధ పడుతూ బయటకు వెళ్తుంటే మంజుల టిఫెన్ చేయమని అంటుంది. అన్నయ్య దగ్గరకు వెళ్తా అన్నయ్యని తీసుకొస్తా అంటుంది. దానికి మంజుల నేను వాడి తల్లినే నేను ఏ ప్రయత్నం చేయలేదు అనుకున్నావా వాడు మొండి వాడే అంటుంది. విజయానంద్ సాహితి అంటే వాడికి ఇష్టం కాబట్టి తన ప్రయత్నం చేయమని అంటాడు. సాహితికి పీఏని తోడు ఇచ్చి పంపిస్తాడు.
ప్రేరణ, సుధాకర్ బయటకు వెళ్తారు. మామయ్య అడ్రస్ ఇవ్వడు అని మాయ చేసి అడ్రస్ అడగాలి అనుకుంటుంది. మామయ్యా అని ప్రేరణ అంటే నువ్వు మామయ్య అంటే హాయిగా ఉంది కానీ నా మొగుడు వినేస్తాడని భయంగా ఉందని అంటుంది. ప్రేరణ ఏం మాట్లాడినా దానికి సుధ గణ ఇంటి అడ్రస్ తప్ప ఇంకేమైనా చేస్తా అంటాడు. సుధాకర్ తనో గొప్ప కానిస్టేబుల్ అని ఎస్‌ఐలు కనిపెట్టలేని దొంగల్ని నేను కనిపెట్టానని గొప్పలు చెప్తుంటాడు. దానికి ప్రేరణ ఎలా అయిన గణ అడ్రస్ దక్కించుకోవాలని నువ్వు అంత టాలెంటెడ్ అయితే అరగంటలో నా బ్యాగ్ ఇప్పించు అంటుంది. దాంతో ఏరియా డిటైల్స్ అడిగి అతని ఫొటో ప్రేరణకు చెప్పి మరో కానిస్టేబుల్‌కి కాల్ చేసి బ్యాగ్ కొట్టేశాడు పది నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడికి ఇవ్వాలని చెప్తాడు. సరిగ్గా పది నిమిషాల్లో దొంగలు బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తారు. అందులో అడ్రస్ కూడా ఉంటుంది. ప్రేరణ చాలా సంతోషపడుతుంది.
ప్రేరణ మామయ్యని పొగిడి తనకు పని ఉందని చెప్పి మామయ్యని టిఫెన్ తీసుకొని వెళ్లిపోమని చెప్తుంది. ఇక బైక్ బుక్ చేస్తుంది. సిద్ధూ బైక్ తీసుకొని వస్తాడు. వీడేంటి ఇక్కడ అని ప్రేరణ అనుకుంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి అని సిద్ధూ అనుకుంటాడు. హలో మీరేంటి మీరు ఇక్కడ అంటాడు. నీకు చెప్పాలా అంటుంది ప్రేరణ. మీరు బుక్ చేసిన బైక్ నాదే వచ్చి ఎక్కండి అంటాడు. నా బ్యాగ్ దొరికేసిందని ప్రేరణ అంటే ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్లో అర్థమైందా అంటాడు. ప్రేరణ బైక్ ఎక్కుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















