అన్వేషించండి

Nindu Manasulu Serial Today December 5th: నిండు మనసులు: ట్విస్ట్‌ ఇచ్చిన మంజు! త్వరలోనే గణ, సాహితిల పెళ్లి! సిద్ధూ, విజయానంద్‌ ఏం చేస్తారు!

Nindu Manasulu Serial Today Episode December 5th నిశ్చితార్థం ఆగిపోయినందుకు మంజుల త్వరలోనే డైరెక్ట్‌గా గణ, సాహితిలకు పెళ్లి చేద్దామని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode నిశ్చితార్థం ఉంగరాలు లేకపోవడంతో సాహితి, గణల నిశ్చితార్థం ఆగిపోయే పరిస్థితి వస్తుంది. నిశ్చితార్థం జరగదు అని ప్రేరణ, సిద్ధూ, విజయానంద్ వాళ్లు సంతోషపడతారు. అయితే గణ తల్లి ఈశ్వరి మాత్రం నిశ్చితార్థం ఎలా అయినా జరగాలి అని తన రింగ్ గణకి ఇచ్చి మంజుల రింగ్ సాహితికి ఇవ్వమని చెప్పి ఉంగరాలు మార్చుకుంటారని చెప్తుంది. 

ప్రేరణ, గణలు షాక్ అయిపోతారు. విజయానంద్ ఇక నిశ్చితార్థం ఆగేలా లేదు వీడిని భరించక తప్పదు అని అనుకుంటాడు. అయితే పంతులు మాత్రం ముహూర్తం టైం అయిపోయిందని గణకి షాక్ ఇస్తారు. గణ బిక్కు ముఖం వేసుకొని అత్తయ్యగారు, మామయ్యగారు, సాహితి నన్ను క్షమించండి అని అంటాడు. విశ్వాసం, సుధాకర్లు మనసులో వీడు మళ్లీ ఏదో ప్లాన్ చేశాడని అనుకుంటారు. గణ ధీనంగా ముఖం పెట్టి బావ గారు ఈ నిశ్చితార్థం జరగకూడదు అన్నా మీరు దేవుళ్లా ఒప్పుకున్నారు. నా వల్ల అన్నాచెల్లెళ్లు విడిపోకూడదు అని ఇక్కడ ఈ కేఫ్‌లో నిశ్చితార్థం పెట్టాను.. కానీ మీలాంటి మంచి వాళ్లకి అల్లుడిని అయ్యే యోగ్యత నాకు లేదు అత్తయ్యగారు అని అంటాడు. 

ఈశ్వరి గణతో బాధపడకురా అన్నయ్యగారు వదిన గారు మంచి ముహూర్తం చూసి మీకు నిశ్చితార్థం చేస్తారు అని అంటుంది. మంజుల సీరియస్‌గా అక్కర్లేదు అని అంటుంది. అందరూ సంబంధం వద్దు అంటుందని అనుకుంటారు.. సిద్ధూ, విజయానంద్ వాళ్లు సంతోషపడతారు. కానీ మంజుల ఇక నిశ్చితార్థం వద్దు డైరెక్ట్‌గా పెళ్లికి ముహూర్తం పెట్టేద్దామని అంటుంది. దాంతో అందరూ షాక్ అయిపోతారు. గణ పొంగిపోతాడు. సిద్ధూని చూసి కాలర్ ఎగరేస్తాడు. విజయానంద్ విశ్వాసంతో ఇది నేను తట్టుకోలేని ట్విస్ట్ విశ్వాసం అని అంటాడు. గణ మంజుల కాళ్ల మీద పడిపోతాడు.

మంజుల ఇక ఈ విషయం గురించి ఎవరినీ మాట్లాడొద్దు అని చెప్పి ఇంటికి బయల్దేరిపోతుంది. విజయానంద్ మంజులతో ఇన్నాళ్ల మన కాపురంలో నువ్వు ఎప్పుడూ తప్పు చేయలేదు కానీ ఈ సారి తెలిసి తప్పు చేశావ్ అని పెళ్లి గురించి చెప్తాడు. అది అస్సలు తప్పు అనిపించడం లేదండీ నేను ఇంకా సాహితికి మంచే చేశాను అని అంటుంది. గణ అంతా తింగరి తింగరిగా చేసుకుంటున్నాడు.. అది ఆలోచించాలి.. అన్నింటికన్నా ముఖ్యంగా మన  కొడుకుకి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు.. మన కొడుకుకి చెల్లి అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా.. వాడు వద్దు అన్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదా అని అంటాడు. లేదు ఈ పెళ్లి జరగాలి మన అమ్మాయి కోసం మీరు ఎలా ఆలోచిస్తారు.. గణ కూడా అలానే ఆలోచిస్తున్నాడు.. గణ కూడా మీలా సిద్ధూ సాహితిని కలిపాడు అని గణని పొగుడుతుంది. గణ, సాహితిల పెళ్లి జరిగే తీరుతుంది అని అంటుంది. విజయానంద్ మనసులో నాదే తప్పు మొదటి నుంచి నేను ఏం చేసినా కరెక్ట్ అని నీతో నమ్మించా అదే నా కొంప ముంచింది అని అనుకుంటాడు.

గణ ప్రేరణ, సిద్ధూలతో నిశ్చితార్థం ఎవరో ఆపాలని బలంగా ప్రయత్నించారు.. నువ్వు ఏమైనా ఆపాలని చూశావా సిద్ధూబావ అని గణ అడుగుతాడు. అవును నేనే చేసే అయితే ఏంటి అని సిద్ధూ అంటాడు. తెలుసు బావ.. నా పాటికి నేను నీ చెల్లిని పెళ్లి చేసుకుంటా అని అనుకుంటే నీకు ప్రాబ్లమ్ ఏంటి బావ.. నేను నీచుడ్ని దుర్మార్గుడిని అనే కదా.. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు.. నేను మారిపోయాను సిద్ధూ బావ.. అన్నీ వదిలేద్దాం.. ఇప్పుడు నేను ఏం చేస్తే నువ్వు నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావ్ సిద్ధూ బావ అని గణ అడుగుతాడు. దానికి సిద్ధూ నిశ్చితార్థం ఆపిన నేను పెళ్లి ఎలా చేస్తాను అని అనుకుంటున్నావ్ అని అడుగుతాడు. గణ షాక్ అయిపోతాడు. 

గణ సిద్ధూతో నేను నిన్ను ఒప్పించాలి అనుకుంటే నువ్వు ఇలా అంటావ్ ఏంటి.. ఇందాక మీ అమ్మ ఏం అందో విన్నావ్ కదా త్వరలోనే పెళ్లి.. మీ చెల్లి కూడా నో చెప్పదు.. అంత ఎందుకు మీ నాన్న కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు.. సిద్ధూ నీకో విషయం చెప్పనా.. అసలు నీ చెల్లితో నాకు పెళ్లి ప్రపోజల్ తెచ్చిందే మీ నాన్న కదా.. మీ ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేస్తే నువ్వు ఎలా పెళ్లి ఆపుతావ్.. నీ వల్ల కాదు.. ఇంకా చెప్పాలి అంటే మీ నాన్న కూడా ఈ పెళ్లి ఆపలేడు.. మీ చెల్లితో పెళ్లి చేయడం తప్ప మీరేం చేయలేరు అని చెప్పి వెళ్లిపోతాడు. 

సిద్ధూ ఆవేశంగా వీడు ఇలా మాట్లాడటానికి ఆ పెద్ద మనిషి కారణం అసలు తను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడో తెలుసుకునే తీరాలి అని సిద్ధూ ప్రేరణ ఆపినా వినకుండా వెళ్తాడు. విజయానంద్ మంజుల ఈ పెళ్లి కచ్చితంగా జరిగితీరాలి అని అన్న విషయం తలచుకొని ఏం చేయాలా అని అనుకుంటాడు. ఇంతలో సిద్ధూ కోపంగా రావడం చూసి సిద్ధూ ఆవేశానికి నా ఆలోచన వాడుకుంటా ఆ గణతో ఆడుకుంటా అని విజయానంద్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget