Naga Panchami Serial Today March 11th: 'నాగ పంచమి' సీరియల్: పంచమిని కాపాడటానికి రంగంలోకి దిగిన నాగేశ్వరి.. చచ్చినా పెళ్లి చేసుకోనని తెగేసిన మోక్ష!
Naga Panchami Serial Today Episode త్వరలోనే పంచమిని మెడిసిన్‌తో మామూలు మనిషిగా మార్చుతాను అని మోక్ష చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
Naga Panchami Today Episode మోక్ష తన తల్లి, ప్రొఫెసర్ మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పంచమి వస్తే పంచమి ఈ పెళ్లి జరగదు అని చెప్తాడు. కొంచెం టైం ఇస్తే ప్రొఫెసర్ మందు కనిపెడతా అని చెప్పారు అని అప్పుడు నువ్వు మామూలు మనిషిగా మారిపోతావు అని మనం హ్యాపీగా ఉండొచ్చని మోక్ష పంచమిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు.
పంచమి: మోక్షాబాబు మీకు మేఘనకు నిశ్చితార్థం అయిన సంగతి మర్చిపోకండి.
మోక్ష: నిశ్చితార్థం.. నిశ్చితార్థం ఏంటి ఈ నాన్‌సెన్స్.. ఎవరు చేయమని అడిగారు. నేను చేయమన్నానా..
పంచమి: మాట మార్చకండి మోక్షాబాబు మీకు తెలీకుండా ఉంగారాలు మార్చుకోలేదు.
మోక్ష: అవునా అయితే ఇది తీసేస్తా.. అని రింగ్ విసిరేసి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అంటాడు. మన పెళ్లి జోక్‌గా జరిగిందా పంచమి. అందరి ముందే కదా జరిగింది. దాన్నే నువ్వు బ్రేక్ చేయాలి అనుకుంటే ఈ నిశ్చితార్థం ఎంత. ఇవన్నీ అనవసరం మనం కలిసే ఉంటాం. ఈ పెళ్లి జరగదు అని మేఘనకు నువ్వే చెప్పు.
పంచమి: ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు నిలకడగా ఉండవు. మీ పెళ్లి నేను నాగలోకం వెళ్లిపోవడం ఖాయం.
మోక్ష: నేను ఒప్పుకోను పంచమి. నిన్ను మార్చుకోవచ్చు అనే ధైర్యంతో నేను ఒప్పుకున్నా.. కానీ రెండు రోజుల్లో పెళ్లి అంటే నేను ఒప్పుకోను.
పంచమి: నేను మామూలుగా మారి మనం సంతోషంగా ఉండటం అనేది ఈ జన్మకు జరగదు.
మోక్ష: నేను జరిపిస్తాను పంచమి. ఎంత డబ్బు ఖర్చు అయినా ఆ మెడిసిన్ కనిపెట్టిస్తా..
మరోవైపు కరాళి మహాంకాళి దర్శనం కోసం మొక్కుకుంటుంది. తనని కరుణించమని వేడుకుంటుంది. మహాంకాళి ప్రత్యక్షం కాకపోవడంతో చేయి కత్తితో కట్ చేసుకుంటుంది. రక్తం చిందిస్తుంది. అయినా మహాంకాళి రాకపోవడంతో తలను రాయికి బాదుకుంటుంది. దీంతో కళ్లు తిరిగి పడిపోతుంది. కరాళి రక్తం చిందిన రాయి నుంచి నాగేశ్వరి అనే నాగ కన్య బయటకు వస్తుంది.
నాగేశ్వరి: ఈ కరాళి బతికే ఉంది. యువరాణి ఎక్కడుందో ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడే ఉంటే ఈ కరాళి ద్వారానే తెలుస్తాయి. మరోవైపు పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వస్తుంది.
