అన్వేషించండి

Nindu Manasulu Serial Today August 26th: నిండు మనసులు సీరియల్: గణ, రంజిత్‌ల మధ్య శత్రుత్వం ఉందా? ప్రేరణకు అండగా రంజిత్‌! కీలక మలుపు?

Nindu Manasulu Serial Today Episode August 26th ప్రేరణ ఐశ్వర్యలతో గణ గొడవ పడటం అవమానించడం రంజిత్ వచ్చి ప్రేరణ దగ్గర విషయం తెలుసుకొని ఇళ్లు దాటనివ్వకపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode పర్మిషన్ లేకుండా ఐశ్వర్య రంజిత్ గదికి వెళ్లిందని ప్రేరణ తిడుతుంది. రంజిత్‌ని బతిమాలడానికి లోపలికి వెళ్లే సరికి రంజిత్ ప్రేరణ వాళ్ల బ్యాగ్‌లు బయట పెట్టి కూర్చొని ఉంటాడు. ప్రేరణ రంజిత్‌ని ఎంత బతిమాలినా రంజిత్ ఒప్పుకోకుండా తన రూల్స్ బ్రేక్ చేసినందుకు పది నిమిషాల్లో ఇళ్లు ఖాళీ చేసేయమని చెప్పి బయటకు వెళ్తాడు. ప్రేరణ ఐశ్వర్యతో ఇప్పుడేం చేస్తాం.. అమ్మకి ఏం చెప్తాం అని చాలా కంగారు పడుతుంది. ఇంతలో గణ అక్కడికి వస్తాడు.    

గణ: ఏంటి ఎప్పుడు చూసినా మీరే కలుస్తున్నారు మీ అమ్మ కనిపించడం లేదు. ఈ సారి ఏ కొంప కూల్చడానికి వెళ్లిందో. ఎంత మందిని వలలో వేసుకోవడానికి వెళ్లిందో.
ప్రేరణ: రేయ్ మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు.
గణ: మీరు చేసే పనులకు మీకు మర్యాద దక్కుతుందా.. బ్రోకర్‌తో.. అవునురా ఒక ఫ్యామిలీకి ఇళ్లు ఇప్పించే ముందు వాళ్లు ఎవరు ఏంటో తెలుసుకొని ఇళ్లు ఇప్పించాలి కదా.. నేను అంతా మీ వాళ్లకి వీళ్ల గురించి చెప్పినా నువ్వు ఎలా వీళ్లకి ఇళ్లు ఇప్పిస్తావ్ రా. వీళ్ల అమ్మేమో అమాయకంగా ఎవరు దొరుకుతారా ఎలా వలలో వేసుకోవాలా అని చూస్తుంటే వీళ్లిద్దరూ వాళ్ల ఆస్తులను ఎలా కొట్టేయాలా అని చూస్తుంటారు.
ప్రేరణ: నోర్ముయ్ ఇంకొక్క మాట మా కోసం మాట్లాడితే నేనేం చేస్తానో నాకు తెలీదు.
గణ: వీళ్లతో కాదు కానీ ఓనర్‌ని పిలు వీళ్ల బాగోతం చెప్దాం.
ఐశ్వర్య: ఇంత అంటున్నావ్ కదా నువ్వు మమల్ని అన్నట్లే మీ అమ్మ మా నాన్నని పెళ్లి చేసుకొంది అని నువ్వు అక్రమ సంతానం అనిఅంటే నీకు ఎలా ఉంటుంది. మా నాన్నకి పుట్టా అంటావ్ కదా నీ లో ఆ సంస్కారమే లేదేంటి.
గణ: ఇది మీ సంస్కారం నన్ను మీలో కలిపేసుకున్నారన్నమాట. హైదరాబాద్ ఉన్న మా నాన్నని వైజాగ్ రప్పించుకుంది మీ అమ్మ. వలలో వేసుకుంది మీ అమ్మ. మీ ఇద్దరినీ కని మా నాన్నని బ్లాక్ మెయిల్ చేసింది కూడా మీ అమ్మే.
ఐశ్వర్య: సో మేం రాజశేఖరం గారి పిల్లలం అని నువ్వు ఒప్పుకుంటున్నావా. 
గణ: కనింది అన్నాను కానీ మా నాన్నకే పుట్టారని అనలేదు కదా. మా నాన్నలాగే మీ అమ్మకి బలైన పోయిన వారు ఎందరో. మీ అమ్మ దగ్గర ఉన్న లిస్ట్‌లో మా నాన్న నెంబరు ఎంతో. వాళ్లలో ఎవరికైనా మీరు పుట్టుండొచ్చు కదా. ప్రేరణ కొట్టడానికి చేయి ఎత్తితే నిజం చెప్తే పౌరుషం వస్తుందా అని అడుగుతాడు. 

మా నాన్న కళ్లు తెరిచే రోజు నీ పని ఉంటుంది. మా ఓర్పునకు ఓ హద్దు ఉంటుంది అని అంటుంది. ఇంతలో బ్రోకర్ వచ్చి ఓనర్ లేరు సార్ మీరు గొడవ చేయొద్దు ఆయన ఉంటే ఊరుకోరు. మేడం మీరు వెళ్లిపోండి అని బతిమాలుతుంది. ఇక ప్రేరణ చెల్లితో ఎలాగూ ఓనర్ వెళ్లిపోమన్నాడు కదా వెళ్లిపోదాం పద అంటుంది. గణ నవ్వి మీ గురించి తెలీకుండానే ఓనర్ వెళ్లిపోమని చెప్తాడా. వాడు ఎవడో కానీ చాలా టాలెంట్డె అని అంటాడు. ప్రేరణ వాళ్లు వెళ్తుంటే ఎదురుగా రంజిత్ ఉంటాడు.

గణ రంజిత్‌తో బాబు ఓనర్ ఒక సారి వెనక్కి తిరుగమ్మా అంటాడు. రంజిత్ తిరగగానే గణ షాక్ అయిపోతాడు. సీన్ చూస్తే గతంలో గణ, రంజిత్‌కి పెద్ద ఫ్లాష్ బ్యాక్‌ ఉన్నట్లుంది. గణ రంజిత్‌కి గొడవ జరిగి రంజిత్ షూట్ వదిలేసి పెద్ద బంగ్లాను వదిలేసి వెళ్లినట్లు చూపిస్తారు. గణ రంజిత్‌ని చూసి వీడా అని షాక్ అయిపోతాడు. ప్రేరణ ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక ప్రేరణ వాళ్లు వెళ్లిపోతుంటే రంజిత్ ఆపి నేను మొత్తం విన్నాను. అతను చెప్పేది నిజమా అబద్ధమా అని అడుగుతాడు. బ్రోకర్ సారీ చెప్తే చెప్పావ్ కదా ఇక బయల్దేరు అని అరుస్తాడు. ఇక నిజం కాబట్టే అని గణ చెప్పబోతే రంజిత్ చేతి సైగతోనే ఆపేస్తాడు.

ప్రేరణ వెళ్లిపోతా అంటే అతను చెప్పింది నిజమా అబద్ధమా చెప్పేసి వెళ్లిపోఅంటాడు. అంతా అబద్ధం సార్ అని ప్రేరణ ఏడుస్తుంది. అతను చెప్పేదంతా అబద్ధం సార్ మానాన్న యాక్సిడెంట్ మా జీవితాన్ని కుదిపేసింది. మా నాన్న కోసం మేం మా అమ్మతో ఇక్కడికి వస్తే కనీసం మా నాన్నకి కలవకుండా చేశాడు. నాన్న ఇంట్లోనే ఉన్నా చూపించకుండా గెంటేశాడని ఏడుస్తూ చెప్తుంది. మేం రాజశేఖరం పిల్లలం సార్ అలాంటప్పుడు మమల్ని అవమానించే అధికారం ఇతనికి ఎవరు ఇచ్చారు సార్ అని ఏడుస్తుంది. మేం ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదు అని మాకు తెలుసు సార్ మేం ఎవరికీ బాధ పెట్టాలి అనుకోం వెళ్లిపోతాం సార్ అని ప్రేరణ చెల్లిని తీసుకొని వెళ్లిపోతుంటే రంజిత్ ఆపి వాళ్లని లోపలికి వెళ్లమని చెప్తాడు. గణ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget