Naga Panchami Serial Today March 23rd: మోక్ష, పంచమిలతో పాటు కడుపులో బిడ్డని చంపేయనున్న కరాళి, ఫణేంద్ర - నాగేశ్వరికి అండగా నాగదేవత!
Naga Panchami Serial Today Episode పంచమిని తన కడుపులో బిడ్డని చంపేయాలి అని కరాళి, ఫణేంద్రలు నిర్ణయించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode కరాళి దగ్గరకు ఫణేంద్ర వస్తాడు. మేఘన రూపంతో నీకు ఇక పని లేదు శాశ్వతంగా కరాళిగానే ఉండిపోవచ్చు అని అంటాడు. దీంతో కరాళి ఫణేంద్ర నీకు నా శక్తి తెలీక ఇలా మాట్లాడుతున్నావు అంటుంది. కరాళి ఓటమి భరించలేదు అని అంతకు వందరెట్లు పగ తీర్చుకుంటాను అని ఫణేంద్రకు చెప్తుంది. మరోవైపు నాగేశ్వరి పాము అక్కడికి వస్తుంది.
ఫణేంద్ర: నువ్వెంత రెచ్చిపోయిన మోక్షను తెచ్చి బలి ఇవ్వలేవు. నీ శక్తులను తిరిగి పొందలేవు. పంచమి పన్నిన కుట్రలో నువ్వు నేను ఇద్దరం బలి అయిపోయాం. నాగలోకం తీసుకెళ్లి పంచమిని పెళ్లి చేసుకోవాలి అని ఎన్నో కలలు కన్నాను. నా ఆశలు అన్నీ కలలైపోయాయి. పంచమి నన్ను మోసం చేసింది. తెల్లారితే పెళ్లి.. మేఘన మెడలో మూడుముళ్లు వేయగానే నాతో వచ్చేస్తా అని చిలక పలుకులు పలికింది. అది నమ్మి నేను నాగలోకం వెళ్లి వచ్చేలోగా మొత్తం తారుమారు అయిపోయింది. ఇక పంచమిని నేను నాగలోకం తీసుకెళ్లలేను నాగదేవతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను. నా కలలను నెరవేర్చుకోలేను.
కరాళి: పంచమి చేతిలో చిత్తుగా ఓడిపోయావ్ ఫణేంద్ర. ఇక నువ్వు చేయగలిగేది ఏం లేదు. నీ నాగలోకం వెళ్లిపో.
ఫణేంద్ర: అది జరగని పని కరాళి. పంచమిని వదిలిపెట్టను. తన జీవితంలో సంతోషం అనేదే లేకుండా చేస్తాను.
కరాళి: అంటే ఏం చేయగలవు ఫణేంద్ర. మోక్షని చంపేస్తావా..
ఫణేంద్ర: పంచమిని కూడా బతకనివ్వను కరాళి. ఇద్దర్ని చంపేస్తా..
కరాళి: మోక్ష ఇక నా యజ్ఞానికి పనికిరాడు. చంపేయొచ్చు. ఇక పంచమితో నాకు పనిలేదు. అయినా చంపాల్సిన అవసరం లేదు ఫణేంద్ర. బతికుండగానే వాళ్లకి నరకం చూపించాలి. పంచమి కడుపులో బిడ్డ ముందు బలి కావాలి. అప్పుడే వాళ్లిద్దరూ కుమిలి కుమిలి చస్తారు.
నాగేశ్వరి: వీళ్లని ప్రాణాలతో వదలకూడదు. ఇప్పుడే కాటేసి చంపేస్తాను. అని వెళ్లిబోయిన నాగేశ్వరి.. గతంలో మంత్ర శక్తితో కరాళి తనకి శాపం పెట్టి దీపంలా మార్చేసిన సంగతి గుర్తు చేసుకొని ఆగిపోతుంది.
కరాళి: వాళ్లని వలకూడదు. వాళ్లు ప్రాణాలతో ఉండాలి కానీ క్షణక్షణం నరకం అనుభవించాలి. నువ్వు నేను చెప్పినట్లు వింటే మనం చాలా సాధించొచ్చు. నేను శక్తులు సంపాదించాలి అంటే నాకు నీ సాయం కావాలి అదేంటో ముందు ముందు నేను చెప్తాను.
నాగేశ్వరి: వీళ్లని ఏదో ఒకటి చేసి కట్టడి చేయాలి. నేను మళ్లీ కరాళి చేతిలో బందీని అయిపోతే పంచమిని కాపాడలేను. తన కడుపులో పెరుగుతున్న మహారాణిని నాగలోకం పంపించలేను. వీళ్లతో పోరాడితే గెలుస్తానో ఓడిపోతానో తెలీదు. మహారాణి కోరిక నెరవేర్చడం నాకు ముఖ్యం నేను పక్కనే ఉండి పంచమిని కాపాడుకోవాలి.
మరోవైపు వైదేహి తన భర్తకు పంచమి గురించి చెప్తుంది. ఇంట్లో పాములు తిరుగుతూ ఉంటే పిల్లలు భయపడుతున్నారని పంచమిని ఇంటి నుంచి పంపేయాలి అంటుంది. పంచమి తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని చెప్పిందని ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ అబద్ధమని అంటుంది. దీంతో రఘురాం మోక్ష సంతోషం మనకు ముఖ్యమని అంటాడు.
వైదేహి: పాములకు పంచమికి ఏదో సంబంధం ఉందండి అదేంటో మనం తెలుసుకోలేకపోతున్నాం.
రఘురాం: నీకు పంచమి గురించి అన్ని విషయాలు తెలిసిన తర్వాతే కదా మనం పంచమిని కోడలిగా తీసుకొచ్చాం. ఇప్పడు పాములతో పంచమికి సంబంధం ఉంది అంటావ్ ఏంటి.
వైదేహి: అప్పుడు మన మోక్షను నాగగండం నుంచి తప్పించడానికి పంచమి నాకు దేవతలా కనిపించింది.
రఘురాం: ఓహో ఇప్పుడు మనకు అలాంటి అవసరం లేదు కాబట్టి పంచమిని ఇంటి నుంచి తన్ని తరిమేయాలి అంటున్నావు.
వైదేహి: పంచమి మోక్ష జీవితంలో ఉంటే నాకు నిద్ర కూడా పట్టదండి. తనని పంపేయాలి. ఈ విషయంలో మీరు మౌనంగా ఉండండి.
నాగదేవత: నాగేశ్వరి ధ్యానంతో దర్శనం ఇచ్చి. నాగేశ్వరి నీకు అప్పగించి బాధ్యత సక్రమంగా నెరవేర్చి ఉంటే ఇప్పుడు అందరికీ ఇన్ని కష్టాలు ఉండేవి కాదు అంటుంది.
నాగేశ్వరి: నేను నా శాయశక్తులా పోరాడాను మాత. యువరాణి మనసు మార్చడానికి నేను చాలా శ్రమపడ్డాను. నన్ను క్షమించండి మాతా ఆ కరాళి కారణంగా నేను ఏం చేయలేకపోయాను.
నాగదేవత: సంవత్సరాలుగా రాణి లేకుండా నాగలోకం ఉండిపోయింది. రాణి లేని లోటు ఎప్పుడూ నాగలోకానికి ఏర్పడలేదు.
నాగేశ్వరి: మహారాణి విశాలాక్షి గారే ఆ సమస్యను పరిష్కారం చూపబోతున్నారు మాతా.
నాగదేవత: అదెలా సాధ్యం నాగేశ్వరి ఎప్పుడో మరణించిన విశాలాక్షి. ఏం చేయగలదు.
నాగేశ్వరి: యువరాణికి వచ్చిన ప్రమాదం గురించి మీకు చెప్పడానికి ఎంతో వేడుకున్నాను. కానీ మీ దర్శన భాగ్యం నాకు దక్కలేదు మాతా. ఏలోకంలో ఉన్నా కూతురు కోసం ఏదైనా సాయం చేయగలరు అన్న ఆశతో మహారాణి గారి కోసం ప్రార్ధించాను. దీంతో ఆత్మగా ఉన్న మహారాణి నాకు దర్శనమిచ్చారు. మహారాణి పంచమి కడుపున నాగాంశతో పుట్టి నాగలోకం వచ్చేస్తానని చెప్పారు. రాణి లేని లోటు తీర్చాలి అని ఆశ పడ్డారు. అందుకు తగ్గట్టే ఇక్కడి పరిస్థితులు కలిసి వచ్చాయి. యువరాణి భర్తతో కలవడం మహారాణి తన కూతురు గర్భంలో చేరడం అన్నీ జరిగిపోయాయి మాతా.
నాగదేవత: మంచి శుభవార్త చెప్పావు నాగేశ్వరి. మహారాణి నాగలోకం రావడం చాలా మంచి పని.
నాగేశ్వరి: అందుకు కూడా చాలా ఆటంకాలు ఉన్నాయి మాతా. యువరాణికి ఇంటా బయట చాలా మంది శత్రువులు ఉన్నారు.
నాగదేవత: అర్థమైంది నాగేశ్వరి మహారాణిని నాగలోకం తీసుకొచ్చే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను ఈ పని అయినా సక్రమంగా నెరవేర్చు.
నాగేశ్వరి: తప్పకుండా మాతా కానీ యువరాజు శత్రువుతో చేతులు కలిపాడు మాతా. ఆ కరాళి, యువరాజు ఇద్దరు కలిసి యువరాణికి ప్రమాదం తలపెట్టారు మాతా.
నాగదేవత: నీకు నా ఆశీసులు ఉంటాయి. నీ శక్తి నాకు తెలుసు. నీకున్న నాగ శక్తితో నువ్వే ఎదుర్కొవాలి. ఫణేంద్ర విషయంలో కూడా నువ్వే చూసుకో.
నాగేశ్వరి: నేను చూసుకుంటా మాతా నాగలోకానికి రాణి లేని లోటు నేను తీర్చుతాను.
మరోవైపు పంచమికి తన తల్లి గౌరి ఫోన్ చేస్తుంది. పంచమికి జాగ్రత్తలు చెప్తుంది. పంచమి తన నాగాంశ తన బిడ్డకు కూడా సంక్రమిస్తుందేమో అని భయపడుతుంది. దీంతో గౌరి అలా ఏం జరగదు అని ధైర్యమిస్తుంది.
మరోవైపు పంచమిని పంపేస్తున్నారా లేదా అని చిత్ర, జ్వాలలు వైదేహిని అడుగుతారు. శబరి కోపంతో పంచమి ఇక్కడే ఉంటుంది బిడ్డని కంటుంది. ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోండి అని చెప్తుంది. దీంతో వైదేహి అత్తయ్య గారు మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడకండి నేను చూసుకుంటా అని వైదేహి అంటుంది. ఇక మీనాక్షి తన అన్నతో అన్నయ్య ఏంటిది వాళ్లిద్దరూ సంతోషంగా ఉంటే మధ్యలో వీళ్ల గోల ఏంటని ప్రశ్నిస్తుంది. ఇక పంచమిని వైదేహి నిలదీస్తుంది. మీ వల్ల మేఘన అన్యాయం అయిపోయిందని అంటాడు. రఘురాం కూడా ఇద్దర్ని నిలదీస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: నాని శనివారం : స్థిర శనివారం సమవర్తి… ఒక్క ఫొటోతో హైప్ క్రియేట్ చేసేసిన నాని