అన్వేషించండి

Naga Panchami Serial Today January 24th: మోక్షని దూరం చేసుకున్నందుకు ఏడుస్తున్న పంచమి.. సుబ్బు మాటలతో మారుతుందా!

Naga Panchami Serial Today Episode: మోక్షని కావాలనే దూరం చేసినందుకు పంచమి ఏడుస్తుండగా సుబ్బు ఓదార్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode:  జ్వాల, చిత్రలు ఇంట్లో టిఫెన్ చేస్తూ మాట్లాడుకుంటారు. మోక్ష ప్రతీ సారి చావు అంచుల వరకు వెళ్లి బతకడం ఏంటి అని చిత్ర అంటుంది. ఇక అందతా తమ ఖర్మ అని అందుకే మోక్ష మళ్లీ తిరిగి ఇంటికి వస్తున్నాడు అని బాధపడుతుంది. దానికి జ్వాల కొందరికి కొందరి చేతుల్లో చావు రాసిపెట్టి ఉంటుందని తన చేతిలో మోక్ష చనిపోతాడని అంటుంది.

చిత్ర: నాకు అయితే అనుమానంగా ఉంది అక్క. పాము కాటుతో మోక్ష చనిపోతాడు అంటే ఆ నాగగండం తప్పిపోయి నూరేళ్లు బతికేలా ఉన్నాడు.
జ్వాల: అంత సీన్ లేదు. నేను టైం చూసి డేట్ ఫిక్స్ చేస్తే ఎవరికైనా చావు ఖాయం. నాకు చిరాకు వస్తే ఇంట్లో అందరూ ఒకే రోజు పోవడం పక్కా. 
చిత్ర: అర్థమైంది మోక్ష బతికి తిరిగి వస్తున్నాడు అని నీ కడుపు రగిలిపోతుంది. వాళ్లు  వచ్చేసినట్లు ఉన్నారు అక్క పద. ఏంటి అక్క పంచమి రాలేదు. 
వైదేహి: ఆగు మోక్ష. నేను నీకు జన్మనిచ్చిన తల్లిని అయినా నువ్వునాకు రుణ పడి ఉండక్కర్లేదు. కానీ నీకు మళ్లీ ప్రాణం పోసిన ఈ మేఘనకు మాత్రం రుణపడి ఉండాలి. మేఘన బతికించింది నిన్ను ఒక్కడ్నే కాదు మోక్ష మా అందర్ని కూడా. నీకు ఏమైనా జరిగి ఉంటే మేం కూడా ప్రాణాలతో ఉండేవాళ్లం కాదు. ఒక దేవతలా ప్రత్యక్షమై వల్లకాడు అయిపోతున్న ఈ ఇంటిని గుడిలా మార్చింది.
మేఘన: మనసులో.. నేను మోక్షని బతికించింది మీ కోసం కాదు. నా కోసం. నా కోసం బలి ఇవ్వడానికి. 
వైదేహి: అమ్మా మేఘన నీకు మేం ఏం చేసినా ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. 
మేఘన: మీ మోక్ష జీవితం ఎవరికో ఉపయోగపడాలి అని ఉంది. అది జరిగేంత వరకు ఇక మోక్ష ప్రాణాలకు ఢోకా లేదు. ధైర్యంగా ఉండొచ్చు.
జ్వాల: ఏంటి మోక్ష ఒక్క రోజులో సీన్ మొత్తం రివర్స్ అయింది. పంచమి స్థానంలో మేఘన వచ్చింది ఏంటి.
చిత్ర: మొన్నటి దాక ఈ ఇంటి ఇలవేల్పు మా పంచమి అని అందరూ నెత్తినపెట్టుకు తిరిగారు. ఇప్పుడు చూస్తే పంచమి అనే క్యాండిడేటే మనకు కనపడటం లేదు. 
వైదేహి: ఆపండి.. ఇంకొక్కసారి ఈ ఇంట్లో దాని పేరు వినిపించడానికి వీలు లేదు. అది ఈ ఇంట్లో నుంచే కాదు మోక్ష జీవితం నుంచి కూడా పూర్తిగా తొలగిపోయింది. 
మోక్ష: మీరెవ్వరూ నాలోనుంచి పంచమిని దూరం చేయలేరు. అలా జరిగిన రోజు నేను ఉండను. ఎందుకు అంటే పంచమి నా ప్రాణం నాలోపలే ఉంది కాబట్టి. 
మేఘన: మనసులో.. వీడి గుండె కోసినా పంచమినే కనిపించేలా ఉంది. వీడి నుంచి పంచమిని దూరం చేయలేనా.. మోక్షని బలిస్తే పంచమిని అక్కడ బలి ఇచ్చినట్లే. నా శక్తుల కోసం కాకపోయినా పంచమి మీద పగ తీర్చుకోవడం కోసమైనా మోక్షని బలి ఇచ్చి తీరాల్సిందే. 

పంచమి: మోక్షాబాబు నన్ను క్షమించండి. మీ దగ్గర ఉన్న కొన్ని రోజులు నాకు కొన్ని యుగాలు. ఏ విధంగాను నేను మీ భార్యగా సరిపోను. అయినా మీరు నన్ను గుండెలో పెట్టుకొని చూసుకున్నారు. ఈ జన్మకు నాకు ఇది చాలు. ఇక మీరు నాకోసం ఎలాంటి కష్టం పడకూడదు. మీరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి. అదే నా కోరిక. ఇక ఈ పంచమిని మర్చిపోండి.
మోక్ష: తన ఇంట్లో.. నో పంచమి.. నువ్వు నన్ను వదులు కోవాలి అనుకున్నా నేను నిన్ను వదులు కోను. నీ కోసం ఈ లోకానికి వదులుకోవడానికి సిద్ధమే. ఎవరూ మన ఇద్దర్ని విడదీయలేరు. నువ్వు నా పక్కనే ఉంటే చాలు పంచమి నేను ఎవరినైనా ఎదురిస్తాను. నాకారణంగా నీ జీవితం రిష్క్‌లో పడకూడదు. నువ్వు హ్యాపీగా ఉండాలి.  
మేఘన: తనలో తాను.. పంచమిని ఓడించాలి అని నేను సర్వం కోల్పోయాను. కానీ పంచమికి పోతాడు అనుకున్న భర్త ప్రాణాలతో ఉన్నాడు. ఎవరూ దగ్గరకు వెళ్లలేరు అన్నంతగా మోక్ష మనసు గెలుచుకుంది. అన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. తోడపుట్టిన వాడిని శాశ్వతంగా కోల్పోబోతున్నాను. పుట్టుకతో వచ్చిన రూపాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సంపాదించుకున్న శక్తులు అన్నీ పోయాయి. మళ్లీ ఈ కరాళికి పూర్వవైభవం రావాలి అంటే మహాకాళి చెప్పినట్లు చేయక తప్పదు. మోక్షని బలి ఇచ్చి శక్తులు సంపాదించుకోవాలి. పంచమికి శాశ్వతంగా దూరం చేయాలి. 
ఫణేంద్ర: తనలో తాను.. అంతా యువరాణి వల్లనే. తన మొండితనంతో ఎవరికీ సంతోషం లేకుండా పోయింది. యువరాణిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలి అనుకున్నాను. చివరకు నాగలోకంలోనే నాకు స్థానం లేకుండా పోయింది. ఏం చేయాలో తెలీని అయోమయంలో పడిపోయాను. 

పంచమి: సుబ్బు నువ్వా ఎంత సేపు అయింది నువ్వు వచ్చి. నన్ను పిలవొచ్చు కదా..
సుబ్బు: నీ బాధని కనీళ్ల రూపంలో పోగొట్టుకుంటున్నావ్ కదా పంచమి అందుకే పిలవలేదు. 
పంచమి: నా దుఖాన్నికి అంతం ఎక్కడుంది సుబ్బు. నిరంతరం ఏడుస్తున్నా నాలోని కనీళ్లు తరగవు. 
సుబ్బు: బాధలు లేని మనిషి కష్టాలు లేని ఇళ్లు ఉండవు పంచమి. 
పంచమి: మోక్షబాబుకి ప్రాణ గండం పోయింది. తాను ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. ఇక నాకు ఏ బాధ లేదు.
సుబ్బు: నువ్వు వదులు కున్నది నీ సంతోషాన్ని కష్టాన్ని కాదు పంచమి. అందరూ దండలు మార్చుకొని పెళ్లి చేసుకుంటే మీరు మనసులు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. మీరు సజీవంగా ఉన్నంత వరకు ఒకరిని ఒకరు మర్చిపోవడం జరగదు పంచమి. 
పంచమి: జరగాలి సుబ్బు మోక్షాబాబు నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. మేం కలిసి ఉన్నంత కాలం మోక్షాబాబుకి ఏ సుఖము సంతోషం ఉండదు.
సుబ్బు: మానసిక ఆనందం మకరందం లాంటిది పంచమి కంటికి కనిపించదు. శారీరక సుఖం అద్దంగా కనిపించే పువ్వు. 
పంచమి: చెప్పినా నీకు అర్థం కాదు సుబ్బు. ఇక నేను ఎప్పటికీ మోక్షాబాబుకి దగ్గర కాలేను.
సుబ్బు: నువ్వు ప్రేమతో పెంచుకునే చెట్టు ఎవరైనా నరికేస్తే చూస్తూ ఉండగలవా.. కాయలు కాయకపోయినా చల్లటి నీడని ఇస్తుంది. అందుకే మీరు ఒకర్ని వదిలి ఒకరు ఉండలేరు. 
పంచమి: అది జరిగే పని కాదు సుబ్బు. ఇక మేం కలవం అది జరగదు.. అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ జనవరి 23rd: ఇంటికి వచ్చేస్తున్న ఆదర్శ్.. టెన్షన్‌తో తలపట్టుకున్న ముకుంద!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget