అన్వేషించండి

Naga Panchami June 29th: ‘నాగపంచమి’ సీరియల్: పంచమికి వార్నింగ్ ఇచ్చిన నాగమణి, ఇంట్లో వాళ్లకు షాకిచ్చిన మోక్ష?

నాగమణి వచ్చి పంచమికి వార్నింగ్ ఇచ్చి వెళ్లడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Naga Panchami June 29th: చిత్ర వాళ్ళ పాప వచ్చి అందర్నీ పిలుస్తూ ఉంటుంది. దీంతో మోక్ష వాళ్ళ అత్త వాళ్ళు ఈరోజు అందరూ గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు. అంటే మేమందరం పెట్టుకోవాలా అని వరుణ్ వాళ్ళు అడగటంతో.. మీరు మాకు పెట్టాలి అంటూ వాళ్లు సమాధానం చెబుతారు. ఇక శబరి కూడా ఈ ఆషాడ మాసంలో అందరూ పెట్టుకోవాలి అని ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన వాళ్లు కూడా పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటుంది.

ఇక చిత్ర పంచమి పెట్టుకోవడం కోసం మా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నారన్నమాట అని అంటుంది. ఇక అందరూ గోరింటాకు గురించి మాట్లాడుతుండగా వైదేహి వచ్చి ఏం పని లేదా మీకు అంటూ కోపడుతుంది. దానితో మోక్ష కరెక్ట్ మమ్మీ అంటూ వెటకారంగా సమాధానం ఇస్తూ ఉంటాడు. వైదేహి కోపంగా వెళ్తుండటంతో తన భర్త ఆపి గోరింటాకు పెడతాను అని అంటాడు. అందరూ తమ భర్తలచే గోరింటాకు పెట్టించుకుంటూ ఉంటారు.

ఇక అందరూ గోరింటాకు పెడుతూ సరదాగా కబుర్లు పెడుతూ ఉంటారు. మోక్ష తన భామ శబరి కి పెట్టిన పంచమికి పెడతాడు. పంచమిని గోరింటాకు గురించి చెప్పటంతో పంచమి గోరింటాకు గురించి అద్భుతంగా చెప్పటంతో ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు. అంతేకాకుండా తమ తమ భార్యలందరికి భోజనాలు తినిపిస్తూ ఉంటారు.

ఇక మోక్ష పంచమికి తినిపిస్తుండటంతో వైదేహి కోపంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మోక్షకు పంచమి కాఫీ తీసుకొని వస్తుంది. ఇక కాఫీ బాగుంది అంటూ మెచ్చుకుంటాడు. తర్వాత మోక్ష పంచమిని గోరింటాకు చూపించమనటంతో గోరింటాకు చూసి ఫిదా అవుతాడు. అదే సమయంలో మోక్ష వాళ్ళ అత్త వచ్చి అక్కడ వారిని చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లికాని అమ్మాయిలకు ఇలా ఎర్రగా పండితే మంచి భర్త దొరుకుతాడని.. పెళ్లయిన అమ్మాయిలకు ఎర్రగా పండితే భర్త భార్యని బాగా చూసుకుంటాడు అని చెబుతుంటాడు.

అంతేకాకుండా తనను పొగుడుతూ ఉంటాడు. నీ చేతి గోరింటాకు ఇంత బాగా పండింది అంటే నీకు కాబోయే భర్త చాలా అదృష్టవంతుడు అని, మంచివాడు అని అనటంతో పంచమితో పాటు మోక్ష వాళ్ళ అత్తయ్య కూడా షాక్ అవుతుంది. నిన్ను బాగా చూసుకుంటాడని.. నిన్ను ప్రేమించే భర్త దొరుకుతాడు అని అంటుంటాడు. అప్పుడే తనకు ఫోన్ రావడంతో బయటికి వెళ్తాడు.

ఇక పంచమి బాధపడుతూ ఉండగా నాగమణి వచ్చి నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మీ మానవ రూపం మీద మానవ సంబంధాల మీద నమ్మకం పెంచుకున్నారు అని అంటుంది. అందుకే ఇలా మానసికంగా బాధపడుతున్నావని అంటుంది. నాగ లోకంలో మహారాణి స్థానంలో కూర్చొని రాజభోగాలు అనుభవించే నీవు ఇన్ని బాధల్ని భరిస్తూ ఎందుకు ఇలా బతకడం అవసరమా అని అంటుంది.

ఇక నేను ఇచ్చిన గడుపు దగ్గర పడుతుంది. పౌర్ణమి రోజు నువ్వు పాముగా మారక తప్పదని అంటుంది. ఇక ఈ మానవ ప్రేమ తగ్గించుకొని విరక్తి పెంచుకోమని చెబుతుంది. అప్పుడే నాగ కన్యగా సంతోషంగా ఉంటావు అని అంటుంది. మోక్ష నీ భర్త కాదు నువ్వు చంపాల్సిన శత్రువు అని కసి పెంచుకో అని అంటుంది. నీ చుట్టూ ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో తెలుసుకోలేకపోతున్నావు అని అంటుంది.

నీ శత్రువైన నంబూద్రి నీ చేతిలో తన చావును తప్పించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు అని.. పాములకు శత్రువైన గరుడ పక్షిని తనకు రక్షక పెట్టుకున్నాడు అని చెబుతుంది. తన ప్రయత్నాలు ఫలించినప్పుడు మీ అమ్మని చంపినట్లే నిన్ను కూడా చంపి తనకు శత్రువులు లేకుండా చేసుకోవాలని చూస్తున్నాడు అని చెబుతుంది.

ఇక వీళ్ళపై ప్రేమను పెంచుకుంటున్నావని దానివల్ల నీకు లేనిపోని కష్టాలు వస్తున్నాయని చెబుతుంది. దాంతో పంచమి నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా అంటుంది. నీకోసం ఏమైనా చేస్తాను అని నాగమణి అంటుంది. నేను పాముగా కాకుండా ఎప్పుడూ ఇలా పంచమిగా ఉండటానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పు అని అంటుంది.

దాంతో నాగమణి ఆశ్చర్య పోతుంది. మనిషిగా ఉండడానికి సహాయం చేయు అని వేడుకుంటుంది. దానితో నాగమణి నువ్వు మనిషిలాగ ఉండటానికి ఒక మార్గం ఉంది అంటూ.. నువ్వు పాముగా మారకుండా ఉండటానికి.. నేను నీకు చేయగలిగిన సహాయం ఏంటంటే.. ఈ రోజే పాపను కాటేసి చంపడం అని అంటుంది.

దాంతో పంచమి షాక్ అవుతుంది. రేపు మీ అమ్మా నాన్నల్ని.. తర్వాత ఈ ఇంట్లో వాళ్ళందరినీ అని.. రోజుకొకరి అని అంటుండగా పంచమి వద్దని వేడుకుంటుంది. పిచ్చిపిచ్చి ఆలోచనలు మానేసి నా మాటలు నమ్ము అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తరువాయి భాగంలో అందరూ తమ గదిలలో ప్లేస్ లేదని పంచమిని అవుట్ హౌస్ లో ఉండమని అనడంతో వెంటనే మోక్ష వచ్చి పంచమి నా దగ్గర ఉంటుంది అని తీసుకెళ్తాడు.

Also Read: Madhuranagarilo June 29th: ‘మధురానగరిలో’ సీరియల్: రాధను కాలనీ నుంచి వెళ్ళగొట్టేసిన సంయుక్త, అనుమానంలో శ్యామ్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget