Chinni Serial Today January 30th: చిన్ని సీరియల్: ఆఫ్ టికెట్‌ను మ్యాడీ చూసేశాడా! నాగవల్లి పగ, భయంతో వణికిపోతున్న దేవా!
Chinni Serial Today Episode January 30th మధు ఆఫ్ టికెట్‌ని కలవడం లోహిత ఆఫ్ టికెట్ని చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు ఆంజనేయస్వామితో తను మ్యాడీని ప్రేమించాను అని మ్యాడీ కూడా తనని ప్రేమించేలా చేస్తున్నా కానీ మ్యాడీ మనసు మారడం లేదని.. మా పెళ్లిని కూడా మ్యాడీ అంగీకరించడం లేదని మ్యాడీ నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జన్మ జన్మలకు మ్యాడీనే నాకు భర్త అయ్యేలా దీవించు స్వామి అని వేడుకుంటుంది. మా మాటలు అన్నీ మ్యాడీ వింటాడు. ఇంతలో మధుకి ఆఫ్ టికెట్ కాల్ చేసి అర్జెంటుగా మాట్లాడాలిరా అని లొకేషన్ చెప్తాడు.
మధు కంగారుగా వెళ్తుంది. మధు ఏంటి ఫోన్‌లో మాట్లాడి కంగారుగా వెళ్తుంది అని లోహిత, మ్యాడీ ఇద్దరూ మధుని ఫాలో అవుతారు. మధు ఆఫ్ టికెట్‌ని కలిసి మాట్లాడుతుంది. నాగవల్లి వల్ల నీకు ఏదో ప్రమాదం జరనుందని నాకు కల వచ్చింది అని చెప్తాడు. మ్యాడీ ఉండగా నాకు ఏ ప్రమాదం జరగదు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకు మ్యాడీనే కాపాడుతాడు అని అంటుంది. మ్యాడీ దగ్గరకు వచ్చే టైంకి ఆఫ్ టికెట్ చిన్ని పాపలా నటించి వెళ్లిపోతాడు. ఎవరు ఆ పాప అని మ్యాడీ మధుని అడిగితే తెలిసినవాళ్ల పాప అని చెప్తుంది.
ఆఫ్ టికెట్ కంగారుగా పరుగెత్తుతూ లోహితను ఢీ కొడతాడు. లోహితకు ఆఫ్ టికెట్ మీద అనుమానం వస్తుంది. దాంతో ఆఫ్ టికెట్ పరుగెడతాడు. లోహితకు గుర్తు పట్టేసి ఆఫ్ టికెట్ ఆడ వేషం వేసుకొని ఎందుకు వచ్చాడు అని అనుకుంటుంది. ఇక మ్యాడీ ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్తూ ఓ పాప బెలూన్ కోసం పరుగులు పెట్టడం చూసి బెలూన్ కోసం పరుగెడతాడు. మధు, మ్యాడీ ఒకేసారి బెలూన్ పట్టుకుంటారు. పాప థ్యాంక్స్ చెప్పి బెలూన్ తీసుకెళ్లిపోతుంది. మరోవైపు మధు కట్టిన ముడుపు కింద పడిపోతుంటే మ్యాడీ పట్టుకుంటాడు. మళ్లీ కట్టమని మధుని ఎత్తుకొని ముడుపు కట్టిస్తాడు. మధు మళ్లీ ముడుపు కడుతుంది. స్వరూప, ప్రమీల చూసి చాలా సంతోషపడతారు. ఘట్టాలు అన్నీ అయిపోయావా ఇక వెళ్లిపోదాం అని లోహిత అంటే ఇంకో ఘట్టం ఉందని ప్రమీల అందరినీ తీసుకెళ్తుంది.
నాగవల్లి అక్క ఫొటో దగ్గరకు వెళ్లి కావేరి కుటుంబంలో ఒక్కరిని కూడా వదలను అని నీకు మాటిచ్చా.. అందులో భాగంగా బాలరాజు, చిన్నిని కూడా కావేరి దగ్గరకు పంపేస్తా.. చిన్ని ఇప్పుడు మాకు దగ్గరగా ఉంది.. దానంతట అదే మమల్ని వెతుక్కుంటూ వచ్చింది.. ఈరోజు కాకపోయినా రేపు అయినా కచ్చితంగా కుదురుతుంది. తొందర్లోనే చిన్ని చావు నీకు తెలుస్తుంది. నీ చావుకి కారణం అయిన వాళ్లని కసితీరా చంపేవరకు నాకు మనస్శాంతి ఉండదు అని నాగవల్లి అనుకుంటుంది. ఆ మాటలు దేవా వింటాడు. తన భార్యని తానే చంపేసిన విషయం గుర్తు చేసుకొని భయపడతాడు. నాగవల్లి ఇన్‌డైరెక్ట్‌గా తనకే వార్నింగ్ ఇచ్చినట్లు భయపడతాడు.
నాగవల్లి వెళ్లిపోయిన తర్వాత పార్వతి ఫొటో దగ్గరకు వెళ్లి ఓసేయ్ దెయ్యం ముఖం దానా.. నీ చావు నా చావుకి వచ్చింది కదే.. చిన్ని నాగవల్లిని కలిస్తే నేనే నిన్ను చంపేశా అని నిజం తెలిసిపోతుంది. నాగవల్లి కంటే ముందే నేను చిన్నిని చంపేయాలి అని అనుకుంటాడు. మరోవైపు మ్యాడీ మధుని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మధు వస్తుంది. అబ్బాయి గారిలో ఇంత మార్పా దీనికి కారణం ఆ వ్రతమేనా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















