అన్వేషించండి

Naga Panchami Serial Today January 31st - 'నాగ పంచమి' సీరియల్: మేఘనని పెళ్లి చేసుకుంటానని పంచమితో చెప్పిన మోక్ష, కరాళికి క్లారిటీ ఇచ్చిన మహాంకాళి!

Naga Panchami Serial Today Episode: మేఘనను పెళ్లి చేసుకుంటున్నానని మోక్ష పంచమితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode: పంచమి శివాలయం దగ్గర కూర్చొని మోక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోక్షతో తాను సరదాగా ఉన్న రోజుల్ని గుర్తు చేసుకొని ఏడుస్తుంటుంది. ఇంతలో మోక్ష అక్కడికి వస్తాడు. పంచమి వెళ్లిపోతుంటే మోక్ష పిలుస్తాడు. 

మోక్ష: పంచమి నిన్ను తీసుకెళ్లిపోవడానికి వచ్చాను. బయల్దేరు వెళ్దాం. నాకు బాగా అర్థమైంది. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏ పని చేయలేను ఒక పిచ్చొడిలా తిరగడం తప్ప. అవును మా అమ్మ కూడా నువ్వు ఆలోచించినట్లే ఆలోచిస్తుంది. నేను వేరే పెళ్లి చేసుకుంటే నిన్ను మర్చిపోతా అనుకుంటుంది. కానీ అది జరగదు. నేను కోరుకునేది నా మనసుకు తోడు అది నువ్వు తప్ప ఇంకొకరు కాలేదు. ఇక్కడ నువ్వు ఎలా ఒంటరిగా కూర్చొన్నావో నా పరిస్థితి అక్కడ అదే పంచమి. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోదాం రా పంచమి. మా అమ్మ చెప్పినా చివరకు ఆ దేవుడు చెప్పినా నీ చేయి వదిలిపెట్టను. రా పంచమి..
పంచమి: మోక్ష చేయి వదిలించుకొని.. ఈ గుడిలోనే మనం పెళ్లి చేసుకొని ఒకటయ్యాం. కానీ ఆ పంచమి, మోక్షాబాబు ఇద్దరూ ఇప్పుడు లేరు. మీరు పునర్జన్మఎత్తారు ఆ పంచమి పాములా మిగిలింది. ఇప్పుడు మీ లోకం వేరు నా లోకం వేరు. మీ జీవితం మీది నా జీవితం నాది. 
మోక్ష: ఇప్పుడు నేను ఏం వినే స్థితిలో లేను పంచమి  మా అమ్మనాకు పెళ్లి చేయాలని ప్రయత్నిస్తుంది.
పంచమి: మంచి ప్రయత్నమే మోక్షాబాబు. ఏమీ ఆలోచించకుండా వెళ్లి పెళ్లి చేసుకోండి. ఇప్పుడు మీ గాయాలు మానటానికి అదే సరైన మందు.
మోక్ష: నేను సీరియస్‌గా చెప్తున్నా పంచమి.. అర్జెంట్‌గా నాకు పెళ్లి చేయాలి అని చూస్తుంది మా అమ్మ నేను కాదంటే చనిపోతాను అని బెదిరిస్తుంది. ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాను.
పంచమి: నా సలహా కూడా అదే.. మీరు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి అంటే అది ఒక్కటే మార్గం.. 
మోక్ష: లేదు పంచమి నిన్ను తీసుకెళ్లాలని గట్టిగా నిర్ణయించుకొని వచ్చాను.
పంచమి: ఈ జన్మకు అది జరగదు. అవును మోక్షాబాబు నేను మీతో రావడం అనేది మర్చిపోండి..
మోక్ష: ప్లీజ్ పంచమి.. మేఘనని పెళ్లి చేసుకుంటానని మా అమ్మని నమ్మించి ఇక్కడికి వచ్చాను. నువ్వు రాకపోతే మా అమ్మ నిజంగానే నాకు మేఘనకి పెళ్లి చేసేస్తుంది.
పంచమి: ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. 
మోక్ష: నేను చెప్పేది కూడా అదే కదా పంచమి.. అందుకే నువ్వు వచ్చేయ్ వెళ్లిపోదాం..
పంచమి: నేను రాను.. కానీ ఆ పెళ్లి జరగడానికి వీళ్లేదు. మేఘన నాలానే నాగకన్య.. అవును మోక్షాబాబు మేఘన ఒక నాగకన్య.. తనని కలిస్తే మీరు చనిపోతారు. ఎందుకు ఏంటి అని నేను చెప్పలేను మోక్షాబాబు. కొన్ని దుష్టశక్తులు ఇప్పటికే మిమల్ని వదిలిపెట్టడం లేదు. ఆ శక్తులతో మీకు సంబంధం లేదు. మీరు మాత్రం మేఘనను పెళ్లి చేసుకోవద్దు.
మోక్ష: నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడే ఫిక్స్ అయ్యాను పంచమి. నేను మేఘననే పెళ్లి చేసుకుంటాను. 
పంచమి: మోక్షాబాబు అది మీ ప్రాణాలకే ప్రమాదం..
మోక్ష: అందుకే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు రాను అన్న తర్వాత నేను బతికి ఉండటం అనవసరం. నీకు మా అమ్మకి కావాల్సింది నేను మరో పెళ్లి చేసుకోవడమే కదా. మీ కోరిక నేను నెరవేరుస్తాను. ఇప్పుడే వెళ్లి మేఘనను పెళ్లి చేసుకొని హాయిగా చనిపోతా.
పంచమి: మోక్షాబాబు.. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆ కరాళి మేఘనను వశీకరణ చేసుకొని మీ మీద ప్రయోగించింది. నాకు కూడా ఆ విషయం ఇప్పుడే తెలిసింది. 
మోక్ష: అవన్నీ నాకు అనవసరం పంచమి. మేఘన విషకన్య కలిస్తే చనిపోతారు అది ఒక్కటే చాలు.. వస్తాను పంచమి.. వచ్చి ఆ పెళ్లి ఆపితే నేను ప్రాణాలతో ఉండి మనద్దరం కలిసి ఉంటాం. లేదంటే ఈ మోక్ష లోకంలోనే ఉండడు. నీ భర్తని బతికించుకుంటావో చంపుకుంటావో నీ ఇష్టం.  

