Naga Panchami Serial Today February 7th: 'నాగ పంచమి' సీరియల్: మేఘనతో తన పెళ్లి దగ్గరుండి పంచమికి చేయమన్న మోక్ష.. కరాళిని హెచ్చరించిన మహాంకాళి!
Naga Panchami Serial Today Episode తన ఇంట్లో ఉంటూ నిశ్చితార్థం పెళ్లి తన చేతులమీదే దగ్గరుండి చేయించమని మోక్ష పంచమికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode ఫణేంద్ర పాముగా మారడం చూసి చిత్ర షాక్ అయిపోతుంది. చిత్రని చూసిన ఫణేంద్ర మళ్లీ పాముగా మారిపోతాడు. పాముగా మారిన ఫణేంద్ర చిత్ర దగ్గరకు రావడంతో పాము పాము అంటూ చిత్ర చిందులేస్తుంది. ఇంట్లోకి వెళ్లి మనిషి పాముగా పాము మనిషిగా మారిందని చెప్తుంది.
వైదేహి: ఆ దరిద్రం మళ్లీ ఇంట్లోకి వచ్చింది కదా దాని వల్లే ఇవన్నీ. మోక్షకు దానితో ఇంత సేపు ఏం మాటలు ఉంటాయ్. భార్గవ్ వెళ్లి వాళ్లని పిలవరా..
శబరి: ఆగు భార్గవ్ వాళ్లు ఎంత సేపు మాట్లాడితే అంత మంచిది.
వైదేహి: అది ఎంత చేసు మాట్లాడినా దాన్ని ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను.
మీనాక్షి: పంచమి మోక్ష ఇంకా భార్యాభర్తలే వదినా. వాళ్లిద్దరూ కలిసి ఉండాలి అనుకుంటే ఎవరూ ఏం అనలేరు.
వైదేహి: నేను అంటాను. కొంచెం అయినా సిగ్గు ఉండేదే అయితే మళ్లీ ఈ గడప తొక్కేదే కాదు.
పంచమి: మోక్షాబాబు మేఘన ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. నాకూ మోక్షాబాబుకి ఇక ఎలాంటి సంబంధం లేదు. మేం ఒక నిర్ణయానికి వచ్చేశాం. దీనివల్ల మా ఇద్దరికీ మంచి జరుగుతుంది. నేను భార్యగా మోక్షాబాబుకి తగను.
వైదేహి: నువ్వు మా స్థాయికి తగవు అని తెలిసి కూడా బుద్ధి తక్కువై చేసుకున్నాం. చూడు ఇప్పుడు అనుభవిస్తున్నాం.
మేఘన: పంచమి నీ ఫ్రెండ్‌గా నీ శ్రేయాభిలాషిగా చెప్తున్నా మోక్షాబాబుని వదులుకోవద్దు.
వైదేహి: నువ్వేందుకు అమ్మా దాన్ని బతిమిలాడుతావ్.. ఈ మహా తల్లిని నేను ఒక్క నిమిషం కూడా భరించలేను. అది ఎంత త్వరగా ఈ ఇంటి నుంచి వెళ్లిపోతే అంత మంచిది.
పంచమి: అవును అమ్మగారు నావల్ల మీ అందరికీ చాలా కష్టాలు కలిగుండొచ్చు మీ అందరూ నన్ను క్షమించు మీరంతా సంతోషంగా ఉండండి.
మోక్ష: అప్పుడే నీ బాధ్యత తీరిపోలేదు పంచమి. నీ చేతుల మీదగానే మా నిశ్చితార్థం పెళ్లి జరగాలి. అన్నీ నువ్వే దగ్గరుండి జరిపించాలి.
వైదేహి: నీకేమైనా పిచ్చా మోక్ష శుభమాఅని మీరు పెళ్లి చేసుకుంటూ ఈ మహాతల్లిని ఎదురుగా పెట్టుకుంటావా..
మోక్ష: అవసరం మమ్మీ. ఈరోజు మన ముందు మంచిగా మాట్లాడి కరెక్ట్‌గా పెళ్లి రోజు వచ్చి ముహూర్తం టైంకి ఆపింది అంటే మనం ఏం చేయలేం. మా పెళ్లి అయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నిజంగా నీ మనసులో మరో ఆలోచన లేకపోతే నేను చెప్పినట్లు చేయాలి. మా పెళ్లి కి నువ్వే సాక్ష్యం. అప్పుడే నీకు మా ఆస్తి మీద కానీ నా మీద కానీ ప్రేమ లేదు అని నమ్ముతాను.
పంచమి: సరే మోక్షాబాబు. మీ పెళ్లి వరకు ఇక్కడే ఉంటాను.
మరోవైపు కరాళి మహాంకాళిని దర్శించుకుంటుంది. మోక్షని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. మహాంకాళి అనుకున్నవన్నీ జరగువు అని చెప్తుంది. తలపెట్టిన పని మంచిది అయితేనే అందుకు దైవం సహకరిస్తుంది అని.. సృష్టికి నష్టం తలపెట్టే పనులు జరగవు అని అంటుంది. అయితే తాను కేవలం మహామంత్రగత్తెగానే ఉండాలి అనుకుంటున్నాను అని కరాళి చెప్తుంది. ఇక ఇలాంటి పనులకు దైవబలం తోడు ఉండదు అని మహాంకాళి చెప్తుంది. మేఘన కంగారు పడుతుంది. ఇక తర్వాత మేఘన తన అన్న ఆత్మని రప్పించి మహాంకాళి తనని భయపెడుతుంది అని చెప్తుంది. నంబూద్రీ సాయం కావలి అని కోరుతుంది.
మోక్ష: పంచమి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే.. పంచమి నీ మనసు ఎంత రాయిలా మార్చుకున్నా నా పక్కన నువ్వు మరో అమ్మాయిని ఊహించుకోలేవు పంచమి. నీలో నువ్వు కన్నీరు కార్చుకుంటూ నీ బాధ బయటపడకుండా నీ బాధని నువ్వు కట్టడి చేసుకొని ఎంత బలవంతంగా నాకు మరో పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నావ్. నాకు తెలుసు పంచమి నన్ను నువ్వు దూరం చేసుకోలేవు. అందుకు నువ్వు నీ మనసును ఎంత బంధించినా అది జరగదు. నీ మనసు నాకు తెలుసు పంచమి. ఆ మనసును నువ్వు ఎక్కువ కాలం కట్టడి చేయలేవు. నువ్వే ఈ పెళ్లి ఆపుతావ్. పంచమి మనకు పిల్లా పాపలు వద్దు మనిద్దరమే ఒకరికి ఒకరు తోడుగా చివరి వరకు ఉందాం.
పంచమి: మనం ఒకరి కోసం ఒకరు పుట్టి ప్రయాణం మొదలు పెట్టలేదు. అనుకోకుండా మధ్యలో కలిశాం. ఆ తోడు శాశ్వతం కాదు. ఒక్కసారి ఆలోచించండి మోక్షాబాబు నేను అనేదాన్ని మీ జీవితంలోకి రాకుండా ఉండుంటే మీరు చాలా సంతోషంగా ఉండేవారు.
మోక్ష: లేదు పంచమి నాగగండంతో చనిపోయేవాడిని. అలా జరిగినా బాగుండేది.
పంచమి: ఇక మీకు ఆ సమస్యలేదు. పెళ్లి తర్వాత అన్నీ మర్చిపోతారు. ఈ పంచమి పరిచయం మీకు ఓ కలలా ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.