Nindu Manasulu Serial Today January 30th: నిండు మనసులు: స్టేషన్‌లో భార్యాభర్తలైన సిద్ధూ, ప్రేరణ! వ్యభిచారం కేసులో ఊహించను మలుపు!
Nindu Manasulu Serial Today Episode January 30th ప్రేరణని కాపాడటానికి సిద్ధూ ఇద్దరూ భార్యాభర్తలని చెప్పి సంతకాలు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode సిద్ధూ, ప్రేరణల్ని వ్యభిచారం కేసులో గణ అరెస్ట్ చేయిస్తాడు. సిద్ధూ పోలీస్ స్టేషన్‌లో గొడవ చేస్తుంటే జయకృష్ణ వెళ్లి ఏమైందని అడుగుతాడు. మేం ఏం చేయలేదు.. మేం అలాంటి వాళ్లం కాదని సిద్ధూ చెప్తాడు. మేం కావాలని వెళ్లలేదు సార్ మా చెల్లి ప్రమాదంలో ఉందని మెసేజ్ వచ్చింది అందుకే వెళ్లాం సార్ ఎవరో కావాలని ఇరికించారని చెప్తారు. దాంతో జయకృష్ణ ఫోన్‌లు ఇప్పిస్తారు.
ప్రేరణ తన ఫోన్ తీసుకొని చెక్ చేస్తే అందులో మెసేజ్ ఉండదు.. ప్రేరణ షాక్ అయి ఏడుస్తుంది. నిజంగా మెసేజ్ వచ్చింది సార్ కానీ కనిపించడం లేదు అని ప్రేరణ అంటే వీళ్లని నమ్మొద్దని ధనుంజయ్ అంటాడు. జయకృష్ణ కూడా నమ్మకుండా వెళ్లిపోతుంటే సిద్ధూ ఆపి సార్ మమల్ని నమ్మండి సార్ మేం సివిల్స్‌కి ప్రిపేర్ అవున్నాం అని చెప్తాడు. ఇంట్రస్టింగ్ అని జయకృష్ణ అంటారు. సిద్ధూ ఆయనతో సార్ ఒక్క రెండు నిమిషాలు నేను చెప్పేది వినండి సార్ అప్పటికీ మీకు నమ్మకం కుదరకపోతే లేదు అంటాడు. దానికి జయకృష్ణ సరే అని సిద్ధూ ఒక్కడినే గదిలోకి తీసుకెళ్తాడు.
సిద్ధూ తన సివిల్స్ పరీక్ష హాల్‌టికెట్ చూపిస్తాడు. తర్వాత మేం ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి అని కేఫ్ కూడా నడుపుతున్నాం అని ఆ ఫొటోలు వీడియోలు కూడా చూపిస్తాడు. అంతా బాగుంది కానీ మరి ఎందుకు మీరు అక్కడికి వెళ్లారు అని అంటాడు. దానికి సిద్ధూ కావాలనే మమల్ని ఎవరో ఇరికించారని అంటాడు. వయసులో ఉన్నారు కదా మీకు తప్పు చేయాలి అనిపించొచ్చు కదా అని డీసీపీ అంటే నేను అలాంటి వాడిని కాదు అంటాడు. మరి తను అని జయకృష్ణ అంటే నన్ను తప్పుగా అనండి సార్ కానీ తను అలాంటిది కాదు అని అంటాడు. వయసులో ఉన్నవాళ్లు అలాంటి చోట ఉంటే అలాగే అనుకుంటారు అని జయకృష్ణ అంటాడు. మీరు చూడటానికి భార్యభర్తల్లా లేరు.. మరి మీకు అక్కడ ఏం పని ఫ్రెండ్సా.. లవర్సా ఏంటి అని అడుగుతారు. దాంతో సిద్ధూ మేం భార్యాభర్తలం అని అంటాడు. మరి తన మెడలో తాళి లేదు.. కాలికి మెట్టెలు లేవు అని జయకృష్ణ అడుగుతాడు. దాంతో సిద్ధూ మేం ప్రేమించుకున్నాం సార్.. మా పెద్దవాళ్లకి ఇష్టం లేదు సార్.. అని అందుకే సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాం.. అని అంటాడు. మీ పెద్ద వాళ్లని పిలు మాట్లాడుతా అని జయకృష్ణ అంటే మా వాళ్లని పిలిస్తే విషయం తెలిసిపోతుంది కదా సార్ అందుకే చెప్పడం లేదు.. సివిల్స్ పూర్తి అయ్యే వరకు చెప్పకూడదు అనుకున్నాం అందుకే సీక్రెట్‌గా ఉన్నాం అని అంటాడు.
జయకృష్ణ సిద్ధూకి పేపర్ పెన్ను ఇచ్చి మీరు భార్యాభర్తలు అని రాసి సంతకం పెట్టు అప్పుడు నమ్ముతా అని అంటాడు. మరోవైపు గణ ధనుంజయ్‌కి కాల్ చేసి విషయం అడుగుతాడు. డీసీపీ ఉన్నారు సార్ అని ధనుంజయ్ చెప్తే అయితే సూపర్ అంతా ఆయనే చూసుకుంటారు అని గణ హ్యాపీ అయిపోతాడు. మరోవైపు సిద్ధూ మనసులో నాకు ఏమైనా పర్లేదు.. తనకు మాత్రం ఏం అవ్వకూడదు..తనకి ఏం కాకూడదు నేను తనకి అండగా ఉంటానని మాటిచ్చా కానీ భార్యగా రాయడం ఇష్టం లేదు అని అనుకుంటాడు. జయకృష్ణ సిద్ధూతో నువ్వు చెప్తుంది అబద్ధం అని తెలుస్తుంది. ఇద్దరూ కోర్టులో తేల్చుకోండి అని అంటాడు. దాంతో సిద్ధూ రాస్తాను సార్ అని తను ప్రేరణ భార్య భర్తలు అని రాసి సంతకం పెడతాడు. తర్వాత జయకృష్ణ ప్రేరణ సంతకం కూడా కావాలి అంటాడు. సిద్ధూ బిత్తరపోతాడు. కేసు నుంచి బయట పడాలి అంటే భార్యాభర్తలం అని అబద్ధం చెప్పకతప్పదు.. కానీ ప్రేరణ ఒప్పుకోదు.. ప్రేరణ కేసులో ఇరుక్కోకుండా చేయాలి అంటే తనకి తెలీకుండా సంతకం పెట్టించాలి అని అనుకుంటాడు.
సిద్ధూ ప్రేరణ దగ్గరకు వెళ్తే ప్రేరణ ఏడుస్తూ మా అమ్మకి తెలిస్తే తట్టుకోలేదు.. వెళ్లిపోదాం సిద్ధూ అని అంటుంది. వదిలేస్తా అని అన్నారు కానీ ఒక కండీషన్ పెట్టారు అని మనం ఏ తప్పు చేయలేదు అని రాసి సంతకం పెట్టారు నేను సంతకం పెట్టేశా నువ్వు పెట్టాలి అని అంటాడు. నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని నాకు తెలుసు ఇప్పుడే కళ్లు మూసుకొని సంతకం పెడతా అని జయకృష్ణ దగ్గరకు వెళ్లి సంతకం పెడుతుంది. జయకృష్ణ సరే అని ఇక నుంచి అయినా మీ భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి అని అంటాడు. ప్రేరణ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