పంచమి: స్వామి నా గమ్యం ఏంటో నన్ను ఎక్కడికి చేర్చాలి అనుకుంటున్నావో తెలియజేయండి స్వామి. నేను ఆ దారిని వెతుక్కుంటూ వెళ్లిపోతాను. సుబ్బు రావడంతో.. సుబ్బు నా కష్టాలు అన్నీ నీకు తెలుసు. ఆ స్వామికి తెలుసు. మోక్షాబాబు తీరు మళ్లీ మొదటకు వచ్చింది సుబ్బు. మేఘనను పెళ్లి చేసుకోను అని మొండికేస్తున్నారు.
సుబ్బు: మోక్ష మాటల్ని ఆక్షేపించడానికి ఏమీ లేదు కదా పంచమి.. మాంగల్యం విలువ తెలిసిన వాళ్లు ఎవరైనా అలాగే అంటారు.
పంచమి: నా బాధ అర్థం చేసుకుంటే అలా మాట్లాడరు సుబ్బు.
సుబ్బు: భార్య బాధని అర్థం చేసుకున్నాడు కనుకే వేరే పెళ్లికి ఒప్పుకోవడం లేదు.
పంచమి: నేను భార్యగా తనకి తగను.. ఎలా అయినా ఈ పెళ్లి జరగాలి. లేదంటే మోక్షాబాబు ప్రాణాలకే ముప్పు. మోక్షాబాబు అంటే నాకు ప్రాణమే. కానీ తన సంతోషం కోసం నేను తప్పుకోక తప్పదు.
సుబ్బు: నాకు ధర్మం మోక్ష వైపే కనిపిస్తోంది.
మరోవైపు మహాంకాళి కరాళికి ప్రత్యక్షమై లేపుతుంది. ఇక నాగేశ్వరి చాటుగా దాక్కుంటుంది. కరాళి త్వరలోనే మోక్షను బలిచ్చి తన శక్తులు తిరిగి పొందుతాను అంటుంది. ఇక నాగేశ్వరి పాములా మారి మొత్తం వింటుంది. ఇక మహాంకాళి కరాళిని హెచ్చరిస్తుంది. అయినా కరాళి మొండిగా ప్రవర్తిస్తుంది. ఇక నాగేశ్వరి తమ యువరాణి ప్రమాదంలో ఉందని ఎలా అయినా కాపాడుకోవాలి అని అనుకుంటుంది.
మోక్ష: ఇంట్లో అందర్ని పిలిచి.. నేను ఈ పెళ్లి చేసుకోవడం లేదు. కనీసం నాకు ఆలోచించే టైం కూడా ఇవ్వకుండా ఎల్లుండే మా పెళ్లి అని మీరు మీకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
వైదేహి: సరే నీ ఇష్టప్రకారం చేస్తాం డేట్ నువ్వే చెప్పు మోక్ష. అలా అని రోజులు వారాలు వాయిదా వేయకు.
మోక్ష: అమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను. క్యాన్సిల్ చేసేయండి.
రఘురాం: మోక్ష ఇది కరెక్ట్ కాదు. నువ్వు అలా మాట్లాడకూడదు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్లే.
మోక్ష: డాడ్ నాకు పంచమికి ఇదివరకే పెళ్లి అయిపోయింది. అలాంటి మా పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి ఒక్క నిమిషం ఆలోచించని మీరు ఇప్పుడిలా ఎందుకు.
పంచమి: మనల్ని ఎవరూ విడదీయలేదు. మనమే నిర్ణయించుకున్నాం మోక్షాబాబు.
మోక్ష: నేను ఓకే చెప్పలేదు. నువ్వే నిర్ణయం తీసుకున్నావు.
ఇక అటు తిరిగి ఇటు తిరిగి మోక్ష పెళ్లికి అన్‌ఫిట్ అని జ్వాల, చిత్రలు అంటారు. వైదేహి అయితే పెళ్లి ఫిక్స్ అయిపోయింది అందులో మార్పు లేదు అంటుంది. బలవంతంగా తాళి కట్టించలేరు అని మోక్ష అంటే ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది ఎవరూ భయపడకండి అని పంచమి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.