Nindu Manasulu Serial Today July 18th: నిండు మనసులు సీరియల్: సవతి బిడ్డల పొట్లాట.. ప్రేరణ పుట్టుక గురించి దారుణంగా మాట్లాడిన గణేశ్!
Nindu Manasulu Today Episode ప్రేరణ ఇంటికి గణేశ్ వచ్చి ప్రేరణ, ఐశ్వర్యలు అక్రమ సంతానం అని నానా మాటలు అని నిందించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణని గణ సిటీ నుంచి తన కారులో తీసుకొస్తూ ఉంటాడు. ప్రేరణ గణని అన్నయ్య అంటుంటే గణ రగిలిపోతాడు. గణ తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో భార్యకి ఇద్దరు కూతుళ్లు అందులో పెద్ద కూతురే ప్రేరణ. గణ తన తండ్రి ప్రేరణ వాళ్లకి ఇళ్లు రాసి ఇవ్వాలని అనుకున్నాడని తెలుసుకున్న గణ పక్కా ప్లాన్తో ప్రేరణతో తన ఇంటికి వస్తాడు.
ప్రేరణ ఇంటికి వచ్చిన తర్వాత గణని అన్నయ్యా అని పిలిస్తే అలా పిలొద్దని పంతం గణేశే రాజశేఖర్ వారసుడిని నేను ఆయన ఒక్కగానొక్క కొడుకుని నేను అని అంటాడు. మీరు మా నాన్న అని ప్రేరణ అంటే ఏయ్ మీ నాన్న కాదు మా నాన్న నా ఒక్కడికే నాన్న అని అంటాడు. మీ అమ్మ జీవితంలో మా నాన్న ఒక్కడేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతాడు. రేయ్ అంటూ ప్రేరణ అరుస్తే ఏయ్ అరవకు.. ఏంటి కోపం వచ్చిందా.. ఒక్క మాట అన్నందుకే నీకు ఇంత కోపం వస్తే మీ అమ్మ ఏదో ఒక్క పేరు చెప్పినందుకు నువ్వు అడ్రస్ పట్టుకొని హాస్పిటల్‌కి వచ్చి మా నాన్నని నాన్నఅంటే నాకు ఎంత కోపం రావాలి అని అంటాడు. మీ అమ్మ లీగల్‌గా మా నాన్నని పెళ్లి చేసుకుంది అన్నది అబద్ధం. మీరు మా నాన్న రక్తం పంచుకున్న బిడ్డలు అన్నది అబద్ధం.. కానీ నిజం ఏంటో తెలుసా.. మా నాన్న ఈశ్వరి మా నాన్నతో తాళి కట్టించుకోవడం నిజం. ప్రపంచానికి వాళ్లు భార్యాభర్తలు అని తెలియడం నిజం. నేను వాళ్ల రక్తం పంచుకొని పుట్టిన ఏకైక వారసుడిని అన్నది నిజం అంటాడు.
ప్రేరణ అన్నతో అలా మాట్లాడొద్దు మా నాన్న మాకు మోసం చేయడు అంటుంది. గణేశ్ అరుస్తూ మా నాన్నని నాన్న అనడం మానేయ్.. మీ అమ్మ మా నాన్నని మోసం చేసింది. మా అమ్మని మోసం చేసింది. అసలు తను మా నాన్నకి భార్య కాదు. మొదటి భార్య అయినా రెండో భార్య అయినా తాళి కట్టించుకుంటేనే భార్య అవుతుంది. మా అమ్మ పెళ్లి నువ్వు చూశావా అసలు నువ్వు ఎవరు మా అమ్మ కోసం మాట్లాడటానికి అని ప్రేరణ అడుగుతుంది. దాంతో గణేశ్ అవునా సరే అయితే మీ అమ్మ పెళ్లి ఎక్కడ జరిగిందో నువ్వు చెప్పు.. మా తాతగారి ఇంట్లోనా పోనీ మీ అమ్మమ్మ ఇంట్లోనా లేక గుడిలోనా కనీసం రిజిస్టర్ ఆఫీస్‌లో అయినా అయిందా చెప్పు అంటాడు. ప్రేరణ ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది. వీడియో అయినా కనీసం పెళ్లి ఫొటో అయినా చూపించమని అంటాడు.
ప్రేరణ కోపంగా మేం ఇద్దరం రాజశేఖరం పిల్లలం మాకు అది నిరూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు అని అంటుంది. దాంతో గణేశ్ అరుస్తూ కానీ నాకు ఉంది. మా అమ్మ మాత్రమే మా నాన్న భార్య. నేనే వాళ్ల కొడుకుని మేం మాత్రమే ఆయన ఫ్యామిలీ ఇంకెవరు మధ్యలోకి వచ్చినా వాళ్లు అక్రమమే. మా అమ్మానాన్నకి పెళ్లి మా తాత ఇంట్లో ఘనంగా జరిగింది. పెళ్లి ఫొటోలు వీడియోలు నేను చూపించగలను. అని ఫొటో అందరికీ చూపిస్తాడు. ప్రేరణ తన చెల్లి షాక్ అయిపోతారు. వీడియో కూడా ఈ కాలనీ మొత్తం చూపించగలను అంటాడు. నువ్వేం చూపిస్తావో చెప్పు అని గణేశ్ అడుగుతాడు. కాలనీ వాళ్లు గణేశ్‌తో ఇరవై ఏళ్ల క్రితం జరిగిన పెళ్లి కదండీ ఇప్పుడు వాళ్లకి సాక్ష్యాలు అడిగితే ఎలా అండి ఆయన పిల్లలగానే పెరిగారు ఇప్పుడు మీరు ఇలా అడిగితే వాళ్లు ఏం చేస్తారు అని అంటారు. దానికి గణేశ్ వీళ్ల అమ్మ 20 ఏళ్లగా మా నాన్నని వీళ్ల నాన్న అని నమ్మించి పెంచింది. వారంలో రెండు రోజులే ఆయన ఇక్కడ ఉన్నాడు అంటే మిగతా 5 రోజులు ఎక్కడ ఉండే వాడో తెలుసా మా దగ్గర. ఎవరైనా ఫ్యామిలీని వదిలేసి వెళ్తారా అని ప్రశ్నిస్తాడు. 20 ఏళ్లగా వారానికి రెండు రోజులు మాత్రమే ఉంటే ఏ భార్య అయినా భర్తని వదిలేస్తుందా.. మీరు అయితే ఊరుకుంటారా కానీ వీళ్ల తల్లి మాత్రం అడగలేదు. ఉంచుకునేదానిలా ఉండలేక తను ఇక్కడే ఉండిపోయింది అని అంటాడు.
ప్రేరణ అన్న కాలర్ పట్టుకొని ఇంకోసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తా అంటుంది. దాంతో కాలనీ ఆడవాళ్లు మాత్రం ఆ అబ్బాయిని ఎందుకు అంటావ్ అమ్మా అతను ఆవేశంలో మాట్లాడాడు అనుకున్నా కానీ మీదే తప్పు అంటారు. అక్కడున్న కాలనీ వాళ్లు అంతా ప్రేరణ వాళ్లని చీ కొడతారు. ఇష్టం వచ్చినట్లు తిడతారు. కాలనీ నుంచి వెళ్లిపోమని చెప్తారు. గణేశ్ ప్రేరణతో అక్రమానికి సక్రమానికి ఉన్న తేడా ఇది అర్థమైందా.. మా నాన్న పేరు ఇంకోసారి మీ నోటి నుంచి రాకుండా మీరు మాకు కనిపించకుండా రేపు ఉదయంలోపు ఇళ్లు ఖాళీ చేసి కనిపించనంత దూరం వెళ్లిపోవాలి అంటాడు. గణ పోలీస్ ఆఫీసర్ కావడంతో తన స్టాఫ్‌తో చెప్పి సామాను విసిరించేస్తాడు.
గణేశ్ వెళ్లిపోయిన తర్వాత ఇందు వస్తుంది. సామాను ఎందుకు విసిరేస్తున్నారు అని అడుగుతుంది. ప్రేరణ, ఐశ్వర్యలను ఏమైందని అడుగుతుంది. వాళ్లేం మాట్లాడరు. కాలనీ వాళ్లు ఇందుతో చెప్పుకుంటే సిగ్గు చేటు పెళ్లి అయిన కొడుకు ఉన్న ఓ మగాడిని వలలో వేసుకున్నావ్ కదా మహాతల్లి. రాజశేఖరం అసలైన కొడుకు వచ్చి నీ కూతుళ్లకి గడ్డి పెట్టాడు. నీకు రెండో భార్య స్థానం లేదని కూడా చెప్పి పోయాడు. హైదరాబాద్‌లో మొదటి భార్య ఉందని తెలిసి కూడా ఈవిడ ఇంత చేసింది అంటే మహా తల్లి అంటారు. అందరూ మాటలు విన్న ఇందు(బ్రహ్మముడిలో కనకం) కళ్లు తిరిగి పడిపోతుంది. ప్రేరణ డాక్టర్‌కి కాల్ చేయమని చెప్తే మీకు లేకపోయినా మాకు సిగ్గు ఉందని అందరూ వదిలేసి వెళ్లిపోతారు.
గణేశ్‌కి తల్లి ఈశ్వరి( గుప్పెడంత మనసు రిషి పెద్దమ్మ) కాల్ చేస్తుంది. వెళ్లిన పని ఏమైందని అడిగితే వాళ్లకి నేను చేసిన అవమానానికి కట్ట కట్టుకొని చావుని వెతుక్కొని వెళ్లడం తప్ప వాళ్లకి ఇంకోదారి లేదు జీవితంలో మనకు కనిపించరు అని చెప్తాడు. ఇప్పుడు నా మనసు కుదుట పడింది అని ఈశ్వరి అంటుంది. మరోవైపు సిద్ధూ ఎక్కడికి వెళ్తే అక్కడ తన తండ్రి విజయానంద్ పేరు చెప్పడంతో సిద్దూ ఇరిటేట్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అన్న డబ్బు కొట్టేసిని లోహిత.. చందుకి అవమానం తప్పదా! సోదమ్మా మహికి ఏం చెప్పిందంటే!





