మేఘన: అద్దంలో కరాళిని చూస్తూ.. ఎలా ఉన్న నేను ఎలా అయిపోయాను. మహామంత్రగత్తిగా ఉన్న నేను శక్తులు అన్నీ పొగొట్టుకొని మళ్లీ మొదటికి వచ్చాను. ఎప్పుడు నేను మళ్లీ మహామంత్ర గత్తెను అయి అందర్ని శాసించగలను.. మళ్లీ ఆరోజులు రావాలి కరాళి. నువ్వు తలచుకుంటే ఏమైనా సాధ్యం..  మహాంకాళిని ధ్యానం చేస్తుంది.
మహాంకాళి: అంతా నీ స్వయంకృపారాధం కరాళి మీ అన్న నంబూద్రి పరమ దుష్టుడు అని చెప్పినా నువ్వు చెవికి ఎక్కించుకోలేదు. నా మాటను దిక్కరించి మీ అన్నని కాపాడుకోవాలిన చూశావు. అందుకే సర్వం పోగొట్టుకున్నావు. ఇప్పుడు చింతిస్తున్నావు. 
మేఘన: తోడబుట్టిన అన్నని కాపాడుకోవాలనే తపించాను తప్పితే మిమల్ని ఎదురించాలి అని కాదు మాతా.. 
మహాంకాళి: ఇప్పుడు పశ్చాత్తాపపడిన ప్రయోజనం లేదు కరాళి. నీకు నేను ప్రసాదించన శక్తులను దుర్వినియోగం పరిచావు.. 
మేఘన: అమ్మా ఈ కరాళికి పూర్వ వైభవం కలిగించు మళ్లీ మహా మంత్ర గత్తెను చేయు తల్లీ.. పెళ్లి అయినా సరే బ్రహ్మచారిగా ఉన్న మోక్షని బలి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాను.  కానీ మనసును ఒక సందేశం తొలస్తుంది తల్లి. ఎప్పుడూ నన్ను అంత కఠిన పరీక్షలు పెట్టలేదు తల్లీ. కానీ ఈసారి బలి కోరడంలో మర్మం ఏంటో అర్థం కావడం లేదు.
మహాంకాళి: కొందరి శక్తి సామర్థ్యాలు బయట పడాలి అంటే అందుకు తగ్గ పరీక్షలే పెట్టాలి. దుష్ట శిక్షణలో అదో భాగం. 

మరోవైపు జ్వాల, చిత్రలు బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మేఘన అటుగా రావడం చూసి మేఘనని పిలుస్తారు. ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని అడుగుతారు. మేఘన సైగ చేసి గుడికి వెళ్లానని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్ జనవరి 31st : మిస్సమ్మని అపార్థం చేసుకున్న అమర్.. వాచ్ మ్యానే భాగీ తండ్రని తెలుసుకున్న అరుంధతి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget