అన్వేషించండి

Naga panchami serial today January 15th: చనిపోతాను అని వెక్కివెక్కి ఏడ్చిన మోక్ష.. పంచమిలా రూపం మార్చుకున్న మేఘన!

naga panchami serial today Episode నాగమణి కోసం మేఘన పంచమిలా రూపం మార్చుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

naga panchami today Episode: నాగ సాధువు ఫణేంద్రతో నాగచంద్రకాంత మొక్క తీసుకురావడమే మంచిదని చెప్తారు. దాన్ని తన మంత్ర శక్తితో చూసిన కరాళి షాకైపోతుంది. ఇక ఫణేంద్ర ఆ మొక్క తీసుకురావడానికి తనకు ఏం ఇబ్బంది లేదని యువరాణి, తాను వెళ్లి తీసుకొస్తామని అంటాడు. దీంతో పంచమి మొక్క కోసం నేను ఎందుకు నువ్వు తెచ్చేయ్ అని చెప్తుంది. దీంతో ఇంకా నన్ను అనుమానిస్తున్నావా అని ఫణేంద్ర పంచమిని అడుగుతాడు.

పంచమి: నిన్ను మేం పూర్తిగా నమ్ముతున్నాం ఫణేంద్ర.
ఫణేంద్ర: అప్పుడు ఒక పని చేద్దాం యువరాణి. నువ్వు ఒక్కదానివే నాగలోకం వెళ్లి ఆ మొక్కని తీసుకొచ్చే నేను ఇక్కడ ఉండి మోక్షకు విషం తలకు ఎక్కకుండా నాగసాధువు గారితో కలిసి ప్రయత్నిస్తాను. అవసరం అనిపిస్తే నేను కూడా కొంత విషాన్ని బయటకు లాగగలను. నువ్వు ఆ మొక్క తీసుకురావడానికి మార్గం నేను చెప్తాను. మన ఇష్టరూప జాతికి ఒక వరం ఉంటుంది. ఎక్కడైనా ప్రమాదంలో ఉండి తప్పించుకునే మార్గం లేనప్పుడు ఒక మంత్ర చదివితే నేరుగా నాగలోకం వెళ్లిపోవచ్చు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. అయితే ఎవరికైనా ఆ మంత్రం ఒక్కసారే పనిచేస్తుంది. ఒక్కరికే పనిచేస్తుంది. నీ కోసం నేను ఆ మంత్ర శక్తిని వదులుకుంటాను. 
నాగసాధువు: ఈ ఆలోచన బాగానే ఉంది ఫణేంద్ర. ఇక్కడ ఉండటం మోక్షకు కూడా శ్రేయస్కరమే అవుతుంది. 
పంచమి: నేను ఆ మొక్కని గుర్తు పట్టి తీసుకురాగలనా యువరాజా..
ఫణేంద్ర: అది చాలా సులభం యువరాణి. నాగలోకం చేరగానే అక్కడ చాలా నీటి కొలనులు ఉంటాయి. ప్రతి నీటి కొలనులోనూ అడుగులో గుంపులు గుంపులుగా ఈ మొక్కలు పెరుగుతాయి. నీళ్లలో ఆ మొక్కలు ప్రత్యేకంగా మెరుస్తుంటాయి. నేను చెప్తే మంత్రం చదివితే నువ్వు నీటి అడుగుకు వెళ్లగలవు. చాలా సునాయాశంగా నువ్వు ఆ మొక్కని తీసుకురాగలవు యువరాణి. అయితే ఇదే తుది నిర్ణయం అందరూ సమ్మతమేగా..
నాగసాధువు: ఈ పద్ధతి సబబుగానే ఉంది. 

మేఘన: వీళ్లంతా కలిసి చివరికి నా ఆశల మీద నీళ్లు చల్లారు. నాగమణిని తీసుకురాకపోతే నా కార్యం నెరవేరదు. వీళ్లని నమ్ముకుంటే కాదు. ఏదో ఒకటి చేసి నేనే ఆ నాగమణిని సంపాదించుకోవాలి అని మేఘన మహాంకాళిని ధ్యానిస్తుంది. 

నాగసాధువు: నాగలోకం నుంచి పంచమి రావడం ఆలస్యం అయితే ఇక్కడ మోక్ష ప్రాణాలకు చాలా ప్రమాదం. ఒక్కసారి ఇష్టరూపనాగుల విషం ఒంట్లోకి వెళ్లిన తర్వాత ప్రతీ క్షణం నరకంలా ఉంటుంది. 
ఫణేంద్ర: ఆ విషం వేగంగా ప్రమాదం చూపకుండా కొంత విషాన్ని నేను బయటకు లాగగలను. 
నాగసాధువు: ఏమైనా ప్రాణాలను పణంగా పెట్టే వ్యవహారం. అందుకే నేను వెళ్లి కొన్ని మూలికలు సంపాదించుకొని వస్తాను. అవి కొంత మేరకు ప్రాణాలను కాపాడుతాయి. పంచమి తిరిగి వచ్చేంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. 

మోక్ష: పంచమి ఫణేంద్ర చేతిలో చావడం కంటే ఈరోజు నీ చేతుల్లో హాయిగా చనిపోతాను.
పంచమి: అంటే మీకు బతుకుతాను అన్న నమ్మకం లేదా మోక్షాబాబు.
మోక్ష: నువ్వు పాము అయి కాటేస్తే నేను చనిపోవడం ఖాయం. నన్ను బతికించడం అనేది అద్భుతం అది జరగొచ్చు. జరగకపోవచ్చు. 
పంచమి: నాకు ఇది పెద్ద అగ్ని పరీక్ష. పంచమిగా ఇదంతా చూస్తూ ఊరుకోలేను. నాగ కన్యగా నేనే కాటేసి మళ్లీ నేనే కాపాడాలి. పంచమిగా మీకు ఏమైనా అయిపోతుందేమో అన్న భయంతో నలిగిపోతున్నాను. అదే సమయంలో నాలోని నాగకన్య నువ్వు బతికించుకోగలవని ధైర్యం చెప్తుంది. 
మోక్ష: ఇంకేం ఆలోచించకు పంచమి సమయానికి నువ్వు ఆ మొక్క తీసుకురాగలిగితే నేను బతుకుతాను. ఆలస్యం అయితే నేను చనిపోతాను.  నన్ను పూర్తిగా మర్చిపోయి నువ్వు నాగలోకం వెళ్లిపో.. నీ జీవితం నువ్వు అనుభవించు. 

మరోవైపు మేఘనకు మహాంకాళి దర్శనమిస్తుంది. తనకి పంచమి రూపం ఇవ్వాలని మహాంకాళిని వేడుకుంటుంది. మహాంకాళి కుదరదు అన్నా పట్టుపడుతుంది. దీంతో మహాంకాళి దిగొచ్చ మేఘనకు పంచమి రూపం ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే దానికి ఒక కండీషన్ పెడుతుంది. మేఘన ఒకసారి నాగలోకంలో అడుగుపెట్టిన తర్వాత అప్పటి వరకు తనకున్న అన్ని శక్తులు పూర్తిగా నశించిపోతాయి అని చెప్తుంది. ఇక ఆ శక్తులు ఎప్పటికీ రావు అని హెచ్చిరిస్తుంది. అయితే మేఘన మాత్రం పర్వాలేదు అని పంచమి రూపం ఇమ్మని అడుగుతుంది. దీంతో మహాంకాళి ఓకే చెప్పడంతో పంచమిలా మేఘన మారిపోతుంది. 

ఇక మోక్ష తన ఫ్యామిలీని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతాడు. తన కుటుంబం అంతా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అని ఇక తాను ఎప్పటికీ వాళ్లకి కనిపించను అని ఏడుస్తాడు. అది చూసి పంచమి కూడా ఏడుస్తుంది. ఒకసారి చనిపోయిన మనిషి తిరిగి బతకడు అని మోక్ష అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ జనవరి 15: తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాజ్ కు చెప్పిన కావ్య – శోభనం విషయంలో కావ్యను దూరం పెట్టిన ధాన్యలక్ష్మీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: పుంగనూర్ భూమి వివాదంపై  ప్రాథమిక నివేదిక సిద్ధం- తర్వాత ఏంటీ?
పుంగనూర్ భూమి వివాదంపై ప్రాథమిక నివేదిక సిద్ధం- తర్వాత ఏంటీ?
Hyderabad Youtuber: హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్, రీల్స్ చేసేవారికి పోలీసుల వార్నింగ్!
హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్, రీల్స్ చేసేవారికి పోలీసుల వార్నింగ్!
Garuda Movie: మహేష్‌బాబు, రాజమౌళి సినిమా పేరు
మహేష్‌బాబు, రాజమౌళి సినిమా పేరు "గరుడ"- సోషల్ మీడియాలో వైరల్‌
Tirumala News: తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక
తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: పుంగనూర్ భూమి వివాదంపై  ప్రాథమిక నివేదిక సిద్ధం- తర్వాత ఏంటీ?
పుంగనూర్ భూమి వివాదంపై ప్రాథమిక నివేదిక సిద్ధం- తర్వాత ఏంటీ?
Hyderabad Youtuber: హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్, రీల్స్ చేసేవారికి పోలీసుల వార్నింగ్!
హైదరాబాద్ యూట్యూబర్ అరెస్ట్, రీల్స్ చేసేవారికి పోలీసుల వార్నింగ్!
Garuda Movie: మహేష్‌బాబు, రాజమౌళి సినిమా పేరు
మహేష్‌బాబు, రాజమౌళి సినిమా పేరు "గరుడ"- సోషల్ మీడియాలో వైరల్‌
Tirumala News: తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక
తిరుమల టికెట్లు ఇలా బుక్ చేసుకుంటున్నారా? అదొక స్కామ్! టీటీడీ హెచ్చరిక
Pawan Kalyan: పవన్ ఇలా- సురేష్ గోపీ అలా -సినిమాలు, రాజకీయాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్
పవన్ ఇలా- సురేష్ గోపీ అలా -సినిమాలు, రాజకీయాలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్
Ram Charan: కూతురు క్లింకారాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ - ఆ బహుమతికి ‘మగధీర’తో లింక్ ఉంది, ఏంటో చెప్పుకోండి!
కూతురు క్లింకారాకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్ - ఆ బహుమతికి ‘మగధీర’తో లింక్ ఉంది, ఏంటో చెప్పుకోండి!
Rocky Flintoff: వాడి కొడుకు వచ్చాడని చెప్పు,  భవిష్యత్తులో
వాడి కొడుకు వచ్చాడని చెప్పు, భవిష్యత్తులో " సలాం రాకీ భాయ్ అనాల్సిందేనా "
Telangana News: మహిళా జర్నలిస్టులపై సీఎం అనుచరుల దాడి! డీజీపీకి ఫిర్యాదు
మహిళా జర్నలిస్టులపై సీఎం అనుచరుల దాడి! డీజీపీకి ఫిర్యాదు
Embed widget