అన్వేషించండి

Naga Panchami Serial Today April 5th: 'నాగ పంచమి' సీరియల్: పంచమి కడుపులో విష పురుగు, సోది చెప్పిన కరాళి.. లగేజ్ సర్దేసిన అన్నాదమ్ముళ్లు!

Naga Panchami Serial Today Episode సోదమ్మ గెటప్ వేసి వైదేహి నట్టింట్లో కూర్చొన్న కరాళి పంచమి కడుపులో పాము వల్ల ఇంట్లో అందరూ చనిపోతారు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode చిత్ర, జ్వాల, వరుణ్, భార్గవ్‌లు మాట్లాడుకుంటూ ఉంటే ఫణేంద్ర అక్కడికి వస్తాడు. అతన్ని చూసి అందరూ పాము అని గట్టిగా అరుస్తారు. ఫణేంద్ర వాళ్లతో ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నేను పంచమి బంధువుని అని అంటాడు. వాళ్ల కళ్లెదురుగానే పాముగా మారుతాడు. దీంతో అందరూ భయపడతారు. మళ్లీ మనిషిగా మారుతాడు. ఇక ఫణేంద్ర మాట్లాడుతూ దగ్గరకు వెళ్తే రావొద్దు అని అందరూ గట్టిగా అరుస్తారు.

ఫణేంద్ర: ఏంటి భయపడుతున్నారా.. నేను పంచమి బంధువును. మనం మనం చుట్టాలం. మీకు పంచమి గురించి ఒక విషయం చెప్పటానికి వచ్చాను. మా పంచమి కూడా పామే. పంచమి కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు పాము. 

ఫణేంద్ర వాళ్లతో అలా చెప్పగానే నాగేశ్వరి పాము అక్కడికి వస్తుంది. దీంతో జ్వాలా వాళ్లు ఇంకో పాము అని భయపడతారు. కేకలు వేస్తారు. ఆ పాము కూడా నాగేశ్వరిలా మారడంతో షాక్ అయిపోతారు.

నాగేశ్వరి: ఏంటి ఫణేంద్ర నాగదేవత శపించినా కూడా ఇంకా వెళ్లడం లేదు. వెళ్లిపోతావా లేదంటే కాటేసి చంపేయ్ మంటావా..
ఫణేంద్ర: పంచమిని వదిలి పెట్టి నేను ఎక్కడికి వెళ్లను. 
నాగేశ్వరి: నీకు చావు రాసి పెట్టి ఉంది. అందుకే నీకు ఇలాంటి బుద్ధి పుట్టింది. నీ సంగతి ఇప్పుడే తేల్చేతాను అంటూ నాగేశ్వరి మంత్రాలు చెప్పడంతో ఫణేంద్ర భయంతో పాములా మారి వెళ్లిపోతాడు. జ్వాలా వాళ్లతో.. తను చెప్పిన మాటలు నమ్మకండి.. తనకు పంచమికి ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ జరిగిన విషయం ఇక్కడే మర్చిపోండి. ఎవరికైనా చెప్పాలి అని చూశారో మీ అంతు చూస్తా. అలాగే మీరు పంచమి విషయంలో అతిగా ప్రవర్తిస్తున్నారు. పంచమి జోలికి వెళ్లకండి ఎవరైనా పంచమికి ద్రోహం తలపెట్టారో కాటేసి చంపేస్తా జాగ్రత్త..

ఆ సీన్ అంతా చూసి చిత్ర కళ్లుతిరిగి పడిపోగా.. భార్గవ్ కుప్పకూలిపోతాడు. మరోవైపు కరాళి సోదమ్మ గెటప్‌లో వైదేహి నట్టింట్లో వచ్చి కూర్చొంటుంది. వైదేహి చూసి నిన్ను ఎవరు పిలిచారు. లోపలకి ఎందుకు వచ్చావ్ అని అని అడిగిగే సోది చెప్తానని నన్ను తరిమేస్తావ్ కానీ మృత్యువుని తరిమేస్తావా నువ్వు అని ప్రశ్నిస్తుంది.

కరాళి: ఈ ఇంట్లో చావు చిందులేస్తుందే తల్లి. ఈ ఇంట్లో అందరూ ఒకే సారి పుటుక్కుమంటారే. నట్టింట్లో కూర్చొని చెప్తున్నానే తల్లి ఆ తల్లి అబద్ధం చెప్పదు. నేను చెప్పేది వింటే మీరు బాగు పడతారు. లేదంటే నష్టపోతారు. ఈ ఇంట్లో ఒకరి కడుపులో ఒక నలుసు పడిందే.. ఆ నలుసు మనిషి రూపం కాదే. పుట్టబోయేది విషపురుగే..  మనిషి కడుపున పాము పుట్టబోతుందే.. అది ఈ ఇంటికి మంచిది కాదు తల్లీ. ఆ పాము భూమ్మద పడితే అంతా ఒక్కసారి చస్తారే తల్లి. ఈ ఇంట్లో పాములు తాండవిస్తున్నాయే తల్లీ. మనుషుల రూపంలో మసలుకుంటున్నాయే తల్లి. ఈ ఇంటి మీద పగతో తిరుగుతున్నాయే తల్లి. మొత్తాన్ని మట్టుపెట్టి పోతాయే తల్లి. వస్తాను సామీ.. 

అందరూ ఆలోచనల్లో పడతారు. ఇక భార్గవ్, వరుణ్ ఫ్యామిలీలు లగేజ్‌లు సర్దుకొని వస్తారు. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని అంటారు. ఆస్తులు కూడా వద్దని బతికి ఉంటే ఏదో ఒకటి చేసుకుంటామని అంటారు. మళ్లీ రాము అంటారు. ఒకసారి వెళ్తే మరి ఇంటికి రారు అని వైదేహి వాళ్లని అంటే మీరు పిలిచినా మేం రాము అని అంటారు. ఇక పంచమిని పాము అంటారు. దీంతో మోక్ష వాళ్ల మీద సీరియస్ అవుతాడు. మీకు ఇష్టముంటే ఉండండి లేదంటే ఎక్కడికైనా వెళ్లి చావండి అంటాడు. పంచమి జోలికి వస్తే చంపేస్తా అంటాడు. మోక్షతో గొడవ పడ్డ అన్నాదమ్ములు ఆస్తి చిల్లగవ్వ కూడా అవసరం లేదనేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: సత్యని ఇంప్రెస్ చేయడానికి హీరోలా రెడీ అయిన క్రిష్‌.. మొగుడు పెళ్లాల గిల్లిగజ్జాలు అదుర్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget