Nindu Manasulu Serial Today July 23rd: నిండు మనసులు సీరియల్: కోటీశ్వరుడిని దొంగని చేసేసిన ప్రేరణ.. అన్నీ పొగొట్టుకొని తల్లీచెల్లితో గుడిలో ప్రేరణ!
Nindu Manasulu Today Episode ప్రేరణ హ్యాండ్ బ్యాగ్ ఓ దొంగ తీసుకోవడం దానివల్ల ప్రేరణ తండ్రి అడ్రస్ ఉన్న పేపర్ పొగొట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ తల్లి చెల్లిని తీసుకొని కానిస్టేబుల్ సుధాకర్ ఇచ్చిన అడ్రస్ పట్టుకొని తండ్రి కోసం గణ అడ్రస్‌కి బయల్దేరుతుంది. సుధాకర్ ఇచ్చిన అడ్రస్ పేపర్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటుంది. ఆటో డ్రైవర్‌కి అడ్రస్ చూపించి తీసుకెళ్లమని అంటుంది. ఆటో డ్రైవర్ తనకు అడ్రస్ కొత్త అని ఫోన్లో చూసి చెప్తే తీసుకెళ్తా అంటాడు.
ఐశ్వర్య, ఇందు ఆటో ఎక్కుతారు. ప్రేరణ ఎక్కే టైంకి ప్రేరణ వాళ్లు ఊరికి కొత్త అని చూసిన ఇద్దరు వ్యక్తిలు ప్రేరణ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బైక్ మీద వెళ్లిపోతారు. ప్రేరణ, ఐశ్వర్యలు వెనకాలే పరుగులు పెడతారు. చాలా దూరం పరుగెడతారు కానీ పట్టుకోలేరు. బ్యాగే కదా పోయింది ఏం కాదులే అని ఇందు కూతురికి సర్ది చెప్తే ప్రేరణ ఏడుస్తూ తన ఫోన్, నాన్న అడ్రస్, డబ్బు అన్నీ అన్నీ అందులోనే ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడేం చేస్తామే అని ఇందు ఏడుస్తుంది.
ఐశ్వర్య కానిస్టేబుల్‌కి మళ్లీ అడ్రస్ అడుగుదాం అంటే ఒకసారి అతని దగ్గర అడ్రస్ తీసుకోవడానికే కష్టపడ్డాం.. పైగా అతను కూడా చాలా భయపడ్డాడు అని అంటుంది. అడ్రస్ లేదు.. ఫోన్ లేదు.. డబ్బు లేదు ఇప్పుడేం చేస్తాం అక్క అని ఐశ్వర్య ఏడుస్తుంది. మరోవైపు సిద్ధూ తన తల్లి తనని తిట్టిందని చాలా బాధ పడతాడు. అమ్మ అలా మాట్లాడటం గుండె పిండేసినట్లుందని అంటాడు. సిద్ధూతో తన ఫ్రెండ్ ఐపీఎస్ అవ్వడానికి నువ్వే అతని హెల్ప్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని అంటాడు. దానికి సిద్ధూ కోపంగా అలా చేయడం కంటే చావడం బెటర్ అంటాడు. కల నెరవేర్చుకోవడం కోసం తల వంచడం నా క్యారెక్టర్ కాదు అంటాడు. ఏ ఇన్స్‌టిట్యూట్‌లో సీటు రాకుండా చేశాడు ఈ దుర్మార్గుడు అని అంటాడు.
సిద్ధూ వాళ్లు ఉన్న గుడి దగ్గరకే ప్రేరణ వాళ్లు వస్తారు. మనకు ఆ దేవుడు ఏం చేశాడే ఇక్కడికి తీసుకొచ్చావ్.. రోజు కొలుస్తాను కానీ కన్నీరే మిగిల్చాడు.. ఉన్న వన్నీ పోయావి.. ఎదిగిన మిమల్ని ఇలా రోడ్డుకీ తీసుకొచ్చేశాడు అని ఏడుస్తుంది. ఐశ్వర్య ఆకలి అని ఏడ్వడంతో నా కూతురికి ఈ పరిస్థితి వచ్చిందని ఇందు ఏడుస్తుంది. ప్రేరణ గుడిలో ప్రసాదం ఇస్తారేమో అని చూడటానికి వెళ్తాడు. మరోవైపు మంజుల, సాహితి, విజయానంద్‌లు సిద్ధూ గురించి ఆలోచిస్తారు.
సాహితి తల్లితో అన్నయ్యతో నువ్వు అలా మాట్లాడకూడదు అమ్మా అంటుంది. ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా అన్నయ్య నా కోసం వచ్చి ఇంటికి తీసుకొస్తే మూర్ఖుడివని ఏం సాధించలేదని చెప్పి గెంటేయడం కరెక్టా అమ్మా అని అడుగుతుంది. విజయానంద్ తల్లిని ఏం అనొద్దు అని మీ అన్నయ్య గురించి మీరు మీ అమ్మ ఎంత ఆలోచిస్తుందో నీకు తెలీదు అని అంటాడు. నేను వాడిని అనాథాశ్రమం నుంచి తీసుకురాలేదు నవమాసాలు మోసి పెంచాను కానీ వాడు మూర్ఖుడిలా మారిపోయాడు. వాడికి చెప్పు మంచి ఏదో చెడు ఏదో అని మంజుల చెప్పి వెళ్లిపోతుంది. విజయానంద్ కూతురితో ఇవాళే వచ్చావు కదా నీకు ఇదంతా కొత్తగా ఉంటుంది కానీ సిద్ధూ మమల్ని అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో ఉన్నామని విజయానంద్ సాహితికి చెప్తాడు.
సిద్ధూ ఫ్రెండ్ ప్రసాదం కోసం వెళ్తాడు. సిద్ధూ స్వెటర్ చూసిన ప్రేరణ తనే దొంగ అని అనుకొని సిద్ధూని పట్టుకొని లాగుతుంది. నా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నావ్ అని ప్రేరణ ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. ఇంతలో సిద్ధూ ఫ్రెండ్ వచ్చి ఏమైందని అడిగితే మీ ఇద్దరూ కలిసి బ్యాగ్లు కొట్టేశారని నా బ్యాగ్ నాకు ఇవ్వు అని ప్రేరణ అంటుంది. కుమార్ సిద్ధూ బ్యాగ్రౌండ్ గురించి చెప్తా అంటే సిద్ధూ ఆపుతాడు. ప్రేరణ తిడుతూ ఉంటే కుమార్ మర్యాదగా మాట్లాడమని అంటారు. దొంగలతో ఇలాగే మాట్లాడుతా అని ప్రేరణ అంటే మేం వెళ్లిపోతాం అని కుమార్ అంటాడు. దానికి ప్రేరణ మీరు ఇదే జర్కిన్ వేసుకొని దొంగతనం చేయడం నేను చూశా అంటుంది. జర్కిన్ చూసి దొంగ అంటున్నావ్ నీ తెలివికి దండం అమ్మా అని వెళ్లిపోతారు.
ఐశ్వర్య తల్లితో అక్క ఇంకా రాలేదు ఏంటి అమ్మ అనుకుంటుంది. ఇంతలో ప్రేరణ ప్రసాదం తీసుకొని వస్తుంది. పాపం ఐశ్వర్య ఆవురావురమని తింటుంది. అది చూసి ఇందు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు అని ఏడుస్తుంది. రెక్కలు తెగిన పక్షుల్లా మన బతుకు అయిపోయిందని అనుకుంటుంది. ఏదో ఒక దారి దొరుకుతుంది బాధ పడొద్దు అమ్మా అని ప్రేరణ అంటుంది. ఇంతలో సుధాకర్ ఆ గుడిలో దేవుడితో స్వామీ రోజూ ఉదయం సాయంత్రం నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నా నా మొర వినవా.. ఆ గణ టార్చర్ ఎక్కువైపోయింది. నన్ను తిట్టడానికే వాడు ఇక్కడ ఉన్నట్లున్నాడు. ప్లీజ్ దేవుడా నన్ను కాపాడు అని మొక్కుకుంటాడు.
ప్రేరణ నీరు పట్టుకుంటుంటే సుధాకర్ దండం పెట్టి వెళ్తుంటాడు. ఒకర్ని ఒకరు ఢీ కొట్టుకోవడంతో ప్రేరణ సుధాకర్ని చూస్తుంది. సుధా ప్రేరణతో అడ్రస్కి వెళ్లారా కలిశారా అని అడుగుతాడు. అడ్రస్ పోయిందని ప్రేరణ చెప్తుంది. సుధాకర్ షాక్ అయిపోతాడు. ప్రేరణ వాళ్లని ఇంటికి వెళ్లిపోమని అంటాడు. ప్రేరణ అడ్రస్ మళ్లీ చెప్పమని బతిమాలుతుంది. సుధాకర్ వద్దని అంటుంటే ఇందు వచ్చి తమ్ముడు అని పిలుస్తుంది. సుధాకర్ కరిగిపోతాడు. అక్క అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: లోహిత భర్త్‌డే పార్టీని నాశనం చేసిన మధు.. ఏదో ఒకటి చేయ్ మ్యాడీ అంటూ నడిరోడ్డు మీద రచ్చ!
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















