అన్వేషించండి

Naga Panchami Serial Today April 25th: 'నాగ పంచమి' సీరియల్: గురుడ రాజు నుంచి శక్తులు పొందిన కరాళి.. పంచమికి స్కానింగ్ చేయించనున్న వైదేహికి ఆ నిజం తెలిస్తే!

Naga Panchami Serial Today Episode నాగలోకం మీద పగ తీర్చుకునేందుకు కరాళి గురుడ రాజుకి ధ్యానం చేసి శక్తులు పొందడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Naga Panchami Today Episode వైదేహి మోక్ష మాటలను తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. వైదేహిని చూసిన జ్వాల, చిత్రలు వైదేహికి తగిలించాలి అనుకుంటారు. అత్తయ్యని రెచ్చ గొట్టి తల్లీ కొడుకులు గొడవ పడేలా చేయాలని అనుకొని వైదేహి దగ్గరకు వెళ్తారు. 

జ్వాల: ఎవరు ఎన్ని చెప్పినా మీరు మీ మనసు మార్చుకోవద్దు అత్తయ్య. ఇంకా పుట్టని బిడ్డ కోసం చెట్టంత బిడ్డని మీరు పొగొట్టుకోవద్దు. 
చిత్ర: మోక్షను ఆ పంచమి కంట్రోల్‌లో పెట్టుకుంది అత్తయ్య. ఈ ఇంట్లో ఎవరు ఏమైనా పంచమి పట్టించుకోదు. తనకి ఏం కావాలో అదే చేస్తుంది.  
వైదేహి: నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గట్టిగా లాగితే తాడు తెగిపోతుంది కానీ ప్రయోజనం లేదు. మోక్షకు నాకు మధ్య ఇప్పటికే దూరం పెరిగింది.  
జ్వాల: అలా అంటే ఎలా అత్తయ్య.. 
చిత్ర: కోపంతో మోక్ష దారిలోకి వచ్చేలా లేడు అత్తయ్య ఏదైనా మంచిగా ఉండే సాధించాలి అత్తయ్య. 
జ్వాల: అవును అత్తయ్య నేను కచ్చితంగా చెప్తున్నా పంచమి కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు.
చిత్ర: మంచిగా మాట్లాడి స్కానింగ్‌కు తీసుకెళ్లండి అత్తయ్య. స్కానింగ్‌లో తేడా వస్తే మిమల్ని ఎవరూ అడ్డుకునేవాళ్లు ఉండరు. ఆలోచించండి..

నాగేశ్వరి: పంచమి గర్భంలో బిడ్డను ఇంత వరకు కాపాడుకుంటూ వచ్చాను మాతా. నేను ప్రాణాలతో ఉంటానో ఉండనో అన్న భయంతో తన గర్భంలో పెరుగుతున్నది తన తల్లి అని పంచమికి చెప్పాను మాతా. ఇక ఆ బిడ్డని పంచమినే కాపాడుకుంటుంది మాతా..
నాగదేవత: బిడ్డ పుట్టగానే నాగలోకం తీసుకెళ్లిపోతానని పంచమికి చెప్పావా నాగేశ్వరి.
నాగేశ్వరి: లేదు మాతా అలా చెప్తే ఏ పంచమి కుమిలిపోతుంది.
నాగదేవత: కానీ మనకు ఆ బిడ్డ అవసరం కదా నాగేశ్వరి. ఆ బిడ్డ మనకు అవసరం నాగేశ్వరి. ఇక నాగదేవత నాగేశ్వరి గాయాలు మాన్పిస్తుంది. పుట్టిన తర్వాత ఆ బిడ్డను పంచమి దగ్గర నాగలోకం తీసుకురావాల్సింది నువ్వే. పంచమిని మనం మోసం చేయడం లేదు. నిజానికి పంచమి స్వయంగా వచ్చి మన నాగలోకానికి రాణిలా ఉండాలి. కానీ ఆ బాధ్యత పంచమి నెరవేర్చలేదు. ఆ ఫలితంగా ఇప్పుడు పంచమి బిడ్డను దూరం చేసుకోవాల్సి వస్తుంది. 

మరోవైపు వైదేహి పూజ చేస్తుంది. పంచమికి ప్రేమగా హారతి ఇస్తుంది. ఇక శబరి పంచమికి టిఫెన్ తినిపించమని మోక్షకు చెప్తుంది. ఇక వైదేహి పంచమికి ఏమీ తినొద్దు అని స్కానింగ్‌కు వెళ్దామని చెప్తుంది. ఇక చిత్ర, జ్వాలలు పుల్లలు పెడుతుంటే శబరి వాళ్లని తిడుతుంది. 

వైదేహి: మమల్ని పరాయి వాళ్లని చేయకు పంచమి. బిడ్డను కనాలి అని మీరు నిర్ణయం తీసుకున్నారు నేను కాదు అనను. గుండెను రాయి చేసుకొని అన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పడేశాను. మోక్ష నాకు ఇప్పుడు ఏ ఆలోచన లేదు. నా కోడలికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అన్న తాపత్రయం తప్ప ఇంకేంలేదు.
మోక్ష: అమ్మా నువ్వు మనసు మార్చుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ ఇప్పుడు స్కానింగ్ అవసరం లేదు. 
వైదేహి: అలా అనకు మోక్ష. మన ఫ్యామిలీ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తా ఇక ఈ విషయంలో నువ్వేం మాట్లాడకు. డెలివరీ వరకు ఒక్క డాక్టర్‌ని ఫాలో అవ్వడమే బెటర్. నేను తీసుకెళ్లి ఒకసారి అన్ని టెస్ట్‌లు చేయించి తీసుకొస్తాను. నా మీద నీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పు మోక్ష. 
భార్గవ్: ఇప్పుడు ఈ డిస్కషన్లు అవసరం లేదు. పంచమిని తీసుకొని వెళ్లి స్కానింగ్ చేయించండి అప్పుడే అన్నీ తేలిపోతాయి.
పంచమి: అత్తయ్య గారు స్కానింగ్‌కి వెళ్దాం పదండి.
మోక్ష: అవసరం లేదు పంచమి. 
పంచమి: మీరు వీళ్ల అనుమానాలు పెంచుతున్నారు. 
మోక్ష: సరే పదమ్మా నేను వస్తాను.
వైదేహి: నువ్వు వస్తే ఇంకా సంతోషం మోక్ష. 

మరోవైపు కరాళి గురడ దేవుడికి ధ్యానం చేస్తుంది. దీంతో గురుడ రాజు కరాళి దగ్గరకు వస్తాడు. ఎందుకు తన కోసం ధ్యానం చేశావని  ప్రశ్నిస్తాడు. దీంతో కరాళి తనని తాను పరిచయం చేసుకుంటుంది. నాగ జాతి మీద తన పగను చెప్తుంది. దీంతో ఇష్టరూపజాతి మీద పగ తీర్చుకోవడం సాధ్యం కాదని అంటాడు. పంచమి గురించి చెప్పి పంచమి గర్భంలో పూర్వపు మహారాణి మళ్లీ నాగలోకం వెళ్లాలని ప్రయత్నిస్తుందని పంచమి గర్భంలోని బిడ్డను చంపితే పగ తీరుతుందని అంటుంది. అందుకు తనకు గురుడ శక్తులు ఇవ్వమని కోరుతుంది. గురుడ రాజు సరే అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కాజల్‌తో నవీన్ చంద్ర లవ్లీ రొమాంటిక్ సాంగ్ - సత్యభామ సరసం చూడండి

టాప్ హెడ్ లైన్స్

Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ RedFlagsను అస్సలు విస్మరించొద్దు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Embed widget