Prema Entha Madhuram August 3rd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ : పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న నీరజ్.. అను చేసిన వంటను గుర్తుపట్టిన ఆర్య?
యాప్ ఓపెనింగ్ కోసం ప్రీతి ఇంటికి వచ్చిన వర్ధన్ ఫ్యామిలీ సరదాగా గడపటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram August 3rd: అమ్మ చేత వంట యాప్ ఓపెనింగ్ కోసం ఆర్య ఫ్యామిలీ అంతా భాను ఇంటికి చేరుకుంటారు. ఆర్య ఆప్ కు సంబంధించిన రివ్యూస్ గురించి అడగటంతో ప్రీతి యాప్ కు వచ్చిన రివ్యూస్ తీసుకొని వచ్చి చూపిస్తుంది. ఇక అది చూసి అచ్చం అను లాగానే ఉన్నాయి ఐడియాస్ అని అనుకుంటాడు. ఇక ప్రీతి స్వీట్ తయారు అక్కడికి తీసుకొని వస్తుంది.
ఇక అక్కడే ఫుడ్ ఆర్డర్ పెట్టడం కూడా జరుగుతుంది. ఆర్య కి ఫుడ్ డెలివరీ చేస్తుండగా చేతికి ఉన్న గాయాన్ని చూసి టెన్షన్ పడి ఏం జరిగింది అని అడగటంతో చిన్న గాయమని అంటాడు ఆర్య. ఆ తర్వాత జిండే ఆ స్వీట్ టేస్ట్ చేసి మెచ్చుకుంటాడు. రేష్మ అందరికి స్వీట్స్ తీసుకొని వస్తుంది. ఆ తర్వాత అను ఆర్య చేతికయిన గాయాన్ని తలుచుకొని బాధపడుతుంది.
ప్రీతి వాళ్ళతో కేవలం పిల్లలని కలిసినందుకు అంత గాయం అయిందని బాధపడుతుంది. ఇక సార్ దగ్గరికి వెళ్తే ఇంకా ఏమైనా అవుతుందేమో అని భయపడుతూ ఉండటంతో వెంటనే ప్రీతి ఏమీ కాదు దోషానికి పరిహారం పూజ చేయించాము కదా కలిసిన ఏమీ కాదు అని.. అదంతా పొరపాటున జరిగాయేమో అనుకోమని ధైర్యం ఇస్తుంది.
ఆ తర్వాత అను వంట చేస్తూ ఉండగా నీరజ్, అంజలి పిల్లలను ఆడిపిస్తూ ఉంటారు. చాలా క్యూట్ గా ఉన్నారు అని సెల్ఫీలు దిగుతారు. అది చూసి మురిసిపోతుంది అను. నా పిల్లలని తెలియకున్న అంత ప్రేమ చూపిస్తున్నారు.. మరి నా పిల్లలని తెలిస్తే ఇంకా ఎంత ప్రేమ చూపిస్తారో అని అనుకుంటుంది. అంజలి దంపతులు పిల్లలతో సరదాగా ఆడుకుంటూ మాట్లాడుతూ ఉంటారు.
సరదాగా గొడవ పడుతూ ఉంటారు. ఇక మన గొడవ ఆగాలి అంటే వీరికి ఒక చెల్లినో, తమ్ముడినో ఇస్తే వాళ్ల గొడవ పడుకుంటారు అని అనటంతో అంజలి సిగ్గుపడుతుంది. అంటే పిల్లల కోసం ప్లాన్ చేద్దాము అన్నట్లుగా నీరజ్ మాట్లాడుతాడు. ఇక ఫోన్ మాట్లాడుతున్న ఆర్యను చూసి వెంటనే అను ని అక్కడికి పంపించాలి అని అను దగ్గరికి వెళ్లి ఆర్యకు వాటర్ ఇవ్వమని పంపిస్తుంది.
ఇక ఆర్య ఫోన్ మాట్లాడుతుండగా తన కంట్లో నలిక పడుతుంది. దానితో ఇబ్బంది పడటంతో అను చూసి వాటర్ తో కడుక్కోమని చెబుతుంది. అయినా కూడా కంటిలో నళికపోకపోవటంతో తను బుర్కా తీసి చూడాలనుకుంటుంది. కానీ వెంటనే బుర్కా వేసేసుకుంటుంది. ఆ తర్వాత వాటర్ తో క్లీన్ చేయగా నళిక పోతుంది.
ఆర్య వెంటనే అను అనడంతో నిజం తెలిసిపోయిందేమో అని షాక్ అవుతుంది అను. ఇక ఆర్య తనకు అను గుర్తుకొచ్చింది అని సారీ అని చెబుతాడు. ఆ తర్వాత వర్ధన్ ఫ్యామిలీ అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత అంజలి నైట్ డిన్నర్ కోసం అమ్మ చేతి వంట యాప్ నుండి ఆర్డర్ పెడుతుంది. అది చూసి ప్రీతి సంతోషపడుతుంది.
ఇంట్లో వాళ్లకి స్వయంగా తనే వంట చేస్తాను అని చెప్పి వంట చేసి పంపిస్తుంది. ఇక ఆ ఫుడ్డు తింటూ అది చేసింది అను అని గుర్తు పడతాడు ఆర్య. వెంటనే అది ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారో ప్రీతి వాళ్ళని అడగమని అంటాడు. అంజలి ప్రీతికి ఫోన్ చేసి అడగటంతో వాళ్ళు షాక్ అవుతారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial